NewsOrbit
బిగ్ స్టోరీ

విలువలు లుప్తమైన రాజకీయం!

 

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజేపి శాసనసభ్యుడు కులదీప్ సెనగర్ మద్దతుదారులు ప్రభుత్వం యంత్రాంగం మొత్తం తమ వైపునే ఉందని బాధిత కుటుంబసభ్యులని బెదిరిస్తున్నారు. వాళ్ళ బెదిరింపులో నిజం ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో ఆదిత్యనాథ్ ప్రభుత్వం, కేంద్రంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా కులదీప్ సెనగర్ వైపునే ఉన్నాయి. ఈ మధ్య చోటుచేసుకున్న దిగ్బ్రాంతికరమైన పరిణామాలు ఎలా ఉన్నా ఈ రెండు ప్రభుత్వాలు మాత్రం కులదీప్ సెనగర్ వైపునే నిలబడుతున్నాయి.

భారత దేశాన్ని అనేక విధాలుగా “ శుభ్రపరిచామని” ఘనంగా చెప్పుకుంటున్న బిజెపి, కులదీప్ సెనగర్‌ని ఇంకా పార్టీలోనే ఎందుకు ఉండనిచ్చిందో ఇలా కాక మరి మనం ఇంకే విధంగా అర్థం చేసుకోవాలి? లేదా ఉత్తర ప్రదేశ్ బిజెపి అధ్యక్షులు స్వతంత్ర దేవ్ సింగ్ సెనగర్‌ని పార్టీ నుండి ‘ చాలా కాలం” క్రితమే బహిష్కరించామనీ, “అందులో మార్పు లేదనీ”  చెప్పేవరకు మనకి బహుశా మనకి అలా తోచిందేమో.

అయితే సెనగర్ ని ఏప్రిల్, 2018 లోనే పార్టీ నుండి సస్పెండ్ చేశామని స్వతంత్ర దేవ్ సింగ్ చెబుతున్న దానికి ఎటువంటి విశ్వసనీయత లేదు. జూలై, 2018 లో నవభారత్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బిజెపి మాజీ అధ్యక్షులు మహేంద్రనాథ్ పాండే సెనగర్ మీద వచ్చిన ఆరోపణలు నిరూపితం అయ్యాకే అతని మీద చర్య ఉంటుందని పేర్కొన్నారు.

“అవినీతి” అంటే ఏమిటి అనే విషయం గురించి ఉన్నావ్ అత్యాచారం కేసు కొన్ని మౌలిక ప్రశ్నలను లేవదీసింది. ఏదో ఒక రాజకీయ పార్టీ రాజకీయ అవసరాల కోసం అవినీతిని కేవలం ఆర్ధిక అవినీతికి పరిమితం చేయటం తగదు.

రాజకీయాలలో నైతికత, విలువలు లేకపోవడం కూడా అవినీతే. ఈ అవినీతిని ఇలా కొనసాగించే అవకాశం ఇస్తే ఒక మనది ఒక ప్రజాస్వామిక రిపబ్లిక్ అనే భావన కేవలం పలుకుబడి కలిగినవారిని సేవించే వ్యవస్థ అనే భావనగా మారక తప్పదు. ఉన్నావ్ అత్యాచారం అనేది అటువంటి హేయమైన అవినీతికి ఒక సూక్ష్మ ఉదాహరణ. మానవత్వపు కనీస విలువలని, రాజకీయ నైతికతని పూర్తిగా ధ్వంసం చేసే సామర్ధ్యం ఇటువంటి అవినీతికి ఉంది.

పదిహేడేళ్ళ బాలికపై అత్యాచారం చేసిన ఆరోపణ మీద గత సంవత్సరం నుండి ఉన్నావ్ బిజెపి శాసనసభ్యుడు జైల్లోనే ఉన్నాడు. ఇంతటి ఘోరానికి ఒడికట్టాక కూడా ఆ మనిషిని పార్టీ నుండి తొలగించటం కాదు కదా కనీసం పార్టీ నుండి సస్పెండ్ చెయ్యలేదు.  ఇక్కడ ఒక విషయం గమనించాలి. మొన్న జులైలో పోక్సో చట్టాన్ని పిల్లల మీద అత్యాచారం చేసేవారికి మరణశిక్ష విధించే విధంగా సవరించిన పార్టీ తమ పార్టీ శాసనసభ్యుడు అదే దారుణానికి ఒడికడితే కనీసం పార్టీ నుండి సస్పెండ్ కూడా చేయలేదు.

చట్టాలని అమలు చేయవలసిన వారు శక్తివంతమైన, దుర్మార్గులైన రాజకీయనాయకులతో పూర్తిగా మిలాఖత్ అవుతున్నప్పుడు ఎన్ని చట్టాలు, ఎన్ని సవరణలు చేసి ఏమి లాభం? చట్టాలను అమలు చెయ్యాలి, దోషులను శిక్షించాలి  అనే సంకల్పం లేనప్పుడు ఎన్ని చట్టాలు చేసినా లాభం లేదన్న విషయాన్ని ఉన్నావ్ అత్యాచారం కేసు స్పష్టంగా మనకి తెలియచేస్తున్నది.

పోక్సో చట్టాన్ని సవరించటం తేలికే. అందులోనూ అటువంటి కఠినమైన శిక్షలకి దాదాపుగా రాజకీయవేత్తలు ఎవరూ (ఒక్కరు కూడా లేరు అని కాదు) అడ్డు చెప్పనప్పుడు తేలికే అవుతుంది. ఈ రాజకీయవేత్తలు అడ్డుపడేది ఎప్పుడయ్యా అంటే శాసనసభలోనూ, పార్లమెంట్ లోనూ తాము రూపకల్పన చేసిన చట్టాలని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు.

మొన్న ఆదివారం నాటి కారు-ట్రక్కు ఢీకొన్న సంఘటన  తరువాత సెనగర్ మీద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఈ సంఘటనలో అత్యాచార బాధితురాలు, ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడగా, బాధితురాలి బంధువులు ఇద్దరు మరణించారు. ఉన్నావ్ ఘటనల గురించి వార్తా సాధనాలలో నిరంతరం చర్చ జరుగుతున్నా కూడా ప్రభుత్వంలో పై స్థాయిలో ఎటువంటి చలనం లేదు.

ప్రమాద ఘటన వెనుక దాగిఉన్న కుట్రలు ఇప్పుడు కేంద్ర దర్యాప్తు విభాగం పరిధిలో ఉన్నాయి. ఈ ప్రమాదం జరగకముందు చోటు చేసుకున్న సంఘటనలని ఒక సారి గుర్తుచేసుకుందాము. క్రితం సంవత్సరం ఏప్రిల్ నెలలో అత్యాచార నిందితుడి మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంటి ముందు ఆత్మత్యాగం చేసుకుంటానని భాదితురాలు బెదిరించింది. నిందితుడి సోదరుడు అతుల్ సింగ్ సెనగర్ చేతిలో చావుదెబ్బలు తిని ఆ విషయంపై ఫిర్యాదు చేసిన తరువాత బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో శవమై తేలాడు.

ఈ మధ్య కాలంలో బాధితురాలికి బెదరింపులు వస్తూనే ఉన్నాయి. పాలక వర్గాల మద్దతు పూర్తిగా ఉన్న సెనగర్ ఉన్నావ్ లో అప్పటికి ఇంకా చాలా శక్తివంతమైన మనిషే. అతని మనుషులు వీధుల్లో తిరుగుతూ బాధితురాలిని, ఆవిడ కుటుంబసభ్యులని వేధిస్తూనే ఉన్నారు. “సెనగర్ మనుషులు మమ్మల్ని భయపెట్టేవారు. ‘మీరు ఏమి చెయ్యలేరు’  అని వారు మాతో అనేవారు.  పోలీసులు మమ్మల్ని రాజీ కుదుర్చుకొమనేవారు. ‘ఈ కథని ఇంతటితో ఆపేయ్యండి ఇక’ అని పోలీసులు మాకు చెప్పేవారు” అని భాదితురాలి సోదరి ఎన్‌డిటివి తో మాట్లాడుతూ తెలిపారు.

కారు ప్రమాదం జరిగిన తరువాత భాదితురాలి అమ్మ, ఆవిడ బంధువులు, చెప్పిన విషయాలు ఒక భయంకరమైన పరిస్థితిని సూచించాయి. రాజకీయ వర్గాలు, పాలనా యంత్రాంగం, చట్టాన్ని అమలు చెయ్యవలసిన సంస్థలు పరస్పరం లాలూచీ పడి న్యాయ ప్రక్రియని ఏ విధంగా నాశనం చేశారో మనకి అర్థమవుతుంది. వాళ్ళ ప్రధాన ఉద్దేశం చట్టం అమలును అడ్డుకోవడం, న్యాయప్రక్రియను జాప్యం చేయడం. వాళ్ళ లక్ష్యం నిందితుడిని కాపాడటం, బాధితురాలి నోరు మూయించడం.

నిందితుడు అందజెయ్యగల ఎన్నికల ప్రయోజనాలతో పోల్చుకుంటే అతను బాలికని అపహరించి, అత్యాచారం చేసిన  ఆరోపణలు లెక్కలోకి రావన్న మాట. ఠాకూర్ కులానికి చెందిన సెనగర్ వోట్లు బాగా రాబట్టగలడు. బిజెపిలో చేరకముందు బిఎస్పి లోనూ ఎస్పి లోనూ ఉన్నాడు. తనకున్న అర్ధ, అంగ బలాలతో సెనగర్ ఓట్లు తన వైపుకి తిప్పుకోగలడు. ఇలాంటివారిని ప్రతి పార్టీ దగ్గరకు తీసుకుంటుంది. బిజెపి ఏమి మినహాయింపు కాదు.

అలాగే అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి మీద కాని, అటువంటి వారినికి మద్దతు ఇచ్చేవారి మీద కానీ చర్యలు తీసుకోకపోవటం బిజెపికి కొత్తేమీ కాదు. కథువాలో క్రితం జనవరిలో ఎనిమిది సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిపి, హత్య చేసిన ఘటన పెద్ద రాజకీయ దుమారం లేపింది. ఇప్పుడు ఏ విధంగా అయితే  సెనగర్ తన పార్టీ, పోలీసులు మద్దతుతో రక్షణ పొందాడో, అదే విధంగా కథువా ఘటన జరిగినప్పుడు ఆ అత్యాచారం కేసులో ఒక నిందితుడు అయిన ప్రత్యెక పోలీసు అధికారి దీపక్ ఖజూరియకి మద్దతుగా మితవాద వర్గాలు వీధుల మీద ర్యాలీలు తీసాయి.

నిందితులను విడుదల చెయ్యాలంటూ హిందూ ఏక్తా మంచ్ నిర్వహించిన ర్యాలీలో జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వంలో బిజెపి మంత్రులైన లాల్ సింగ్, చంద్ర ప్రకాష్ గంగా పాల్గొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ దీన్ని నిరసించటంతో వీళ్ళిద్దరూ మంత్రివర్గం నుండి వైదొలగాల్సి వచ్చింది.

ఉన్నావ్ కేసు రెండేళ్ళ నాటిది. న్యాయం త్వరగా అందించాలని అధికార వర్గాల మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రతిపక్షాలకి ఇంతకాలం ఎందుకు పట్టిందో వాళ్ళకే తెలియాలి మరి. సెనగర్ ఇంకా కూడా బిజెపి శాసనసభ్యుడిగా ఎందుకు కొనసాగుతున్నాడు అని ప్రశ్నించటానికి ప్రతిపక్షాలకి ఏమి అడ్డొచ్చింది? ఉన్నావ్ బాధితురాలు క్లిష్ట ఆరోగ్య పరిస్థితులలో ఉండగా ఈ వారం ఎస్పి అధినేత అఖిలేష్ యాదవ్ భాదితురాలి కుటుంబాన్ని కలవటానికి లక్నో వెళ్ళారు. ఈ ఘటనకి సంబంధించి లోక్ సభలో నిరసనలు చోటుచేసుకున్నాయి.

స్వల్ప కాలిక నిరసనల సంస్కృతి, విలువలు లేని రాజకీయాలు వర్ధిల్లడం ఈ దేశం మీద దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎర్ర కోట మీద మువ్వన్నెల జెండా ఎగరేసి, అక్కడ నుండి ప్రధాన మంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ఇంకా పదిహేను రోజులు ఉంది.  ఈలోపు ఇటువంటి సంఘటనలు మనలో ఎందుకు ఆగ్రహం కలిగించడం లేదు అని ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉంది.

 

మోనాబినా గుప్తా  ‘ద వైర్’ వెబ్‌సైట్ సౌజన్యంతో

author avatar
Siva Prasad

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment