NewsOrbit
Featured బిగ్ స్టోరీ

Tirupathi RUIA: రుయా సీక్రెట్లు భయపెడతాయ్.. ఎక్కడో వైఫల్యం వెంటాడుతున్నట్టే..!!

Tirupathi RUIA: Death Secrets got Viral

Tirupathi RUIA: తిరుపతి రుయా ఆసుపత్రిలో ఘోరం జరిగి నాలుగు రోజులు గడిచింది.. మరణాలు లెక్క తేల్చేశారు.. 11 మంది మాత్రమే ఆ రోజు ఆక్సిజన్ ప్రమాదంలో చనిపోయారని.. వారికి రూ. పది లక్షలు పరిహారం కూడా ఇవ్వనున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.. కానీ ఈ 11 మంది పేర్లు మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు. ఇక్కడే ఓ పెద్ద మతలబు దాగి ఉంది. ప్రతిపక్షాలు, ఆ మీడియాలు చేస్తున్న ఆరోపణలకు బలం వస్తుంది. “ఇదిగో రుయా ప్రమాదంలో ఈ 11 మంది చనిపోయారు. ఇంకెవ్వరూ ఈ ప్రమదాహములో మరణించలేదు. ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవం” అని ఏ ఒక్క అధికారీ.. ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు, మంత్రులు కూడా చెప్పలేకపోయారు. సో.., ఈ ఘటనపై ఇవే అనుమానాలు పెంచుతున్నాయి..!

Tirupathi RUIA: Death Secrets got Viral
Tirupathi RUIA Death Secrets got Viral

Tirupathi RUIA: జగన్ స్థాయిలో దృష్టి పెట్టి పరిష్కరిస్తేనే..!

ఇది చిన్న సమస్య కాదు. రాజకీయంగా చుట్టుకుంటుంది. మొదట ఉత్తుత్తి ఆరోపణలకు పరిమితమైన టీడీపీ నిన్న ఏకంగా ఇదిగో ఈ 35 మంది మరణించారు అంటూ పేర్లు కూడా ప్రకటించారు. ఇంకా రెండు అడుగులు ముందుకు వేసి దీనిపై న్యాయపరంగా కూడా పోరాడతామని, మరణాల లెక్కలు దాస్తున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇది మొత్తానికి చేటు చేసేలా ఉంది. అధికారులు, మంత్రులు దీనికి పరిష్కారం చూపలేకపోతే.., సమాధానం చెప్పలేకపోతే.. ఆ 11 మంది పేర్లు వివరించలేకపోతే.. సీఎం స్థాయిలోనే దీనికి పరిష్కారం వెతకాలి. ఆ దుర్ఘటనపై ఇంకా ఎన్ని రోజులు నాంచితే ప్రభుత్వానికి అంతగా నష్టం కలిగిస్తుంది. మరణాలు అనేవి ఇప్పుడు సున్నితమైన రాజకీయ అంశాలుగా మారిపోయాయి. ఆధారాలు, పేర్లు మొత్తం పట్టుకుని కోర్టుకి వెళ్తే సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది..!

Tirupathi RUIA: Death Secrets got Viral
Tirupathi RUIA Death Secrets got Viral

మొత్తం మరణాలు దాస్తున్నారు అంటూ ఆరోపణలు..!!

దేశం మొత్తం ఈ మహమ్మారి వలన జరిగిన మరణాలు దాస్తున్నారు అని ఒక ఆరోపణ ఉంది. దేశం మొత్తం మీద రోజుకి 12 వేల మందికి పైగా మరణిస్తున్న… ఏవేవో కారణాలు చూపించి ఆ లెక్కలను వేరే ఖాతాల్లోకి వేసేస్తున్నారు. ప్రజల్లో భయాలు, ఆందోళనలు తగ్గించడానికి కేంద్రం ఇలా చేస్తే చేస్తుండవచ్చు. అన్ని రాష్ట్రాలు కూడా ఇలాగే చేస్తే చేస్తుండవచ్చు. అదీ ఒకందుకు మంచిదే. మానసిక ధైర్యం వస్తుంది. కానీ ఏపీలో ఈ రుయా ప్రమాదం తర్వాత లెక్కల పరంగా ఇరుక్కున్నట్టు అయింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగిన తర్వాత జిల్లా కలెక్టర్ అధికారికంగా చెప్పేసారు. “11 మంది మరణించారు అని ప్రకటించారు. ఆ తర్వాత రోజు ఆ ఆసుపత్రి పర్యవేక్షక అధికారి మాత్రం “రోజు మొత్తం మీద 45 మంది మరణించారని ఒక జాబితా కూడా ఇచ్చారు” అదే రోజున చింతూరు జిల్లాలో కోవిద్ మరణాలు 18 మాత్రమే చూపించారు. ఇది మొత్తం గందరగోళానికి దారి తీసింది. ఆ 11 మంది వేరే అయితే… ఈ 45 మంది ఏ లెక్కన మరణించినట్టు..!? ఆ 11 మంది పేర్లు ప్రభుత్వం ప్రకటించినా.. నిన్న టీడీపీ ప్రకటించిన 35 మంది జాబితా పరిస్థితి ఏంటి..!? ఇలా లేనిపోని కొత్త అనుమానాలు చుట్టుకుంటున్నాయి. ఒక చిన్న అంశాన్ని సున్నితంగా మార్చి, మెడకు చుట్టుకున్నంతగా చేస్తున్నారు..!!

 

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju