NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

దీదీ ముస్లిం పట్టు… బీజేపీ మంత్రం ఆకట్టు … ఎవరు రాబట్టు ఓట్లు ?

 

 

పశ్చిమబెంగాల్లో మమతా దీదీ ను ఓడించడం బిజెపి వల్ల అవుతుందా?? మమతా ఓటమి అంత సులభమా?? లోక్ సభ ఎన్నికల్లో 18 సీట్లు సాధించి ఊపు మీద ఉన్న బిజెపి కు అసెంబ్లీ పట్టు చిక్కడం అంత తేలికైన పనా?? బిజెపి కు బెంగాల్ లో ఎదురయ్యే అవాంతరాలు ఏంటి?? మిగిలిన రాష్ట్రాల్లో వలే పశ్చిమబెంగాల్లో సైతం బిజెపి చాణక్యం సరిపోతుందా?? అని అనేక ప్రశ్నలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి.

** ఒకప్పుడు బెంగాల్ రాజకీయం అంతా నాలుగు పార్టీల ఆటలా సాగేది. కాంగ్రెస్, వామపక్షాలు మమతా బెనర్జీ నువ్వా నేనా అన్నట్లు పోరు సలుపు తుంటే బిజెపి మాత్రం ఆటలో అరటిపండు తరహా రాజకీయాలు చేసేది. అయితే వామపక్షాలు క్రమంగా బలహీనపడడం బీజేపీ పట్టు పెరగడం, మోదీ హవా లో పశ్చిమబెంగాల్లోని రాజకీయం మారింది. మోదీ పాలన పట్ల ఇతర రాష్ట్రాల్లోని ఫలితాల పట్ల బెంగాలీలు మక్కువ చూపారు.
** 2019 ఎన్నికల్లో బెంగాల్లోని 42 లోక్సభ సీట్లలో ఏకంగా 18 సీట్లను బిజెపి సాధించి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపరిచింది. ఓటింగ్ లోనూ 30.5 శాతాన్ని సాధించి ఔరా అనిపించింది. ఇది అధికార పార్టీ నేతలకు మింగుడు పడలేదు.
** తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రెండో స్థానంలో ఉన్న ముగ్గురు రాయి తో పాటు మరికొందరు నేతలు బీజేపీ వైపు రావడం, అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి సైతం బీజేపీ వైపు రావడంతో బిజెపి బలం పెరిగింది. మంచి రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ముకుల్ రాయ్ సారధ్యంలోనే బెంగాల్లో 18 లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచొగలిగింది. మరోపక్క వామపక్ష పార్టీలు క్రమంగా బలహీన పడడం దానిలోని కీలక నేతలంతా బీజేపీ వైపు చూడడం బిజెపి కు ప్లస్.


** బెంగాల్ రాజకీయాల్లో 2000 తర్వాత శకం పూర్తిగా మారిపోయింది. మమతా బెనర్జీ రాకతో బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ హవా మొదలైంది. బెంగాల్ ప్రజలు తమిళనాడు రాష్ట్రం లాగా వెనువెంటనే పాలనను వేరేవారికి అప్పు చెప్పేందుకు ఇష్టపడరు. జ్యోతిబసు ఏకంగా 24 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగితే, బుద్ధదేవ్ భట్టాచార్య సైతం ఓ దశాబ్దంపాటు బెంగాల్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం 2011 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అంటే వచ్చే ఏడాది కి ఒక దశాబ్దం పాటు ఆమె పాలన కొనసాగింది చెప్పాలి. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉండడం సహజం. కొత్త పాలన వైపు వారు చూస్తుంటారు ఇది బీజేపీ కు మరో ప్లస్.
** అధికార తృణమూల్ పార్టీని బెంగాల్లో ఓడించడం అంత సులువైన పని కాదు. అందులోనూ మతతత్వ పార్టీగా ముద్ర పడి ఉన్న బీజేపీ మమతాబెనర్జీ ను ఓడించడం అంటే సాధారణ విషయం కాదు.
** బెంగాల్లో ముస్లిం జనాభా అధికం. జమ్మూ కాశ్మీర్ తర్వాత అత్యధికంగా ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రం బెంగాల్. ఇక్కడ జనాభాలో 31 శాతం ముస్లింలు ఉన్నారు. వీరు సుమారు యాభై నుంచి అరవై సీట్లలో ప్రభావం చూపగలరు. 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 50 నుంచి 60 సీట్లు పెద్ద సంఖ్య.


** కూచ్ బీహార్, జల్పాయిగురి, దక్షిణ 24 పరగణా, పశ్చిమ 24 పరగణా, బెస్ట్ మిడ్నాపూర్,మల్ద, ముషీరాబాద్ వంటి జిల్లాల్లో ఎక్కువ ముస్లింలు కనిపిస్తారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ కు పశ్చిమ బెంగాల్ కు సరిహద్దు ఎక్కువగా ఉండటం, సరిహద్దు వద్ద భద్రత లేకపోవడంతో బంగ్లాదేశ్ ముస్లింలు ఎక్కువగా పశ్చిమబెంగాల్లో కి వచ్చి నివసిస్తుంటారు. ఎక్కడ వారికి ఓటు హక్కు ఆధార్ కార్డు సైతం ఉంటుంది. అలాగే బంగ్లాదేశ్ లోనూ వారు పౌరసత్వం ఉంటుంది.
** ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో తృణమూల్ పార్టీ బలంగా ఉంది. మమతా బెనర్జీ పాలనపై ముస్లింలు సానుకూలంగానే ఉన్నారు. మరోపక్క హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ శత్రుత్వం మమతా దీదీ కు కలిసొస్తోంది.
** ముస్లింలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో హైదరాబాద్ మజ్లిస్ పార్టీ పోటీ చేయాలని భావించింది. అక్కడ ఆ పార్టీకి రాష్ట్ర కమిటీ తో పాటు పలు జిల్లా కమిటీలు ఉన్నాయి. అయితే ఇటీవల మమతాబెనర్జీ ఆపరేషన్ ఆకర్ష్ తో ఎంఐఎం పార్టీ వల్ల పెను నష్టం తప్పదని భావించి మొత్తం మజ్లీస్ పార్టీ నాయకులను తన పార్టీలోకి తీసుకు వచ్చారు. దీంతో ఇప్పుడు మజ్లిస్ పార్టీ పశ్చిమబెంగాల్లో పోటీ చేయడం, కష్టంగా మారింది.
** కేంద్రంతో గట్టిగా మాట్లాడగలరా అని మోడీ విధానాలను గట్టిగా వ్యతిరేకించ గలరని పేరున మమతాబెనర్జీ బెంగాల్లో ఈసారి కచ్చితంగా అధికారం చేజిక్కించుకునే 2024 జాతీయ రాజకీయాల్లో కీలకం అవుతారు. ఆమె విజయం కోసం అన్ని దారులను ప్రస్తుతం వెతుకుతున్నారు.
** జాతీయ రాజకీయాలపై పట్టు తో పాటు మంచి వ్యూహకర్త ఉన్న బీజేపీ సైతం పశ్చిమబెంగాల్లో ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు ఎత్తులు వేస్తోంది. ఇటు మమతా దీదీ ఎత్తులకు కొత్త ఎత్తులు వేయడంలో ముకుల్ రాయ్ సహాయపడుతున్నారు. దీంతో పశ్చిమబెంగాల్ రాజకీయాలు ఈసారి వేడెక్కుతున్నాయి. ఎలా అయినా ఈ సారి ముస్లిం ఓటింగ్ బిజెపి ఎంత వరకు రాబట్టగల అవుతుంది అనే దానిపైనే ఆ రాష్ట్ర పరిపాలన ఎవరు చేపట్టబోతున్నారు అనేది తేలిపోతుంది.

author avatar
Special Bureau

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju