అభ్యర్థిని ఒప్పించడానికి ఆపసోపాలు : టీడీపీ లో నిస్తేజం

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)

ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో చిత్తూరు తిరుపతి ఎంపీ టికెట్ ల గురించి టిడిపిలో ఎంతో పోటీ ఉండేది. టికెట్ మాకు కావాలంటే మాకు కావాలని నేతలు అధినేత వద్ద అభ్యర్థనలకు అభ్యర్థనలు పెట్టుకునేవారు. అలాంటి తిరుపతి లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయడానికి తెలుగుదేశం పార్టీ కింద మీద పడుతోంది. చివరకు తనకు టిక్కెట్ అక్కర్లేదని, మళ్లీ పోటీ చేసే ఉద్దేశం లేదని మొత్తుకున్న పనబాక లక్ష్మి కే టికెట్ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆమె మౌనం తో పాటు పార్టీ మారుతారని ప్రచారం జోరుగా సాగింది. దీంతో మధ్యవర్తిత్వం నిలిపి అభ్యర్థిగా ఈసారికి ఎలాగోలా పోటీ చేయాలని పనపాకం ఒప్పించేందుకు నెల్లూరు జిల్లా టిడిపి నాయకుడు సోమిరెడ్డి మధ్యవర్తిత్వం నేరిపారు. చివరకు పనబాక ఈ ఒక్కసారికి దిగొచ్చి బుధవారం సాయంత్రం చంద్రబాబును హైదరాబాదులో కలుసుకొని, పోటీలో ఉంటానని ప్రచారానికి వెళ్తానని తెలియజెప్పారు. దీంతో పనబాక అభ్యర్ధిత్వం వివాదం సమసిపోయి నట్లయింది. అయితే ఇప్పుడు అసలు కథ మొదలు కాబోతుంది.

అసలు టీడీపీ పోటీ ఎందుకు?

తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో 3 ఎస్సీ నియోజకవర్గాలు. గూడూరు సత్యవేడు సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో వై ఎస్ ఆర్ సి పికు 2019 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చింది. ఈ స్థానాల్లో టిడిపి కు సరైన గుర్తింపు లేదు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లోనూ టిడిపి కు ఆధిక్యత అంతంత మాత్రమే. రెండు లక్షల పైగా మెజార్టీ ను బల్లి దుర్గాప్రసాద్ అప్పట్లో సాధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో మృతి చెందిన బల్లి దుర్గాప్రసాద్ మృతిని అనుభూతి కోణంలో టిడిపి చూస్తూ అక్కడ పోటీకి నిలపడం గా ఉంటే హుందాగా ఉండేది. తిరుపతి లోక్సభ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కు గట్టి పట్టున్న నియోజకవర్గం. చిత్తూరు లోక్సభ పరిధిలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం రావడంతో అక్కడ వైఎస్ఆర్సిపి గెలుపు కష్టమయిన, తిరుపతి లోక్సభ పరిధిలో మాత్రం వైఎస్ఆర్సిపి కు గట్టి కేడర్ తో పాటు పట్టు ఉంది. ఇప్పుడు పోటీలో ఉన్న పనబాక లక్ష్మి సీనియర్ అయినప్పటికీ బల్లి దుర్గాప్రసాద్ మరణాన్ని కనీసం సానుభూతి కోణంలో కూడా టిడిపి చూడకుండా పోటీకి నిలిపింది అనే ప్రచారం ఎన్నికలలో వైఎస్ఆర్సిపి ఎత్తుకుంటే టిడిపికి గతంలో కంటే తక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు గ్రామాల్లో ఉన్న ద్వితీయశ్రేణి నాయకులు సైతం వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపేలా వాతావరణం కనిపిస్తోంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ మొదలైన వెంటనే అధికార పార్టీ లోకి తిరుపతి లోక్సభ పరిధిలో టిడిపి నాయకులు భారీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో అభ్యర్థిత్వాన్ని వెతకడానికి ఆపసోపాలు పడిన టిడిపికి, ఎన్నికల వేళ మరింత చేదు అనుభవం ఎదురయింది అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తర్వాత పార్టీ మార్పు?

తిరుపతి తెదేపా అభ్యర్థిగా ఖరారు అయిన పనబాక లక్ష్మి మొన్నటి వరకు బీజేపీ కండువా ఒప్పుకుంటారా అంటూ విస్తృత ప్రచారం జరిగింది. ఆమెకు పోటీ ఈ విషయంలో అంత ఇష్టం లేదని, పైగా కుమార్తె పెళ్లి ఉండడంతో పోటీ పూర్తిగా నిర్మించుకుంటాం అంటూ ఆమె టిడిపి నాయకుల వద్ద చెప్పారు. పనబాక అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే సమయంలో సైతం టీడీపీ అధినేత ఆమె సంప్రదించలేదు. ఈ విషయం పైన ఆమె గుర్రుగా ఉన్నారు. కనీసం తన ఇష్టాన్ని అభిమతాన్ని అడగకుండానే అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై కినుక వహించారు. ఆమె భర్త పనబాక కృష్ణయ్య కు బీజేపీ పెద్దలతో ఉన్న పరిచయాల దృష్ట్యా ఆమె కచ్చితంగా బిజెపి లోకి వెళ్తారు అంటూ ప్రచారం జరిగింది. దీంతో పాటు బీజేపీ టికెట్ ను ఖాళీగా ఉంచడంతో పనబాక బిజెపి లోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ తరపున బరిలో ఉంటారని ప్రచారం జోరందుకుంది. దీంతోపాటు పనబాక లక్ష్మి, కృష్ణయ్య దంపతుల మౌనం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే టీడీపీ అధినేత స్వయంగా తన భార్య లక్ష్మి పేరు ప్రకటించడంతో ఆమె పోటీలో లేకుంటే పార్టీ పరువు గంగలో కలిసిపోతుంది అనే కోణంలో మాజీ మంత్రి సోమిరెడ్డి ఆమెతో చర్చించారు. ఈ ఒక్కసారికి పోటీలో ఉండాలని, పార్టీ పూర్తిగా సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. నీ మాట్లాడిన తర్వాతే చంద్రబాబు ను కల్పించారు. దీంతో పనబాక లక్ష్మి కృష్ణయ్య దంపతులు బుధవారం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల్లో పాల్గొనేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే ఎన్నికల అనంతరం పనబాక లక్ష్మి ఓటమిని సాకుగా చూపి పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు లేకపోలేదని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.