గెలుపు : గెలవడానికి అన్నీ మెట్లు అక్కర్లేదు గురూ… కానీ ఇదొక్కటీ కావాలి

Share

ఏదేమైనా గెలుపు లో ఉండే రుచే వేరు. మానవుడి మనుగడ సక్సెస్ అనే ఒక మంత్రం పై నడుస్తుంది. సరిగ్గా మన ఆలోచనలను ఆచరణలో పెడితే ప్రతీ మనిషి గెలుపు గుర్రమే. పరిస్థితుల ప్రభావం వల్లనో, సొంత తప్పిదాల వల్లనో మరియు అతి మంచితనం ఇంకా దుర్బుద్ధి వల్లనో రేసులో దూసుకెళ్ళసిన గుర్రాలన్నీ ఇంట్లోనే కీలుబొమ్మలుగా మిగిలిపోతున్నాయి. ఇక ఈ సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి…?” అని మదనపడేవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అలా గందరగోళానికి గురి అయ్యే చాలా మందికి సమాధానంగా ఒక ముఖ్య విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం.

 

How to Align Your Career With Your Personal Definition of Success ...

‘అవకాశమే’ ఆధారం…! 

జీవితంలో ఫెయిల్యూర్ అనేది అత్యంత ప్రాథమిక మరియు ప్రమాద సూచిక. దానిని పాజిటివ్ గా తీసుకుని లోలలను సరిదిద్దుకొని ముందుకు వెళ్తే బాగుపడతారు కానీ దాన్ని అలవాటు చేసుకుంటే మాత్రం మనకు తెలియకుండానే ఎన్ని అడుగులు వెనక్కి వెళ్ళిపోతామో తెలియదు. ఓటమి నుంచి గెలుపు దిశగా అడుగులు వేయాలి. గెలుపు నుంచి మనం చాలా తక్కువ నేర్చుకుంటాము కానీ ఓటు మాత్రం ఎక్కువ నేర్చుకుంటాం. అసలు గెలుపు లేదా ఓటమి వైపు మన ప్రయాణం అన్నది ఒక అవకాశం దక్కినప్పటి నుండే మొదలవుతుంది. ఎప్పటికైనా అవకాశం మనం అందిపుచ్చుకునే తీరులోనే మన సక్సెస్ రేటు ఆధారపడి ఉంటుంది.

Success and more | Manager's Office

తప్పటడుగేస్తే తిరిగి రాలేము సుమీ..! 

ప్రతీ ఒక్కరు సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతోనే ప్రయత్నాలు మొదలు పెడతారు కానీ వచ్చిన అవకాశం వల్ల మనం సక్సెస్ అవుతామా లేదా అనే విషయం కన్నా మనం ఈ అవకాశాన్ని సరిగ్గా అందుకు పుచ్చుకుంటే ఎంతటి సక్సెస్ రేటు సాధిస్తాం అన్నదే పాయింట్. ఇప్పుడు మనకు నాలుగైదు అవకాశాలు ఉంటాయి లేదా ఒకే అవకాశాన్ని తీసుకోవాలా వద్దా అన్నా రెండు ఆప్షన్లు ఉంటాయి. దీనిని ఎంపిక చేసుకోవడం లోనే మన అతి పెద్ద సవాలు దాగి ఉంటుంది. ఒక అవకాశాన్ని తీసుకున్న తర్వాత గెలుపుకి కారణం అయ్యే మెట్లు అనేకం ఉండొచ్చు. వాతిలో సక్సెస్ దిశగా ఒకదాని తరువాత ఒకటి ఎక్కుతూ ప్రయాణించవచ్చు…. మనకి అవసరమైనప్పుడు కిందకి దిగి మళ్లీ తప్పు సరిదిద్దుకొని అదే మెట్టు ఎక్కవచ్చు. కానీ ఒక అవకాశాన్ని అంది పుచ్చుకొని సక్సెస్ ఈ మెట్ల వైపున ఉందనుకుని ప్రయాణం మొదలు పెడితే తిరిగి వెనక్కి వచ్చినా మిగిలేది గోడ మాత్రమే.

Narcissistic people can be more prone to success, study shows ...

వాళ్ళకూ…. నీకూ తేడా చూపించు

కాబట్టి మనం చేస్తున్న పని సక్రమంగా చేయడం కాకుండా అసలు మనకు వచ్చిన అవకాశం మనం జీవితంలో నిర్దేశించిన లక్ష్యాలను మనల్ని చేరువుగా చేస్తుందా లేదా ఎక్కడి వరకు తీసుకు వెళుతుంది లేదా అసలు పూర్తిగా దూరం చేస్తుందా అన్న అంశంపైనే దృష్టి పెట్టాలి. ఇది తెలియక చాలామంది ఉపయోగపడే అవకాశాలను కాలదన్నుకొని…. అనవసరమైన వాటిని ఎన్నుకొని చివరికి కాంప్రమైజ్ అయిపోయి కాలాన్ని వెళ్లదీస్తున్నారు. అలాంటి వారు త్వరగా మేల్కొని తమ జీవిత అనుభవాలతో, లోకజ్ఞానం, విజ్ఞతతో పరిస్థితులను విశ్లేషించుకుని నిర్ణయం తీసుకోవాలని సాటి మానవులగా మా సలహా. ఈ ఒక్క విషయాన్ని సరిగ్గా చేస్తే నేరుగా సక్సెస్ వైపు గా వెళ్ళే ఆఖరి మెట్టు పై మనలను నిలబెడుతుంది. ఇక మనం చేయాల్సిందల్లా జారిపడకుండా జాగ్రత్త పడి చేయి చాచి దానిని అందుకోవడమే.


Share

Related posts

ఇవి మనుషులు తాగే నీళ్లా ? ఏలూరు శాంపిల్స్ చూసి విస్తుపోయిన శాస్త్రవేత్తలు

Special Bureau

ఏం చేస్తే అదే ఘనకార్యం?

Siva Prasad

హైటెక్ “మోత” – రోబో వాత!

Siva Prasad