ఈ విడాకుల కేసు తీర్పు చూస్తే భర్తలంతా చాలా హ్యాపీ ఫీలవుతారు…!

మనిషి జీవితంలో దాంపత్యం అనేది చాలా సున్నితమైన రిలేషన్. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండేందుకు ఎంతో అవగాహన అవసరం. అయితే వారు తమ జీవితం నచ్చనప్పుడు విడిపోవడానికి కూడా అంతే వెసులుబాటు కల్పించేలా చట్టాలు, భారత రాజ్యాంగం చేత రూపొందించబడ్డాయి. ఈ విషయం అంతా ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే తాజాగా చోటు చేసుకున్న ఒక విడాకుల కేసు అరుదైన తీర్పుతో ముగించబడింది.

 

భరణం భర్తకు శాపం….?

ఈ కాలంలో విడాకులు సర్వసాధారణం అయిపోయాయి. విడిపోతే భర్త సంపాదన నుండి భార్యకు ఎలాగో భరణం ఇవ్వాల్సిందే ఉంటుంది. ఇలా ఎంతో మంది మహిళలు భర్త కారణంగా తన జీవితాన్ని కోల్పోయిన వారు ఆర్థికంగా వెనుకబడి కాకుండా చట్టాలు రూపొందించబడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన భార్యకు దాదాపు 50 శాతం వరకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె మరో పెద్ద ధనవంతురలిగా దెబ్బకు మారిపోయింది. ఇక మన దేశంలో కూడా ఇలాంటి భారీ విడాకుల కేసులు చాలానే ఉన్నాయి. అన్ని చోట్ల భర్త భార్యకు ఖచ్చితంగా భరణం చెల్లించి చేరాల్సి ఉంటుంది.

ఇక్కడ సీన్ రివర్స్ అయిందే….

అయితే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఒక అరుదైన విడాకుల కేసు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. చాలా ఏళ్లుగా విడిగా ఉంటూ విడాకులు కావాలని కోరుతూ ముజఫరాబాద్ ఫ్యామిలీ కోర్టుకు ఎక్కిన ఈ జంటకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అయితే భర్తకు ఇది తియ్యనైన షాక్ కాగా భార్యకు మాత్రం బెంబేలెత్తించే తీర్పు వెలువడింది. సాధారణంగా విడాకులైన జంట విడిపోయిన తర్వాత భార్యకు భర్త భరణం ఇవ్వాలని కోర్టులు సూచిస్తాయి. కానీ ఇక్కడ భార్య ప్రభుత్వ పెన్షనర్. ఆమెకు నెలకు 12000 రూపాయల పింఛను వస్తుంది. భర్తకు మాత్రం పాపం ఇలాంటి సంపాదన లేదు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది.

నెల నెలా అంట పాపం….

హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం భార్య ప్రభుత్వ పెన్షనర్ అయినందువల్ల ఆమె నుండి భర్తకు భరణం ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. తన భర్తకు నిర్వహణ ఖర్చుల కింద భార్య ప్రతినెలా వెయ్యి రూపాయలు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. సోషల్ మీడియాలో దీనిపై భారీగా సెటైర్లు పేలుస్తున్నారు. ఒక పెద్ద వార్తగా దేశంలో ఈ తీర్పు మార్మోగిపోతోంది.