NewsOrbit
Featured బిగ్ స్టోరీ

Vakeel Saab Movie : అసలే తెలుగు ఇండస్ట్రీ.. ఆపై హీరో పవన్ కళ్యాణ్.. పింకు అచ్చు ఎలా దిగుద్ది..!?

Vakeel Saab Movie: Pink VS Vakeel Saab Analysis

Vakeel Saab Movie : సినిమా విషయాలు.. విశేషాలు.. విశ్లేషణలోకి వెళ్లే ముందు కొన్ని కీలక పాయింట్లు..! “హిందీ పింక్ సినిమా చూసిన యాంటీ పవన్ కళ్యాణ్ బ్యాచ్ కి వకీల్ సాబ్ పెద్దగా నచ్చదు”.. “పింక్ చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులకు వకీల్ సాబ్ భలే నచ్చుతుంది”..

“పింక్ సినిమా చూడకుండా ఫ్రెష్ గా వకీల్ సాబ్ చూసిన సగటు ప్రేక్షకుడికి ఇది నచ్చుతుంది”.. “పింక్ సినిమా చూసేసిన సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా అతి అనిపిస్తుంది. కానీ బాగేనా ఉందిలే అనిపిస్తుంది” సో.. ఓవరాల్ గా చెప్పొచ్చేదేమిటంటే.. పింక్ తో పోలిక లేకుండా ఫ్రెష్ గా ఈ సినిమాని, పవన్ కళ్యాణ్ ని చూద్దాం అనుకుంటే ఈ సినిమాలో కిక్కు చూడొచ్చు. కథలో లీనమవ్వొచ్చు. ఆడాళ్లయితే సెకండ్ హాఫ్ లో కాస్త కన్నీటిని కూడా కార్చొచ్చు.

Vakeel Saab Movie: Pink VS Vakeel Saab Analysis
Vakeel Saab Movie Pink VS Vakeel Saab Analysis

Vakeel Saab Movie : పింక్ కంటే వకీల్ ఎక్కడ..? ఎందుకు మారింది..!?

హిందీ పింక్ ఒక కమర్షియల్ కోణంలో తీయలేదు. అదొక కథ. కథని, కథనాన్ని నమ్ముకుని తీశారు. అక్కడ హీరో, హీరోయిన్, ఫైట్లు, ఫీట్లు కనిపించవు. కేవలం ముగ్గురు అమ్మాయిల కథ… వారికి అన్యాయం జరగడం.., పెద్దోళ్ల ఒత్తిళ్లు ఎదురవ్వడం.. న్యాయం కోసం మంచి క్రిమినల్ లాయర్ దగ్గరకు వెళ్లడం.. ఆ లాయర్ మంచి పాయింట్లతో ఈ అమ్మాయిలను గెలిపించడం.. చివరిగా న్యాయం గెలవడం… అదే సినిమా..! అందులో ఈ ముగ్గురు అమ్మాయిలూ మెయిన్.. ఆ తర్వాతే ఆ క్రిమినల్ లాయర్ పాత్ర.

ఆ ముగ్గురు వెనుక ఈ లాయర్ ఉండి కథని నడిపిస్తారు. కానీ…. ఇది తెలుగు పరిశ్రమ. ఇక్కడ హీరోయిజం ఉండాలి. ప్రేక్షకులు అలా అలవాటు పడ్డారు. ఇక్కడ కథ కంటే.. కథలో హీరోకే విలువ. ఇక్కడ కథ కంటే కథలో హీరో చేసే ఫైట్లు, ఫీట్లకే విలువ. ఇక్కడ కథ, కథనం కంటే బిల్డప్పులు.., భారీ డైలాగులకే విలువ..! కానీ… మూల కథని అలాగే తీసుకుని, తెలుగు రుచికి తగ్గట్టు.. పవన్ కళ్యాణ్ అనే ఒక పెద్ద హీరోని తీసుకుని.. మార్పులు చేసి మెప్పించేలా తీయడం కష్టమే. దాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణు చక్కగా నడిపించారు.

Vakeel Saab Movie: Pink VS Vakeel Saab Analysis
Vakeel Saab Movie Pink VS Vakeel Saab Analysis

సెకండ్ హాఫ్ సినిమాకి ప్రాణం పోసినట్టే…!

దర్శకుడు వేణు కథలో మార్పులు చేసుకుని.. కమర్షియల్ హంగులు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇమేజీకి తగ్గట్టు సీన్లు రాసుకున్నారు. ఆయన రాజకీయ నేపథ్యంలో కొన్ని డైలాగులు పేల్చారు. అయితే ఎక్కడ మూల కథ దెబ్బతినలేదు. పవన్ కళ్యాణ్ ఇమేజీ ట్రాప్ లో పడి.. ఓవర్ బిల్డప్పులతో తీస్తే సెకను హాఫ్ పండేది కాదు. సినిమాకి ప్రాణం సెకండ్ హాఫ్, కోర్టు సీన్లు. ఇవే సినిమాని ఓ రేంజికి తీసుకెళ్లాయి. కోర్టు సీన్లు వరకు మాత్రం పింక్, వకీల్ సాబ్ మధ్య పెద్దగా తేడాల్లేవు. మొదటి భాగం మాత్రం పవన్ కళ్యాణ్ తరహాలో..

ఆయన కోసమే ఎక్కువ సీన్లు రాసుకుని తీసినట్టు ఉంది. ఒక ఫ్లాష్ బ్యాక్.., అందులో పేదల తరపున ఉండడం.. పేదల కోసం పోరాడడం.. ఫైట్లు చేయడం.. ఎంపీకి సవాలు చేయడం వంటివి అదనపు హంగులుగా చేర్చారు. అవన్నీ వదిలేస్తే… సినిమా సెకండ్ హాఫ్ మొదలయ్యేది కోర్టు సీన్లతోనే. అక్కడి నుండి ప్రేక్షకుడికి పవన్ కళ్యాణ్ కనిపించరు. పాత్రలు, వాదనలు, పాయింట్లు, కథ మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఇదీ హిట్టు బొమ్మగా టాక్ పొందింది. ముఖ్యంగా రెండో భాగంలో పవన్ కళ్యాణ్ లో ఒక పరిపక్వ నటుడు కనిపిస్తే…, ప్రకాష్ రాజ్, నివేద థామస్ ల నటన పీక్స్ లో ఉంటుంది. నివేదా తన జీవితం మొత్తం గుర్తుంచుకునే పాత్ర చేసి, జీవించారు..!

Vakeel Saab Movie: Pink VS Vakeel Saab Analysis
Vakeel Saab Movie Pink VS Vakeel Saab Analysis

ఎందుకు చూడాలి..!? ఎందుకు వద్దు..!?

అమ్మాయిల జీవితంలో సాధారణంగా ఎదురయ్యే సవాళ్లు.. వారిపై మగాళ్ల చూపు వంటి అంశాలను సున్నితంగా ఆవిష్కరించారు. కోర్టు సీన్లలో పవన్ కళ్యాణ్ డైలాగులు, ఆయన వాదనలో అంశాలన్నీ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రాక్టీకల్ సమస్యలే. ఇటువంటి వాదనలు, కోర్టు సీన్లు బాగా కుదిరాయి. సెకండ్ హాఫ్ లో ఎవ్వరూ అతికి పోకుండా జీవించారు.

తెలియకుండానే ఎమోషనల్ సీన్లలోకి తీసుకెళ్లారు. “ఆర్ యు వర్జిన్..!?” అనే ప్రకాష్ రాజ్ ప్రశ్న.. అందుకే నివేదా థామస్ సమాధానమిస్తూ పలికించిన హావభావాలు బహుశా తెలుగు సినీ తెరపై ఇది వరకు కనిపించలేదు. నివేదా తన జీవితం మొత్తం గుర్తుంచుకునే పాత్ర చేసి, జీవించారు..! మొదటి భాగంపై పెద్దగా దృష్టి లేకపోయినా… రెండో భాగంలో కోర్టు సీన్లు కోసం మాత్రం సినిమా చూడాలి. మహిళల సెంటిమెంట్…, మహిళలపై జరుగుతున్నా దాడులు, మహిళలను చూస్తున్న విధానం వంటి అంశాలను వివరించడం ప్రాక్టీకల్ గా ఉంది.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju