NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

టీటీడీ కి పాత నోట్ల వ్యవహారం ఇప్పుడు గుర్తొచ్చిందా..??

నోట్ల రద్దు జరిగి నాలుగేళ్ల అవుతుంది. అప్పుడెప్పుడో 2016 నవంబర్ 8న నోట్ల రద్దు చేసి వాటిని రెండు నెలల్లో మార్చుకోవాలి అని ప్రధాని మోదీ టైం ఇచ్చారు. కానీ ఒక వ్యవస్థ మాత్రం నోట్ల మార్పిడి అసలు పట్టించుకోలేదు. నోట్ల రద్దు అయ్యాయని, తమ వద్ద ఉన్న పాత నోట్లు మార్చుకోవాలని, కొత్త నోట్లు తెచ్చుకోవాలని ఆ ఇంగితం కూడా మర్చిపోయింది. అందుకు ఫలితంగా 50 కోట్ల విలువైన పాత నోట్ల ను మూట కట్టుకొని తన దగ్గర పెట్టుకుంది. ఇప్పుడు ఈ నోట్ల ను మార్చే అవకాశం ఇవ్వండి అంటూ కేంద్రాన్ని వేడుకుంటుంది. ఇది చేసింది ఇంకెవరో కాదు సుప్రసిద్ధ టీటీడీ బోర్డు. టిటిడిలో ప్రస్తుతం రూ.50 కోట్ల విలువైన పాత ₹500 నోట్లు ఉన్నాయిట. వాటిని మార్చుకుని కొత్త నోట్లుగా తీసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు విన్నవించుకున్నారు. మరి ఆమె కరుణిస్తుందా లేదా? 50 కోట్లు మార్పిడికి అంగీకరిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

నిన్న కలిసిన అసలు విషయం ఇదేనా..? ఇంకేమైనానా..??

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిన్న మధ్యాహ్నం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ వివరాలు ఏమిటా అని ఆరా తీస్తే.. టీటీడీలో పాత నోట్లు 50 కోట్ల విలువైన ఉన్నాయని, వాటిని మార్చుకునే అవకాశం ఇవ్వాలని కోరారని బయటకు వచ్చింది. అది సహేతుకమే. ఈయన టీటీడీ పరంగా, ఆమె కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఇద్దరి మధ్య అధికారిక సబ్జెక్ట్. ఇంత వరకు బాగానే ఉంది. కానీ వైవీ కలవడంలో రాజకీయ ప్రాధాన్యత ఏమైనా ఉందా..? లేదా కేవలం టీటీడీ పనిమీదే వెళ్లి కలిసారా అనేది మాత్రం కొత్త చర్చకు దారితీస్తోంది. నిజానికి నేరుగా వెళ్లి కలవక పోయినా టిటిడి.. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మంచి ఖ్యాతి ఉన్న ప్రముఖ ఆలయం. సో.. టిటిడి ఈఒ ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికో లేదా కేంద్ర ఆర్ధిక మంత్రికో, లేదా ప్రధానమంత్రి మోడీకో లేఖ రాయిస్తే స్పందన సానుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే టిడిపి పట్ల బిజెపి గాని లేదా కేంద్ర పెద్దలు కానీ కేంద్ర ముఖ్య అధికారులు గాని కచ్చితంగా కరుణిస్తారు. 50 కోట్లు మార్చుకోవడం పెద్ద విషయమేమి కాదు. అనుమతి ఇస్తుంది. కానీ ఇక్కడ సుబ్బారెడ్డి నేరుగా వెళ్లి కేంద్ర మంత్రి ని కలిశారు అంటే ఇదే కాకుండా ఇంకో విషయం మీద కూడా టాపిక్ జరిగింది. మాట్లాడుకున్నారు అనేది మాత్రం పుకార్లు వస్తున్నాయి. అవి ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.

మొన్న బుగ్గన.. నిన్న వైవీ విషయం ఇదేనా..?

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిర్మల సీతారామన్ ను కలిశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని, నిధులు లేవని, కొంత ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. వినతి పత్రం ఇచ్చారు. నివేదికలు ఇచ్చారు. ఆ విషయాన్ని పక్కన పెడితే… రెండు రోజుల తర్వాత టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెళ్లి కలిశారు. అరగంట పాటు మాట్లాడి రకరకాల విజ్ఞాపనలు, వినతులు చేశారు. ఈ రెండు జరగడానికి 15రోజుల ముందు ఏమి జరిగిందో అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. విద్యుత్ సంస్కరణల విషయంలో, విద్యుత్ బిల్లుల విషయంలో వైసీపీ వ్యవహార శైలి సరిగ్గా లేదని, ప్రజలను, పరిశ్రమలను దోచుకునేలా ఉంటుందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అది జరిగిన తర్వాత నిర్మల సీతారామన్ మళ్ళీ ఏనాడూ వైసీపీ గురించి మాట్లాడ లేదు. కానీ వైసిపి మాత్రం భుజాలు తడుముకొంటోంది. నిర్మల విమర్శలకు ఆ తరువాత రోజునే సీఎం పేషీ లోని ముఖ్య అధికారిగా ఉన్న అజయ్ కలాం రెడ్డి వివరణ ఇచ్చారు. నిర్మల ఎంత ఘాటుగా వ్యాఖ్యానించారో అజయ్ కలాం ఇచ్చిన వివరణ కూడా అంతే ఘాటుగా ఉంది. అక్కడికి సరి పోయింది. కానీ రెండు వారాల తర్వాత రాష్ట్ర ఆర్థికమంత్రి వెళ్లి కలవడం. టిటిడి చైర్మన్ వెళ్లి కలవడం అనేది రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వైవీ సుబ్బారెడ్డి వైసీపీలో రాజకీయ అంతర విభాగాన్ని చూసే ఒక ముఖ్య నాయకుడు. విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి తో పాటు వైవీ సుబ్బారెడ్డికి కూడా రాజకీయ నిర్ణయాల్లో ప్రాధాన్యత ఉంటుంది. నిర్మల సీతారామన్ వైసీపీపై రాజకీయ విమర్శలు చేయడంతో వైసీపీ ముఖ్యనాయకుడైన వైవీ వెళ్లి నిర్మలను కలిసి పర్సనల్ గా వివరణ ఇచ్చుకున్నారని ఓ వర్గం లో టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా నిర్మల ఒకసారి విమర్శిస్తేనే వైసీపీ ఇన్ని సార్లు వివరణలు ఇచ్చుకోవడం పట్ల కొంత భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!