NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కొత్త రైతు చట్టాల వల్ల తెలుగు రైతులకి నష్టం లేదా..? అందుకే ఊరుకున్నారు

దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళన ఢిల్లీ రాజకీయాలను హిట్ ఎక్కిస్తోంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాల నిరసిస్తూ అనేక ధర్నాలు చేపట్టిన వారి డిమాండ్లు ఇంకా తీరనే లేదు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టువిడుపు ధోరణలు అవలంబించడం లేదు. ఇలాంటి సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఈ చట్టాల పై వెంటనే స్పందించకపోవదానికి ఉన్న కారణాలను పలువురు వ్యవసాయరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు…

 

ఉత్తరాది సంగతి ఇలా….

ఇంతకీ విషయం ఏమిటంటే మార్కెట్ వ్యవస్థలో ఉన్న తేడాల కారణంగానే తెలుగు రైతులు ఈ చట్టాలను పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. పంజాబ్ హర్యానా రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులను అక్కడి ప్రభుత్వాలు కొనుగోలు చేస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మార్కెట్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. లెక్కలు చూస్తే ప్రభుత్వం కొనుగోలు చేసేది కొద్ది శాతం. ఇక రైతుల వద్దకు వెళ్లి కార్పొరేట్ కంపెనీలు కొనుగోలు చేయడం ప్రారంభిస్తే రైతులు ఇంకొక దారిలేక వారికే అమ్ముకునే పరిస్థితులు ఉంటాయి. అప్పుడు అక్కడి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.

ఇదీ వారి ఆలోచన…

పంజాబ్ తో పాటుగా ఉత్తరాది లోని రైతులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు అంటే దానికి కారణం వారికి చట్టాల పైన పూర్తి అవగాహన ఏర్పడటమే. రైతుకు పావలా అందిస్తే మార్కెట్కు వచ్చేసరికి పది రూపాయలు అవుతుంది. ఇక ఈ కొత్త చట్టాల వల్ల ప్రభుత్వం నుంచి సాయం కూడా అందదు. ఈ కారణంగా ఈ చట్టాలు తమపై పెద్ద ప్రభావం చూపుతాయని వారంతా ఆందోళన చెందుతున్నారు. కేవలం కార్పొరేట్ కంపెనీలకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తే వారికి భారీ నష్టం జరుగుతుందన్న ఆలోచనలో వీరంతా ఉన్నారు.

మన పక్క ఎలా..?

కానీ దక్షిణాది కి వచ్చేసరికి వ్యవసాయ మార్కెటింగ్ విధానంలో కొంత మార్పు ఉంటుంది ఈ కారణంగా ఆ చట్టాలు తమ పై పెద్దగా ప్రభావం చూపవు అన్న ఆలోచనలో వీరంతా ఉన్నారు. అందుకే వారు నిరసన కూడా తెలియడం లేదు. అయితే ఈ చట్టాల పై విస్తృతమైన చర్చ మాత్రం జరగలేదు. బాగున్న ధాన్యం కోసం రంగుమారిన ధాన్యం అమ్మకం కోసం రైతు భరోసా కేంద్రాలు సహకార సొసైటీ లో చుట్టూ ఇక్కడ రైతులు తిరుగుతున్నారు. ఈ సమయంలో కొన్ని ఇబ్బందుల వల్ల రైతులు ప్రైవేటు వ్యాపారులు వైపు వెళ్లి వారు ఇచ్చిన రేటుకే అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రైవేట్ వ్యాపారులు రైతు పొలంలోనే ధాన్యం కొనుక్కొని తీసుకుని వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి.

అదే మేలేమో అన్న ఆలోచన…

కాబట్టి ఇక్కడ దాదాపు అంతా వ్యాపారులు చేతుల్లోనే ఉంటుంది. పంట పండించిన తర్వాత దాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకోవడం ఎలా అన్న ప్రశ్నకు ఇక్కడ ప్రైవేటు వ్యాపారుల సమాధానం గా ఉన్నారు. ప్రభుత్వం కొనుగోలు నామ మాత్రంగా ఉన్నాయి. తెలంగాణలో మాత్రం కొంత భాగం వ్యవసాయ మార్కెట్లలో కొనుగోలు చేసే వారు కానీ ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది. రైతుల కష్టం దళారుల పాలు అవుతోంది. ఈ కార్పొరేట్ వ్యవస్థ వల్ల పరిస్థితి ఏమన్నా కొద్దిగా మారుతుంది అన్నట్లు వారూ సైలెంట్ గా ఉన్నారు అని చెబుతున్నారు. అదే అసలు సంగతి.

Related posts

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju