Subscribe for notification
Share

నగరి ఎమ్మెల్యే రోజా ఇప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఉండే వ్యక్తి. ఇటు జబర్దస్త్ లో ఎప్పుడూ హాయిగా నవ్వడం ఆమె మర్చిపోరు. ఇక రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆమె పదునైన మాటలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తారు. అలాంటి రోజా ఇప్పుడు తనకు జిల్లాలో అధికార గణం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదని, వారు కనీసం తనను పట్టించుకోవడం లేదని… తన మాట వినడం లేదని సోమవారం తిరుపతికి వచ్చిన శాసనసభ ప్రైవిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ ముందు ఏడవడం పెద్ద చర్చకు దారి తీసింది. ప్రత్యర్థులను తన మాటలతో ఏడిపించే రోజా ఒకే సారి ఇలా ఏడవడం వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైతం ఒకేసారి షాక్ కు గురి చేసింది. తనకు జిల్లా అధికారులు దగ్గర నుంచి సరైన మర్యాద లేదని సమాచారం ఉండడం లేదని తన మాట పట్టించుకునే వారు ఎవరూ లేరంటూ ఆమె బోరున విలపించారు ఇప్పుడు అధికార వైఎస్ఆర్సీపీలో చర్చనీయాంశమవుతోంది. అసలు ఏం జరిగింది రోజా ఎందుకు యాడ్ చేశారు అన్న విషయం మీద రకరకాల పుకార్లు అప్పుడే సోషల్ మీడియా వేదికగా బయలుదేరాయి. ఏదైనా సూటిగా సుత్తి లేకుండా ప్రజల్లో ఉండే రోజా ఇలా అధైర్య పడుతూ కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు సైతం అయోమయంలో పడేస్తోంది.

అదంతా పెద్దిరెడ్డి మాయ!

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే వేదం. ఆయన మొత్తం జిల్లా శాసిస్తారు. ఆర్థికంగా బలమైన నేత కావడం, సీనియర్ కావడంతో జగన్ సైతం ఆయనను ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. కృష్ణాజిల్లా బాధ్యతలతో పాటు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆయన చాలా కీలకం. చంద్రబాబు సమకాలికుడు గా పేరు నాయన చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేస్తారన్న… దాదాపు జిల్లాలోని సగం నియోజకవర్గాలను ఆయన ప్రభావితం చేయగలరని పేరు. అయితే ఇటీవల రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగిరి నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా నాయకులు విడిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా పనిచేసిన కేజే కుమార్ ఓ వర్గం గా ఏర్పడి తన వర్గానికి టికెట్లు కేటాయించుకోవడం దానికి రోజా అడ్డుతగలడం పెద్ద వివాదం అయింది. రోజా దీనికి ప్రతిస్పందిస్తూ సోషల్ మీడియాలో కార్యకర్తలకు ఇచ్చిన సందేశం సైతం వివాదం అయింది. అయితే సదరు కుమార్ వర్గానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు పుష్కలంగా ఉండటంతో రోజా ఏమీ చేయలేని పరిస్థితిలో వెళ్లిపోయారు. సదరు కుమార్ షష్టిపూర్తి కార్యక్రమానికి సైతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోపాటు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సైతం హాజరు కావడం… వైయస్సార్సీపి కార్యకర్తలకు సైతం సంకేతం అందించినట్లు అయింది. దీంతోనే క్రమంగా రోజా ప్రాబల్యం తగ్గడం మొదలైంది. జిల్లాలో అధికారులు ఎవరూ ఆమె మాట వినే పరిస్థితి లేకపోయింది. దీనంతటికీ వెనుక ఉన్నది కేవలం పెద్ద రెడ్డి మాత్రమే.

ఇటీవల కలుసుకున్న

నగిరి లో రెండు గ్రూపులు గా ఉన్న కుమార్, రోజా వర్గం ఇటీవల కలుసుకున్నారు. రోజా ఇంటికి సతీసమేతంగా వచ్చిన కుమార్ దంపతులు ఆమెకు శాలువాతో సత్కరించారు. ఇటీవల రెండు వర్గాలుగా ఉన్న వారు పరస్పరం కలుసుకున్న అప్పటికీ అంతర్గతంగా మాత్రం ఇంకా ఇరువురి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీని వెనుక మంత్రి ప్రమేయం ఉండడంతో జగన్ సైతం ఏమీ అనలేని పరిస్థితి.ఈ నేపథ్యంలోనే రోజా మాటను సైతం అధికారులు వినే పరిస్థితి లేకపోవడంతో ఆమె శాసనసభ ప్రెవేలేజ్ కమిటీ ముందు సోమవారం కన్నీరు కార్చుకుంది. ఇప్పుడు ఈ పరిణామం వైఎస్సార్సీపీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను బయటపెట్టినట్లు అయింది. కొందరు నాయకులను జగన్ సైతం ఏమీ చేయలేని పరిస్థితికి పార్టీ పరిస్థితిని ఇది అద్దంపట్టేలా కనిపించింది.


Share
Comrade CHE

Recent Posts

Salman Khan: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కి ఊహించని షాక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్..??

Salman Khan: ప్రస్తుతం చాలావరకు సినిమా నిర్మాణానికి సంబంధించి సౌత్ ఇండియా టాలెంట్ హవా కొనసాగుతుంది. ఈత బాలీవుడ్(Bollywood) స్టార్…

3 mins ago

Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…

44 mins ago

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

2 hours ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

2 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

3 hours ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

4 hours ago