NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Udhayanidhi Stalin: ఈ యువ హీరో – ఎమ్మెల్యేకి కోట్లు ఎక్కువే.. క్రిమినల్ కేసులూ ఎక్కువే..!

Udhayanidhi Stalin: Some Special Features

Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడులో ఇప్పుడు ఒక బ్రాండ్.. ఇన్నాళ్లు తెరపై హీరో మాత్రమే. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా. వెండితెరపై హీరోగా నటించి మెప్పించిన ఈ కరుణానిధి మనవడు.., అసెంబ్లీలో.. ప్రభుత్వంలో ఎలా నిలదొక్కుకుంటారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశమే.. ఇక ఈ హీరో/ ఎమ్మెల్యే కి ఉన్న ఆస్తులు.., క్రిమినల్ కేసుల రికార్డులు చూస్తే ఒకింత ఆశ్చర్యం ఖాయమే. ఈయన సినిమాల సంఖ్య కంటే క్రిమినల్ కేసులు.. అతని కోట్లే ఎక్కువగా ఉన్నాయి.. ఈ ఉదయనిధి స్టాలిన్ గురించి మరిన్ని కీలక విశేషాలు..!

Udhayanidhi Stalin: Some Special Features
Udhayanidhi Stalin Some Special Features

Udhayanidhi Stalin: కొన్ని విశేషాలు..!

ఈయన డీఎంకే అధినేత.. కాబోయే సీఎం స్టాలిన్ కుమారుడు. కరుణానిధికి ముద్దుల మనవడు. అందుకే కరుణానిధి పోటీ చేసి గెలిచిన చెన్నై సమీపంలోని చెపాక్ – తిరువల్లేని నియోజకవర్గం నుండి పోటీ చేసి 69 వేల భారీ ఆధిక్యతతో గెలుపొందారు. ఈ 43 ఏళ్ళ యువ స్టాలిన్ 2009 లో తమిళ సినీ తెరపై అరంగ్రేటం చేశారు. ఈ పుష్కర కాలంలో 16 సినిమాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులకు సైకో .., శీనుగాడు లవ్ స్టోరీ అనే సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. సినిమాలు చేస్తూనే గత ఏడాదిలో రాజకీయాల్లోకి ప్రవేశం చేశారు. డీఎంకే పార్టీకి యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే డీఎంకేలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఆ పార్టీ కీలక నేతల కార్యవర్గం ముఖాముఖి ఇంటర్వూ కి హాజరై మెప్పించాలి. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అలా చెప్పి.. మెప్పించి.. తనలో ప్రతిభ నిరూపించుకుని చెపాక్ నుండి పోటీకి దిగారు. భారీ ఆధిక్యతతో గెలిచారు.

Udhayanidhi Stalin: Some Special Features
Udhayanidhi Stalin Some Special Features

కేసులు – కోట్లు లెక్క ఇదీ..!!

ఈ ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల అఫిడవిట్‌లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. తన కంటే తన భార్యకే ఎక్కువ సంపాదన ఉన్నట్టు పేర్కొన్నారు. స్థిర, చరాస్థులు అన్ని కలిపి రూ. 33 కోట్ల ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. 2019 -20 ఏడాదిలో రూ. 4.89 లక్షల ఆదాయం మాత్రమే వచ్చినట్టు పేర్కొన్నారు. ఆయన భార్య కిరుతిగ పేరుపై రూ. 1.15 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. 2019 -20 లో ఆమె ఆదాయం రూ. 17.4 లక్షలు ఉన్నట్టు ఎన్నికల సంఘానికి తెలియజేసారు. మొత్తం మీద 33 కోట్లు చూపించినప్పటికీ.., మార్కెట్ విలువ ప్రకారం రూ. 120 కోట్లు వరకు ఉంటాయని అంచనా.
* ఇక కేసుల విషయానికి వస్తే.. ఈయనపై మొత్తం 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి. సైదా పేట్, కల్లకురిచి, గిండి, నుంగంబాకం, తిరుక్కువేలాయై, నాగపట్నం, కుతలం పోలీస్ స్టేషన్లు పరిధిలో స్టాలిన్ పై ఈ 22 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులన్ని డీఎంకే ఆధ్వర్యంలో చేసిన ధర్నాలు, యువజన నాయకుడిగా ఆందోళనలు.., సెంబ్లీ ముట్టడి వంటి వాటిలో ఈ కేసులు నమోదు అయ్యాయి.. ఒకవేళ ఈయనకు మంత్రి పదవి ఇస్తే తమిళ రాజకీయాల్లో యువ ఎమ్మెల్యే.., యువ మంత్రిగానూ రికార్డుల్లో ఉంటారు..!

author avatar
Srinivas Manem

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!