NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

నిజం ఒప్పుకొని నాలుక కరుచుకున్న ట్రంప్..! ఓటమి వల్ల మైండ్ పనిచేయట్లేదేమో…

అత్యంత హై వోల్టేజ్ ఎపిసోడ్ లతో సాగిన అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో చివరికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ అగ్రరాజ్యపు అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాడు. మొదటి నుండి ట్రంప్, జో బిడెన్ హోరాహోరీగా పోటీపడ్డారు. అయితే కీలక స్థానాల్లో విజయం సాధించిన జో బిడెన్ అతి స్వల్ప మెజారిటీతో మాజీ అధ్యక్షుడు వివాదానికి కేంద్ర బిందువైన డొనాల్డ్ ట్రంప్ పై విజయం సాధించారు.

 

ఆశలు రేపెట్టాడు..!

ఇంతకీ విషయం ఏమిటంటే జో బిడెన్ ఎన్నో గంటల కౌంటింగ్ తర్వాత సంపూర్ణ విజయం సాధిస్తే… ట్రంప్ మాత్రం మొదటి నుండి ఒకటే పాట అందుకున్నాడు. తాను ఎన్నికల్లో విజయం సాధిస్తానని, కచ్చితంగా తమ పార్టీ అధికారంలోకి వస్తుంది అని…. జో బిడెన్ ఓటమి ఖాయం అన్నది కౌంటింగ్ సమయంలో అతని ట్వీట్ల సారాంశం. సింగిల్ లైన్ ట్వీట్లతో ఊదరగొట్టేశాడు. నిజంగా ట్రంప్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడని అందరూ భావించారు. అదీ కాకుండా అప్పుడు ఆయన కొద్ది స్థానాల్లోనే వెనుకబడి ఉన్నాడు. ఇంకా అతనికి కంచుకోటగా చెప్పబడే రాష్త్రాల్లో లెక్కింపు పూర్తి కాలేదు.

ఒప్పుకోనేలేదుగా….

చివరికి ఓట్ల లెక్కింపు ముగిసింది ట్రంప్ కు అందరూ అనుకున్నట్లే పరాభవం తప్పలేదు. భారతీయులను వీసాల విషయంలో హింసించిన తీరు. ప్రపంచ దేశాలపై అతను చేసిన అనుచిత వ్యాఖ్యలు బాగా దెబ్బతీశాయి. పైగా కమలా హారిశ్ ఉపాధ్యక్షురాలిగా నిలబడడం కూడా బాగా తేడా కొట్టింది. ఆ తర్వాత మన ట్రంప్ తన ఓటమిని ఒప్పుకొనే ఒప్పుకోలేదు. తాను చట్టబద్ధంగా ముందుకు వెళ్తానని ఏదో మతలబు ఉందని తాను ఓడిపోలేదని ఎక్కడో కుట్ర జరిగిందని ఆరోపణల మీద ఆరోపణలు చేశాడు. ట్రంప్ సంగతి తెలిసిందే కాబట్టి అందరూ లైట్ తీసుకున్నారు. అసలు అతని మాటలు పట్టించుకునే నాధుడే లేడు కానీ అందులో ఎక్కడో ఒక చిన్న ఆశ… డొనాల్డ్ ఏదైనా కొత్త వివాదానికి తెరలేపుతాడేమో అని.

రిగ్గింగ్ ఎలక్షన్ రా…. నమ్మండిరా

ఇక చివరికి ట్రంప్ ఒక్కసారిగా తన రూట్ మార్చాడు. జో బిడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాడు అని అతనే స్వయంగా చెప్పాడు. అంతే…. అందరూ ఆశ్చర్యపోయారు. ట్రంప్ లాంటి మనిషి తన ఓటమిని ఒప్పుకోవడం ఏమిటి అని నోరు వెళ్ళబెట్టారు. అయితే ఏమైందో ఏమో…. వెంటనే జో బిడెన్ గెలిచాడు కానీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది అంటూ తన నాలుక కరుచుకున్నాడు ట్రంప్, అంతేకాకుండా ఫేక్ న్యూస్ మీడియా వారి దృష్టిలో జో బిడెన్ గెలిచాడని…. తానేమి ఓడిపోలేదని ఇంకా చాలా జరగాల్సినది ఉందని… ఇది ఒక రిగ్గింగ్ ఎలక్షన్ అని ఆరోపణలు పైన ఆరోపణలు చేశాడు.

అంతేకాకుండా రాజధాని వాషింగ్టన్ లో ట్రంప్ మగా మద్దతుదారులకు జో బిడెన్ యాంటిఫా యాక్టివిస్టులకు జరిగిన గొడవ కుట్రపూరితమైనది…. అదే జనాలను బిడెన్ వైపు మళ్లేలా చేసిందని ఆరోపణలపై ఆరోపణలు చేస్తున్నారు. చివరాకరికి ప్రజలు తెలిసిందేమిటంటే నువ్వు ఓడిపోయావు అన్న నిజం నీకు కూడా తెలుసు ట్రంప్ బాబాయ్ ఇంకెందుకు ఈ ఏడుపులు పెడబొబ్బలు…. తర్వాత జరిగే కార్యాచరణ చూడొచ్చు కదా అంటున్నారు..!

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!