హైదరాబాద్ ఓటర్లను ఇళ్ళలోనే లాక్ చేస్తున్న టీఆర్ఎస్? కేసీఆర్ పై విమర్శలే విమర్శలు

కెసిఆర్ తాజాగా భారతీయ జనతాపార్టీ పై విపరీతమైన విమర్శలు చేసిన సంగతి పక్కన పెడితే ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. దేశంలో ఏ ఒక్క నాయకుడు ధైర్యం చేయని మాటలు మాట్లాడిన కేసీఆర్ అందుకు తగ్గట్టుగానే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు

 

ఆందోళనలో కేసీఆర్?

టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మొన్నటి వరకు ఏకచక్ర ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు కానీ దుబ్బాక ఎన్నికల్లో పరాజయంతో చాలా ఆందోళన పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించేందుకు తనదైన శైలిలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వాటిలో కొన్ని ప్రజలకు బాగానే అనిపిస్తున్నా…. చాలావరకు విమర్శలకు దారి తీస్తున్నాయి.

తెలంగాణ లో సెకండ్ వేవ్ అట..!

విషయం ఏమిటంటే కెసిఆర్ కరోనా వైరస్ కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి మొదట బాగానే అనిపించాయి కానీ లోతుగా విశ్లేషిస్తే విమర్శకులకు మంచి ఆయుధం అయ్యాయి. విషయం ఏమిటంటే…. కేసీఆర్ దేశంలో కరోనా సెకండ్ మొదలైందని స్పష్టంచేశారు. రాష్ట్రాల్లో కేసుల సంఖ్య లో పెరుగుదలను గమనించామని… కాబట్టి ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించి ఉండాలని అలాగే సామాజిక దూరం కూడా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో తప్పేముంది? ఇక్కడి వరకు బాగానే ఉంది కదా… కేసీఆర్ పైన ఎందుకు అందరూ విరుచుకుపడుతున్నారు అన్న సందేహం మీకు రావచ్చు….

వోటర్లను లాక్ చేసేందుకే…?

అసలు విషయానికి వస్తే…. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తే అది కేవలం ఓటర్ల శాతం తగ్గించడానికి అన్నట్లు కొంతమంది ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అసలే హైదరాబాద్ సిటీలో వోటర్ పర్సంటేజ్ 50 శాతం కన్నా తక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా సెకండ్ వేవ్ వచ్చేసింది అందరూ జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి అన్న మాటలు మాట్లాడితే ఓటర్ల శాతం తగ్గి ఆయన పార్టీకి మేలు చేకూరుతుందని అందుకని కావాలని అలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

అయితే జాతీయ మీడియా వర్గాల్లో లేదా మరే ఇతర రాష్ట్రాల్లో కూడా కనీసం సెకండ్ పైన సమాచారం లేదు కానీ కేసీఆర్ ఇక్కడ ఎన్నికలకు ముందు బయటకు అఫీషియల్ గా ప్రకటించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు