NewsOrbit
బిగ్ స్టోరీ

Tollywood : ఎవరిని కదిలించినా ‘పాన్ ఇండియా’ జపమే..! రియాల్టీ లోకి రారా? 

Tollywood gets pan india fever

Tollywood : వాస్తవంగా మాట్లాడుకుంటేబాహుబలిసినిమా కి ముందుపాన్ ఇండియాఅనే పదం టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు అసలు పరిచయం లేదు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధించి ఈ పదానికి ఇక్కడ మొట్టమొదటిసారి శ్రీకారం చుట్టింది. 

 

Tollywood gets pan india fever
Tollywood

Tollywood : బాహుబలి పునాది వేస్తే

నటన, టాలెంట్ పరంగా చూసుకుంటే ప్రభాస్ కంటే మెరుగైన హీరోలు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు అని చాలా మంది అంటుంటారు. అయినప్పటికీ బాహుబలి సినిమాకి అతను పెట్టిన కృషి, చేసిన త్యాగాలు చివరికి తగిన ఫలితాన్ని ఇచ్చాయి. దీంతో ప్రతి ఒక స్టార్ హీరోకిపాన్ ఇండియాపిచ్చి పట్టుకుంది. టాలీవుడ్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడంతో దానిని వాడుకొని అందరూ అలా వెలిగిపోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు కానీ అందులో సక్సెస్ అవుతున్న వారు ఎవరూ పెద్దగా కనిపించడం లేదు. 

కెజిఎఫ్ మినహాయించి….

బాహుబలితర్వాత కేజిఎఫ్ తప్పించి మరే సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో క్లిక్ కాలేదు. కేజీఎఫ్ చిత్ర నిర్మాతలు కూడా దేశవ్యాప్తంగా పేరు వస్తే చాలు అనుకున్నారు కానీ ఈ రేంజ్ లో జనాలు రిసీవ్ చేసుకుంటాను అని అనుకోలేదు. ఒక రకంగా అదీ అదృష్టమే. రెండో భాగానికి మాత్రం ఎవరూ ఊహించని హైప్ వచ్చింది. కానీ పాన్ ఇండియా పేరుతో విడుదలైన మిగతా సినిమాలకు మాత్రం బయట పెద్దగా గుర్తింపు పొందలేదు. 

మెగాస్టార్ వల్లే కాలేదు!

మెగాస్టార్ చిరంజీవి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటుడే అయినారాజకీయాల కారణంగా ఎన్నో ఏళ్ల బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాతసైరా నరసింహారెడ్డిపేరుతో పాన్ ఇండియా సినిమా చేశారు. కానీ తెలుగురాష్ట్రాల ఆవల ఈ చిత్రానికి ఊహించిన ఆదరణ దక్కలేదు. విజయ్ సేతుపతి, అమితాబచ్చన్ లాంటి స్టార్లు ఉన్నప్పటికీ నార్త్ లో థియేటలు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. తమ స్థాయిని సరిగ్గా అంచనా వేయకుండా పాన్ ఇండియా రిలీజ్ అంటూ హంగామా చేస్తున్నారు కానీ వాటికి కనీస స్థాయిలో గుర్తింపు వస్తుందా లేదా అన్నది పట్టించుకోవట్లేదు. 

Tollywood : మంచు ఫ్యామిలీ మునిగిపోయింది…!

మంచు విష్ణు మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లోనే అంతంత మాత్రం. అలాంటివి అతనుమోసగాళ్లుసినిమా తీసేసి ఇది పాన్ ఇండియా రిలీజ్ అని హడావుడి చేశారు. చివరికి చూస్తే ప్రమోషన్ ఖర్చులు కూడా పెద్దగా వచ్చినట్లు లేవు. తెలుగు రాష్ట్రాల్లో వారే పట్టించుకోకపోతే ఇక బయట వారి గురించి మాట్లాడుకుని అనవసరం. విష్ణు తమ్ముడు మనోజ్ సినిమాఅహంబ్రహ్మాస్మికూడా పాన్ ఇండియా రిలీజ్ అంటున్నారు. పాన్ ఇండియా సినిమా తీయడానికిపాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయడానికి చాలా తేడా ఉంది. మనోజ్ కెరీర్ గ్రాఫ్ చూసినవారందరూ ఇటువంటి మాటలు విని విడ్డూరంగా ఎక్స్ప్రెషన్లు పెడుతున్నారు. 

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్నపుష్పసినిమా సైతం పాన్ ఇండియా బ్రాండ్ తో వస్తుంది. సుకుమార్ టాలెంట్, అల్లు అర్జున్ నటనా నైపుణ్యం చూసి ఈ సినిమాకు అటువంటి రేంజ్ రావచ్చు అని ఆశించవచ్చు కానీ తెలుగు రాష్ట్రాల బయట ఎలాంటి స్పందన ఉంటుందన్నది మాత్రం ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. తెలుగులో ఒక సినిమా తీసి వేరే భాషల్లో అనువాదం చేసినంత మాత్రాన దానిని పాన్ ఇండియా సినిమా అని అనుకోవడం పొరపాటని పలువురు సలహా ఇస్తున్నారు.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju