NewsOrbit
తెలంగాణ‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

టీపీసీసీ చీఫ్ రేసు : అందరిదీ ఓక బాధ అయితే కోమటి రెడ్డిది మరో బాధ…! సొంత వారే అసలు ప్రాబ్లం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పదవికి రేసులో ఇద్దరు సీనియర్ నేతలు మిగిలారు అన్న విషయం తెలిసిందే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ కుమార్ రెడ్డి లలో ఎవరో ఒకరికే ఈ పదవి కట్టబెట్టే విధంగా హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి రేవంత్ రెడ్డికి సీనియర్ల దగ్గరనుండి బాగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. కోమటిరెడ్డి కి మాత్రం సాధారణ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల దగ్గర్నుంచి పెద్దగా మద్దతు రాలేదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి మెజార్టీ సాధించాడు అని తెలుస్తోంది.

 

ప్రస్తుతానికి అయితే ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డి కి సొంత కుటుంబం నుండి వ్యతిరేకత రావడం అనేది పెద్ద షాక్ అని చెప్పాలి. అయితే ఇదేమీ ఉన్నట్టుండి పైన నుండి ఊడి పడలేదు. ఎప్పటినుండో అనుకుంటున్నదే కానీ ఈ కీలక సమయంలో బయట పడి అతనిని విస్మయానికి గురిచేసింది. విషయం ఏమిటంటే కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బిజెపి వైపు అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. గత కొంతకాలంగా అతను మోడీ జపం చేస్తున్నాడు.

అయితే చాలా కాలం నుండి కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని టిఆర్ఎస్ వారిని నల్గొండ జిల్లాలో ఆధిపత్యం చలాయించనివ్వకుండా చూస్తున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి దృష్టి పార్టీ వైపు ఉండడంతో వెంకటరెడ్డి బలహీనుడు అయిపోయాడు. అదంతా పక్కన పెడితే… కనీసం వచ్చి అతనికి గాంధీభవన్లో మద్దతు పలకడానికి కూడా రాజగోపాల్ రెడ్డి ముగ్గు చూపించలేదు. అసలు విషయం ఏమిటంటే ఇతను పార్టీ మారేందుకు అవసరమైన అనుచరులు వెంకటరెడ్డి వెనకాల ఉన్నారు. వెంకటరెడ్డి అధ్యక్షుడు రేసులో ఉన్నారు… రాజగోపాల్ రెడ్డి వెనుక ఇక పెద్దగా బలగం లేదు. ఇక ఆ కక్ష్యతోనే సోదరుడికి మద్దతు పలకకుండా దూరంగా ఉంటున్నారని అంటున్నారు. అలా వీరి మధ్య మొదలైన విభేదం ఎంతవరకు దారితీస్తుందో ఎవరికీ తెలియదు

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju