NewsOrbit
Featured ట్రెండింగ్ బిగ్ స్టోరీ

పవన్‎కి గోతులు తీసిన “ఆ నలుగురు”…! (ఎక్స్‎క్లూజివ్)

రీల్ లైఫ్…. 

నాక్కొంచెం తిక్కుంది… దానికో లెక్కుంది… ఇది నిజమే సినిమాల్లో ఇలాంటి డైలాగులు మాబాగా పేలతాయ్. రిల్ లైఫ్ వేరు… రియల్ లైఫ్ వేరు… రీల్ లైఫ్ లో డైరెక్టర్లు ఎక్కడా హీరో ఇమేజ్ దెబ్బతినకుండా కథలు రాస్తారు… కొన్ని సార్లు ఎక్జాజరేషన్ చేసి హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తారు. కథ రక్తికడితే కాసుల పంట పండుతుంది. కానీ రియల్ లైఫ్ వేరు… మన పక్కన ఎవరున్నారన్నదాని బట్టే మన వ్యక్తిత్వం… మన స్థాయి.. మన పరపతి ఆధారపడి ఉంటాయ్. ఈ విషయాలన్నీ ఎందుకా అనుకుంటున్నారా… ఇప్పుడు చెప్పబోతోంది జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించే. ఆయన సినిమాల్లో వరుస పరాజయాలతో తర్వాత కూడా సూపర్ డూపర్ హిట్టిచ్చి తన అభిమానులను మంత్రముగ్ధులను చేశారు.

 

Pawan Kalyan’s Attarintiki Daredi still
Pawan Kalyans Attarintiki Daredi still

రియల్ లైఫ్…

కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన పదేళ్లలో సాధించింది గుండుసున్నా… అవును రాజకీయాల్లో అన్నీ సార్లు ఎవరూ విజయం సాధించలేరు. సినిమాల్లో కూడా అంతే… సినిమా సక్సెస్ కావాలంటే కెమెరామెన్ దగ్గర్నుంచి దర్శకుడి వరకు ఎలా కష్టపడాలో… రాజకీయాల్లో కష్టపడాలన్నా అంతే… అధినేత చుట్టూ ఉన్న కోర్ టీం దగ్గర్నుంచి కార్యకర్తలు, నేతలు అందరూ కష్టపడితేనే సాధ్యమవుతుంది. సినిమాల్లో విజయవంతమైన ఫార్ములా రాజకీయాల్లో ఎందుకు రాజకీయాల్లో సక్సెస్ కాలేదు. ఇక అసలు కథ తెలుసుకోంది…

Pawan Kalyan Gajuwaka election rally
Pawan Kalyan Gajuwaka election rally

పవన్ కల్యాణ్‎కు కంచెగా ఆ నలుగురు

నాదెండ్ల మనోహర్

 

2014కు ముందు ఏపీ అసెంబ్లీ స్పీకర్‎గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీ పతనం తర్వాత రాజకీయంగా ఒంటరయ్యాడు. తన నియోజకవర్గం తెనాలిలో బలమైన కాపు సామాజికవర్గం ఓట్లను పొందడంతోపాటు… పవన్ కల్యాణ్ వద్ద కీలక నేతగా ఉంటే అది రాజకీయంగా తనకు కలిసి వస్తుందన్న అంచనాలతో జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పట్నుంచి కాంగ్రెస్‎ తరహా రాజకీయాలకు జనసేనలో బీజం వేశాడు. తండ్రి చంద్రబాబును అమ్మనా బూతులు తిడుతుంటే…తనయుడు మాత్రం… చంద్రబాబుకు అనుకూలంగా ఉండేలా పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టించాడని పార్టీ నేతలంతా బహిరంగంగా మాట్లాడుకుంటుంటారు. పార్టీని నాకించేసిన వారిలో నెంబర్ 1 ఈయనేనన్న అభిప్రాయం పార్టీలో ఉంది. తూర్పుగోదావరిలో పవన్ కల్యాణ్ పోటీ చేయాల్సిన నియోజకవర్గాన్ని మహిళకు కేటాయించి… రాజకీయంగా పవన్ కల్యాణ్‎ను దెబ్బతీశాడన్న అభిప్రాయం ఉంది. జనసేనలో కాంగ్రెస్ కల్చర్ తీసుకొచ్చి… గ్రూపు రాజకీయాలను పెంచి పోషించాడంటారు. ఇక చంద్రబాబుకు సన్నిహితుడు లింగమనేని రమేశ్‎తో మనోహర్‎కి సన్నిహిత సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యం.

 

pawan kalyan with nedendla manohar in election rally
pawan kalyan with nedendla manohar in election rally

ఆడిటర్ రత్నం

జనసేన ఫైనాన్స్ విభాగం ఈయన కనుసన్నల్లోనే నడుస్తుంది. వాస్తవానికి జనసేనకు అసలు ఎన్ని విరాళాలు వచ్చాయి… ఎంత ఖర్చు చేశాము… వాట్ ఈజ్ వాట్ అన్న లెక్కలన్నీ ఈయనకు మాత్రమే తెలుసు. పార్టీకి ఫండ్ అయినా, లేక ఇంకోటైనా ఈయనకు తెలియకుండా జరిగిందో ఇక అంతే సంగతులు. ఒకవేళ చచ్చీచెడీ వెళ్లినా… పవన్ ముందు గాలి తీయించేస్తాడు. NRIల నుండి వచ్చిన మనీకి లెక్కల్లేవన్న చర్చ పార్టీలో ఉంది. పైపెచ్చు టీడీపీ అధినేత చంద్రబాబు కోటరీతో నేరుగా సంబంధాలు నెరపుతాడంటారు. ప్రస్తుతం కూడా చంద్రబాబు నుంచి వచ్చే ఆదేశాలన్నీ పవన్ కల్యాణ్‎కి చేరవేసే టీంలో ఈయనే కీలకం. బీజేపీతో జనసేన పొత్తు… తర్వాత పరిణామాలన్నింటిని టీడీపీకి అందిస్తుంటాడు. టీడీపీ వ్యూహాలను పవన్‎తో పలికిస్తాడంటారు.

హనీఫ్

కింగ్ కోఠీలో ఓ చిన్న రూంలో ఉండే హనీఫ్ కొంత కాలానికి పవన్ కల్యాణ్‎కు నమ్మినబంటుగా మారాడు. పవన్ కల్యాణ్ చుట్టూ తిరగడం వల్ల సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ బాధ్యతలను చేపట్టి ఆయనకు దగ్గరయ్యాడు. 2014లో పవన్ కల్యాణ్‎తో ప్రచారం చేయిస్తానని… గత ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తానని బాగానే వెనకేసుకున్నాడన్న అభిప్రాయాన్ని పార్టీ నేతలు విన్పిస్తారు. చంద్రబాబు హయాంలో సీఎం పేషీ నుంచి ఏ శాఖ పనైనా ఇట్టే కానిచ్చేసేవాడట. మనీ డీలింగ్స్ అన్నీ హనీఫ్ ద్వారానే జరగుతాయంటారు పార్టీ నేతలు.

pawan kalyan with hari prasad
pawan kalyan with hari prasad

హరిప్రసాద్

మీడియా హెడ్‎గా… పవన్ కల్యాణ్‎కు రాజకీయ కార్యదర్శిగా పనిచేస్తున్న హరిప్రసాద్ ఒక జర్నలిస్ట్… తొలుత ఈనాడు, ఈటీవీలో పనిచేసి… ఆ తర్వాత చిన్న చిన్న చానెళ్లలో పెద్ద పెద్ద పదవులు నిర్వహించారు. పవన్ పార్టీ పెట్టాక కాపు కాసేందుకు వచ్చారు. రాజకీయంగా ఎలాంటి వ్యూహాలు అమలు చేసే సత్తా లేకున్నా పవన్ కల్యాణ్‎కి మాత్రం బంపర్ ఐడియాలిచ్చేస్తాడు. వాస్తవానికి ఆయన మీడియాపై వేసిన ముద్ర ఏమాత్రం లేదు. కానీ పార్టీపై మాత్రం భలే ముద్ర వేసాడు. ఆయనకు తెలియకుండా… ఆయన ప్రమేయం లేకుండా పవన్ కల్యాణ్‎కు ఏమీ తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇక పవన్ కల్యాణ్ ఎన్నారై ఫ్యాన్స్ నుంచి బాగానే దండుకున్నాడని పార్టీ ఆఫీసులో పనిచేసి సిబ్బంది చెవులు కొరుక్కుంటారు. మొత్తంగా హరిప్రసాద్  బిహేవియర్ వరస్ట్ అంటారు ఎక్కడ ఎవరైనా సరే.

ఆ నలుగురికి మరో నలుగురు

పవన్ కల్యాణ్ కీలక టీంలో నలుగురు ముఖ్యులున్నారు. వారిలో మహేందర్ రెడ్డి ఒకరు. ఈయన పవన్ కల్యాణ్‎కి వీరాభిమాని. పవన్‎ను కలిసినవారెవరైనా ఈయనతో టచ్‎లో ఉండాల్సిందే. లేదంటే ఖరారైన అపాయిట్మెంట్ కూడా లభించదు. ఏమంటే సార్ ఇప్పుడు బిజీ అనేస్తారు. పార్టీలో ఉపాధ్యక్ష పదవిలో ఉన్న ఈయనకు భజనంటే చాలా ఇష్టం… మీరు వింటుంది నిజమే… పవన్ కల్యాణ్ భజన కాదండీ… ఆయన సొంత భజన… తేడా వచ్చిందో ఇక అంతే. మరో ముఖ్యనాయకుడు శంకర్ గౌడ్. ఈయన తెలంగాణ ఇంచార్జి. రోల్స్‎లో ఆయన మహేందర్ రెడ్డికి ఏమాత్రం తీసిపోడు. తెలంగాణలో ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయన బొమ్మ పెట్టాల్సిందే. శంకర్ గౌడ్‎కు పవన్ కల్యాణ్ దగ్గర ఓ రేంజ్‎లో పరపతి ఉంది. వీరితో పాటు నగేష్, రియాజ్ మరో ఇద్దరు కోటరీలో కీలకం. మందు, విందు, పసందుతో అందివ్వగలిగే వారికి పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ ఇచ్చే లభించేలా చేసేయగల దిట్ట వీరు.

pawan kalyan with mahender reddy
pawan kalyan with mahender reddy

రాజకీయాలు వేరు… సినిమాలు వేరు

నమ్మిన వారి కోసం మెగా ఫ్యామిలీ ఎందాకైనా వెళ్తుంది. పర్సనల్ వేరు… రాజకీయాలు వేరు. చిరంజీవి తన చుట్టూ ఉన్న మిత్రులకు, వారి స్నేహితులకు కీలక అవకాశాలిచ్చి ఆదుకున్నారంటారు. అయితే అది సినిమాకే పరిమితమయ్యింది. కానీ జనసేనాని పవన్ కల్యాణ్ విషయం వేరు. ఆయన చుట్టూ ఉన్నవారిని రాజకీయాల్లోకి కీలక పాత్రల్లోకి తెచ్చి… అనవసరమైన కష్టాలు తెచ్చుకున్నాడంటారు. వాస్తవానికి నిజాయితీ, సచ్ఛీలత రెండు అంశాల్లో బలమైన పవన్ స్టార్ వ్యక్తిగత విషయాలను పక్కనబెడితే … మిగతా ఎవరికీ తక్కువకానీ నాయకుడు. రాజకీయంగా సరైన వ్యూహాలు లేకపోవడం వల్లే ఆయన ఈ రోజు ఇలా ఉన్నారు. అంతటి ఫాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి రెండు నియోజకవర్గాల్లో ఓటమి చెందారంటే అందుకు కారణం పవన్ కల్యాణ్ కాదు… ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఆయన నమ్మిన మనుషులే. ఇప్పటికేనా నిఖార్సయిన రాజకీయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కథనం రాయడం జరిగింది. అందుకు కావాల్సింది ఇంటిగ్రిటీ… చిత్త శుద్ధి. అది పవన్ కల్యాణ్‎లో మెండుగా ఉంది.

(నెక్ట్స్ ఆర్టికల్ లో  పొత్తులు, ఈడీ ఆటలు వెనుక అసలేం జరిగిందో తెలుసుకుందాం)

author avatar
DEVELOPING STORY

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri