NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ది రివెంజ్ స్టార్ట్స్ : గులాం నబీ ఆజాద్ ఉగ్రరూపం చూడనున్నారు ?

ఎప్పటినుండో కాంగ్రెస్ పార్టీకి బలహీనత అంతర్గతంగా ఏర్పడిన గ్రూపులే. ఏ పార్టీలో అయినా ఇలాంటివి కామన్ అయినప్పటికీ… ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం అవి ఆ పార్టీకి తీరని లోటు చేస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలో బలహీనుల కేటగిరీలో సీనియర్ నేతలు ఉన్నారు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో చక్రం తిప్పి 70 80 ఏళ్ళు వచ్చినా వారు రాజకీయ యువతను ప్రోత్సహిస్తున్నట్లు కనిపించడం లేదు .అంతే కాదు నేటికీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ ఎన్నికల్లో మాత్రం సీట్లు దక్కించుకుని రాజ్యసభలోనూ, రాష్ట్రాల్లో శాసనమండలిలో చక్రం తిప్పుతూ హస్తానికి సమస్య గా మారారు అన్నది విశ్లేషకుల మాట.

 

ముందు రాహుల్ పసిగట్టాడు.. యుద్ధం మొదలెట్టాడు

ఇక ఇలాంటి సమయంలో లో అన్నీ గమనించిన రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకుంటూనే అన్నీ కార్యవర్గాలను రాజీనామాలు చేయాలని కోరి ప్రక్షాళన చేద్దాం అనుకున్నాడు. అయితే అతనికి చివరికి చేదు అనుభవమే మిగిలింది. ఇక ఈ పరిస్థితి మొత్తాన్ని నడిపించిన నేతగా గులాంనబీ ఆజాద్ అని చెబుతారు. అతనే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైగా నిన్న జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ లో కూడా రాహుల్ గులాం నబీ ఆజాద్ ని ఉద్దేశించి పార్టీలో అతని వల్లే పొరపచ్చలు వస్తున్నాయని…. చాలా మంది నేతలు ఇండైరెక్ట్ గా బిజెపికి సపోర్ట్ చేస్తున్నారు… ఇందుకు సంబంధించి అతని సమాధానం ఏమిటి అని కూడా అడిగాడట.

రాహుల్ ది న్యాయం.. వీళ్ళది అవకాశావాదం?

ఇకపోతే సమావేశంలోనే అందరి ముందు గులాం నబీ ఆజాద్ ధీటుగా సమాధానం ఇచ్చారు. తను బిజెపి వారి పక్కన ఉన్నట్లు నిరూపిస్తే ఇప్పటికిప్పుడు పార్టీ వదిలి రాజీనామా చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఇప్పటికే రాజస్థాన్ లో కొదిలో ప్రతి పక్షంలోకి వెళ్లే పరిస్థితిని కాంగ్రెస్ తప్పించుకుంది. ఇక మధ్యప్రదేశ్ లో అధికారం నిలబెట్టుకోలేక ప్రతిపక్షంలో కి వెళ్ళిపోయింది. ఈ రెండు చోట్ల పార్టీల యువ నాయకులు అధిష్టానంపై చేసిన తిరుగుబాటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో రాహుల్ యువకులను ఎక్కువగా ప్రోత్సహిస్తూ సీనియర్లను పట్టించుకోవడం లేదు అన్న వార్తలు వస్తున్న సమయంలో సీనియర్లు అంతా కలిసి మళ్లీ సోనియాగాంధీ నాయకురాలిగా కొనసాగాలని.. అప్పుడే తమ ఆటలు సాగుతాయి అన్నట్లు లేఖరాశారు. దీనిపై కూడా రాహుల్ సమావేశంలో తీవ్రంగా ఆగ్రహించారు

సీనియర్లంతా ఒకటైపోయారు

ఇక్కడ ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది గులాం నబీ ఆజాద్ కి సోనియా కావచ్చు ప్రియాంక కావచ్చు లేదా మరో గాంధీయేతర తన కుటుంబానికి చెందిన నేత కావచ్చు.. కానీ రాహుల్ మాత్రం అధ్యక్షుడిగా కొనసాగితే అతను ఓర్వలేనట్టు ఉంది. అందుకే సిడబ్ల్యుసి సమావేశం తర్వాత గులాం నబీ ఆజాద్ ఇంట్లో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలువురు సీనియర్ నేతలు హాజరు కావడం చర్చనీయాంశంగా. మరి తనపై వచ్చిన నిందలకు ప్రతీకారంగా ఏదైనా నిర్ణయం తీసుకున్నారా గులామ్ సాబ్?

రాహుల్ పైకి సీనియర్లంతా దూకుడే మంత్రంగా దండయాత్ర చేయనున్నారు అని…. సోనియా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని…. సో, ఆమెకు అధ్యక్ష పదవి ఇచ్చి చేతులు కట్టి పడేసి రాహుల్ పై డైరెక్ట్ అటాక్ చేయడమే మిగిలి ఉందని విశ్లేషకుల మాట.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju