NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఓహ్ – ఇలాంటి రాజకీయ స్కెచ్ లు కూడా ఉంటాయా… భేష్ అనాలో భయపడాలో తెలీయడం లేదు !

దేశం మొత్తాన్ని కాషాయం తో నింపేయాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్న భారతీయ జనతా పార్టీ ఏ అవకాశాన్నీ వదలడంలేదు. వరుసపెట్టి రాష్ట్రాలను తమ అధీనంలోకి తెచ్చుకుంటూ గోవా నుండి మొదలు పెట్టి కర్ణాటక వరకు ఇప్పటి వరకు జైత్రయాత్ర కొనసాగిస్తూనే ఉంది. ఇక ఎన్నికలలో అధికారంలోకి రాకుంటే ఓర్పుతో వెయిట్ చేసి మరి ఆ రాష్ట్రాన్ని వశం చేసుకోవడం బిజెపి నేతలకు వెన్నతో పెట్టిన విద్య గా మారింది. కర్ణాటక తర్వాత తాజాగా మధ్యప్రదేశ్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది.

 

SC to Hear Congress Plea over Inaction by EC against MCC ...

ప్రస్తుతం అటు వైపే వారి కన్ను

కర్ణాటకలో తిరిగి అధికారాన్ని చేపట్టడానికి బిజెపికి 14 నెలల సమయం పట్టింది. ఇక దానికి కొంచెం అటు ఇటుగా మధ్యప్రదేశ్ లోనూ జెండా ఎగురవేసింది. ఇప్పుడు గులాబీ పార్టీ తన చూపును రాజస్థాన్ వైపుకు తిప్పింది. బలం ఉన్న నేతలను తనవైపు తిప్పుకొని అధికారాన్ని దక్కించుకునే బిజెపి రాజస్థాన్ లో కూడా పాగా వేసేందుకు పెద్ద వ్యూహం రచించింది. దానికి పర్యవసానాలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇక బిజెపి రాజస్థాన్ లో కూడా జెండా ఎగరవేయడం ఖాయమని చెబుతున్నారు.

ఆ తర్వాత పెద్ద రాష్ట్రానికే టెండర్

నిజానికి బిజెపి ప్రభుత్వమే మహారాష్ట్రలో ఏర్పడవలసి ఉంది. అయితే బిజెపి శివసేన కలిసి పోటీ చేసి అత్యధిక స్థానాలను గెలుచుకున్నప్పటికీ సీఎం పదవి విషయంలో మధ్య భేదాలు వచ్చి దశాబ్దాల బంధానికి బీటలు వారింది. ఇక మామూలు రాష్ట్రాలనే బిజెపి వదిలిపెట్టదు అలాంటిది తమకు దక్కవలసిన రాష్ట్రాన్ని చూస్తూ చూస్తూ ఎలా వదిలేస్తుంది..? ఇంతలోపల కాచుకుని కూర్చున్న కాంగ్రెస్ శివసేన, ఎన్సీపీల తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ఆ కూటమిని దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఇప్పుడు వేగంగా అడుగులు వేస్తోంది.

శభాష్ అనాలా…. భయపడాలా..?

ఇప్పుడు ఇందులో భాగంగా కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే కూడా శరద్ పవార్ ను ఎన్డీఏ లోకి రావాలని సూచించారు. గత కొద్ది రోజులుగా శరద్ పవార్, ముఖ్యమంత్రి మధ్య పొసగడం లేదు. ఇక బిజెపి ఇలా వారిని టార్గెట్ చేస్తూ జెండా ఎగురవేసేందుకు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. వారి ప్లానులు, పనితనం చూసి పొగడాలో ఇకపోతే దేశంలో రాజకీయాలు ఇంత అన్యాయంగా ఉన్నాయని బాధపడాలో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక రాజకీయ నాయకులు వారి పనులు ఇలాగే ఉంటాయని.. ఎవరి జీవితం వారి చూసుకుని ముందుకు వెళ్దాం అంటే చివరికి అది తిరిగి తిరిగి బ్రతుకులపై ఎఫెక్ట్ పడుతుంది అన్న భయం కూడా మరొకవైపు ఉంది. ఇకపోతే బిజెపి ఊపు చూస్తుంటే వారు మహారాష్ట్ర ను కూడా కైవసం చేసుకోవచ్చు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju