NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఇక భవిత ఈ వాహనాలదే…! ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వాల దృష్టి

 

 

హైదరాబాద్లో అడుగున నిత్యం ఆర్టిసి బస్సులు తిరుగుతూనే ఉంటాయి. బస్సులు ప్రయాణికులతో పాటు పొల్యూషన్ కూడా మొసుకుని వస్తాయి. ఆర్టీసీ బస్సుల పొగ వల్లే నగరంలో అధిక కాలుష్యం. అందుకే ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతుంది తెలంగాణ సర్కార్. ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేసే దిగ్గజ కంపెనీలు బస్సుల తయారీకి 300 కోట్ల పెట్టుబడి 3000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ప్రభుత్వం సైతం అనేక రాయితీలను కల్పిస్తుంది. ఇప్పటికే 40 గ్రీన్ బస్సులు హైదరాబాద్ లో సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్తోపాటు, ముంబై, పూణే, కేరళ, హిమాచల్ ప్రదేశ్ లో సైతం ఎలక్ట్రికల్ బస్సులు రన్నింగ్ లో ఉండడం విశేషం.

 

 

 

 

ఎలక్ట్రిక్ బస్సులే కాదు. బ్యాటరీ స్కూటర్లకు కూడా మార్కెట్లో బాగా డిమాండ్. ఈమధ్య ఎలక్ట్రికల్ టూవీలర్ ఉన్నవారి సంఖ్య బాగా పెరుగుతుంది. కస్టమర్స్ కనుగుణంగా స్కూటర్స్ లో స్పీడ్, హై స్పీడ్అందుబాటులో ఉన్నాయి. లో స్పీడ్ లో మహిళలకు ,పెద్ద వాళ్లకు ఎవరికైనా సరే వెహికల్ కు రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. ధర కూడా తక్కువే.

కాలుష్య రహిత ఎలక్ట్రికల్ వెహికల్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పర్యావరణ హితంగా కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, బెంజిన్ వంటివి వెలువడకుండా నివారించవచ్చు. శబ్ద కాలుష్యం ఉండదు. వీటి వలన ఇన్ని ప్రయోజనాలు ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రోత్సాహాలు ప్రకటించింది. కొనుగోలుదారులుకు అవగాహన పెరిగితే భవిష్యత్తు ఎలక్ట్రికల్ వెహికల్స్ దే .

 

 

 

తెలంగాణ కొత్త ఎలక్ట్రికల్ వెహికల్స్ పాలసీలో అనేక వరాలు. వీటికి వెహికల్ రిజిస్ట్రేషన్ చార్జీలు లేవు. రోడ్డు టాక్స్ ఉండదు. వీటినుంచి ౧౦౦శాతం మినహాయింపులు ప్రకటించింది. 20 వేల ఆటోలు, 5వేల ప్యాసింజర్ వెహికల్స్, తొలి 2లక్షల ఎలక్ట్రికల్ వెహికల్స్ బైక్స్ కు, 5000 కార్లు, 500 బస్సులు,10000 ట్రాన్స్పోర్ట్ త్రీవీలర్స్, ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు 100% రద్దు చేసింది. ఇంతకంటే బంపర్ ఆఫర్ ఇంకేముంటుంది.

తయారీదారులను పరిశ్రమ వర్గాలకు భారీస్థాయి లో ప్రోత్సాహకాలను అందిస్తుంది. 200 కోట్ల పెట్టుబడికి ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ చేపట్టే పరిశ్రమలకు 30 కోట్లు తగ్గకుండా 20 శాతం పెట్టుబడి సబ్సిడీ. 25 కోట్లకు తగ్గకుండా ఏడేళ్ళ పాటు జిఎస్టి తిరిగి చెల్లింపు. ఐదేళ్ల పాటు ఐదు కోట్ల పరిమితితో 25% విద్యుత్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుము మినహాయింపు. ఇలా విద్యుత్ వాహనాల సంస్థల తయారీపై వరాల జల్లు కురిపించింది తెలంగాణ సర్కారు.

 

 

అటు ఏపీ ప్రభుత్వం సైతం ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహించే దిశగా అనేక చర్యలు తీసుకుంటుంది. 250 కోట్ల తో టెస్టింగ్ ఫెసిలిటీ ని సిద్ధం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలకు ఎలక్ట్రిక్ బైక్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీ వ్యాప్తంగా 420 చార్జింగ్ స్టేషన్లు, నేషనల్ హైవే లపై 25 కిలోమీటర్ల కు ఒక చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రోత్సాహకాలతో భవిష్యత్తు అంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటున్న నిపుణులు.

రెండు ప్రభుత్వాలు తీసుకొచ్చిన కొత్త పాలసీలు బాగున్నాయి లాభసాటిగాను ఉన్నాయి. అయితే ప్రజల్లో మార్పు రావాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రాధాన్యతను వాహనదారులు గుర్తించాలిసి ఉంది. విద్యుత్ వాహనాలపై ఉన్న అపోహలను తొలగించాల్సి ఉంది. అలా జరిగితే తెలంగాణ, ఏపీలో
ముందు అంతా మంచి కాలమే. ఎలక్ట్రిక్ వాహనాల ను వాడితే పర్యావరణానికి హాని తగ్గించడమే కాకుండా రేపటి తరానికి మార్గదర్శకం.

author avatar
bharani jella

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N