NewsOrbit
ట్రెండింగ్ బిగ్ స్టోరీ

TTD Board: టీటీడీ జంబో.. పొలిటికల్ కాంబో..!

TTD Chairman: TTD Issues Going on Viral

TTD Board: వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా సున్నితమైన అంశాలు కూడా వివాదాలుగా మార్చేస్తోంది. సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయాలు కావచ్చు, ఆ పార్టీ నేతల వైఖరి కావచ్చు, కారణాలు ఏమైనా సున్నితమైన చిన్న చిన్న అంశాలు కూడా వివాదాస్పదం అయిపోతున్నాయి. దానిలో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండున్నర సంవత్సరాల్లో చాలా వివాదాల్లో చిక్కుకోంది. కాకపోతే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆయన సీనియారిటీ, అనుభవంతో చాలా వివాదాలను ఆయన చాకచక్యంగా పరిష్కరించలగలిగారు. అయితే ఇప్పుడు రెండవ సారి జెంబో బోర్డు నియామకం విమర్శలకు తావు ఇస్తోంది. విమర్శలకు తోడు ఆరోపణలకు తావు ఇస్తోంది. గతంలో ఎప్పుడూ కూడా టీటీడీ బోర్డు నియామకాల్లో ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు రాలేదు. కానీ ఎందుకో గానీ మొదటి సారి ఆరోపణలు వస్తున్నాయి. దీనిలో ఏపి బీజేపీ కూడా కుమ్మక్కు అయినట్లు అంటే వైసీపీతో బిజేపి కుమ్మక్కు అయి బీజేపీ నాయకులను బోర్డు సభ్యులుగా చేర్చి ఉంటుందా అన్న అనుమానాలు ఆరోపణలు వచ్చాయి.

TTD Board: Jambo But Political Combo
TTD Board Jambo But Political Combo

TTD Board: పెంచుకుంటూ పోతున్నారు..!?

టీటీడీ బోర్డు అంటే 2019కు ముందు 18 మంది సభ్యులుగా ఉండే వారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 37కి చేర్చారు. ఇప్పుడు తాజాగా నియమించిన బోర్డులో 81 మంది సభ్యులు ఉండటం విమర్శలకు తావు ఇస్తోంది. ఇందులో 30 మంది సాధారణ సభ్యులైతే 50మంది ప్రత్యేక ఆహ్వానితులు. ఈ ప్రత్యేక ఆహ్వానితులకు పాలకమండలి సమావేశాల్లో పాల్గొనరు, వారికి సమావేశాల్లో ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. కానీ సభ్యులకు ఉన్న ప్రోటోకాల్ దర్శనం తదితర సౌకర్యాలు అన్నీ ఉంటాయి. వాళ్ల వాళ్లకు బ్రేక్ దర్శనాలు చేయిస్తారు. సిఫార్సు లేఖలు ఇస్తారు. ఇంత మందితో జంబో బోర్డు వేయాల్సిన అవసరం ఏముంది. ఎవరిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇంత మందిని బోర్డులోకి తీసుకున్నారు అన్న ప్రశ్న వస్తోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఆధ్యాత్మిక కేంద్రంలో ఇంత మంది ప్రత్యేక ఆహ్వానితులు ఏమి చేస్తారు. వాస్తవానికి దేవస్థానం పరిపాలనకు సంబంధించి భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా దేవస్థానంకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం, ఆలయానికి వచ్చే ఆదాయం దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఒక పాలకమండలి బోర్డు ఉండాలి. అది పది మదో లేక 15, 20 లేదా 30 మంది ఉండటం న్యాయం. 50 మంది, 80 మంది సభ్యులు ఎందుకు అనే ప్రశ్న భక్తుల నుండి కూడా వినిపిస్తోంది. ప్రభుత్వ ఈ విచిత్ర వైఖరి ఎవరికీ అర్థం కావడం లేదు.

TTD Board: Jambo But Political Combo
TTD Board Jambo But Political Combo

కిషన్ రెడ్డి ఫిర్యాదులు..!?

మరో విషయం ఏమిటంటే ఈ బోర్డు డైరెక్టర్ల నియామకాల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదులు వేళ్లాయి. ఇది ఆయన అంతటితో ఊరుకోక కేంద్ర హోంశాఖకు, బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. తమ పేర్లు వాడుకొని కొంత మంది టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమితులైయ్యారు. దీనికో కశ్చితంగా అవకతవకలు జరిగే ఉంటాయి. కొంత మంది పాత్రపై అనుమానాలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపించాలి అని భావించారు. దీనిపై సీఎం జగన్మోహనరెడ్డికి కూడా ఆయన లేఖ రాశారు. తమ పార్టీ పెద్దలకు ఈ విషయాలను కిషన్ రెడ్డి చెప్పారు. నిజానికి టీటీడీ విషయంలో కేంద్ర బీజేపీ వేగంగా స్పందిస్తుంది. దీనిపై కేంద్రం కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. మరో వైపు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని మరింత ముదరకుండా సద్దుమణిగించే ప్రయత్నం చేస్తోంది. ఈ వివాదాన్ని ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది అన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఇంకో పక్క టీడీపీ కూడా టీటీడీ బోర్డు విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ కూడా రాశారు. ఇప్పుడు టీటీడీ బోర్డు అంశం రాష్ట్రంలో తీవ్ర హాట్ టాపిక్ అయ్యింది. ఈ అంశం జాతీయ స్థాయి ఇష్యూ కాకముందే చల్లార్చాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.

author avatar
Srinivas Manem

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri