NewsOrbit
Featured బిగ్ స్టోరీ

జగన్ కలలుగన్న “వాలంటరీ” వ్యవస్థ గాడి తప్పిందా..! ఎందుకు? ఎక్కడ? ఎలా.??

జగన్ పాలనకు కన్ను, ముక్కు, చెవులు, వెన్నెముక అన్నీ వాలంటీర్లే..! జగన్ కలలు గన్న స్థానిక పాలనకు ఈ వ్యవస్థ ద్వారానే బీజం వేశారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి ఆ వేదిక మీదనే ఈ వ్యవస్థ ద్వారానే పాలన సాగిస్తానంటూ ఉద్యోగాలను ప్రకటించి, ఏడాది కాలంగా సాగిస్తున్నారు…!
మరి ఏడాదిలో ఈ పాలన ఎలా ఉంది..? ఈ వాలంటరీ వ్యవస్థ పని తీరు ఏ విధంగా సాగుతుంది..? జగన్ అనుకున్న ఫలితాలు వస్తున్నాయా, లేదా? గాడి తప్పితే ఎక్కడ తప్పింది..? ఎందుకు తప్పింది..? అనేది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!

పని తీరు ఎలా ఉంది..??

వాలంటరీ వ్యవస్థ పని తీరుని ముందుగా చెప్పుకుందాం. క్షేత్రస్థాయిలో పథకాల అమలు, సర్వే, ఇంటింటి అధ్యయనం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మదింపు అన్నీ వాలంటీర్లే చూసుకోవాల్సి ఉంది. నిజానికి వాలంటరీ వ్యవస్థ అప్పుడప్పుడే గాడిలో పడుతుంది, జనానికి అలవాటు అవుతుంది, వాలంటీర్లకు కూడా పాలనపై, పనితీరు బాధ్యతలపై అవగాహన వస్తుంది అనుకునే దశలో కరోనా మొదలయింది. అప్పటికే కొన్ని జిల్లాలో వాలంటీర్లపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు.., కొన్ని తీసివేతలు, కూడికలు జరిగాయి.


* కరోనా వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ మరింత కీలకం అయింది. ఇంటింటికీ తిరగడం.., కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఆరా తీయడం.. నమూనాల సేకరణ.. రేషన్ పంపిణి.., పింఛన్లు పంపిణి… ఇలా ప్రతీ కీలకైనా విధులు నిర్వర్తించారు.
* కరోనా మార్చిలో ఎంటర్ అయితే దాదాపు మే నెల వరకు రాష్ట్రంలో వాలంటీర్ల విధులపై సర్వత్రా సంతోషం వ్యక్తం అయింది. చురుగ్గా పని చేసారు. ఆ సమయంలో “సాక్షి” పత్రికలో పెద్ద పెద్ద ఆర్టికల్లు కూడా రాశారు. జగన్ గాంరి విజయం, వాలంటీర్ల వ్యవస్థ గొప్పతనం కారణంగా దేశంలో మన రాష్ట్రంలోనే తక్కువ కేసులు, పాజిటివ్ రేటు. టెస్టులు అనుకుంటూ డబ్బా కొట్టారు.
* కానీ జూన్ నుండి కరోనా విజృంభించడం.., వాలంటీర్లకు కరోనా సోకడంతో ఇక పనితీరు తగ్గింది. వారిలోనూ భయం మొదలయింది. వాలంటీర్ల ప్రభావం కరోనా కట్టడిలో పెద్దగా ఫలితం లేదని తేలిపోయింది. నాడు డబ్బా కొట్టిన సాక్షి కూడా చేతులెత్తేసింది.
* అలా పనితీరు విషయంలో వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా సఫలం కాలేదు. అలా అని విఫలం కూడా కాలేదు. మిశ్రమ పనితీరు కనబర్చారు.

అవినీతి ఆరోపణలు షురూ..!!

పని తీరు విషయం అలా ఉంటె ఇక వాలంటీర్లపై అవినీతి ఆరోపణలను కూడా మాట్లాడుకోవాల్సి ఉంది. జీతం రూ. 5 వేలు మాత్రమే. అది కూడా నెల నెల సక్రమంగా ఇవ్వడం లేదు. మూడు, నాలుగు నెలలకోసారి ఇస్తున్నారు. పాపం.. సేవ మాత్రం ఎక్కువ ఉంది. నెలలో ఎప్పుడంటే అప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలి. ఎవరు పిర్యాదు చేసినా విచారణకు వెళ్ళాలి. బాధలు తీర్చాలి. పథకాలు అందించాలి. మండల కార్యాలయాలకు తిరగాలి. ఎప్పుడంటే అప్పుడు మీటింగులకు వెళ్ళాలి. ఇన్ని చాకిరీలు చేస్తున్నప్పుడు చేతిలో చమురు పడాలి కదా..!! జీతం ఇవ్వకుండా చేయాలంటే ఏం చేస్తారు? ఎందుకు చేస్తారు..? అందుకే చిలక్కొట్టుడులు బాగానే జరుగుతున్నాయి. బయటపడితే పోతున్నారు. బయటకు రాకపోతే ఉంటున్నారు. “5 వేలు జీతం, పైగా చాకిరీ పెద్ద జాబ్ ఏమి కాదు. ఉంటె ఎంత ? పోతే ఎంత?” అనే ధోరణిలో చాల వరకు వాలంటీర్లు ఉన్నారు.


* విజయనగరం జిల్లాలో ఓ గ్రామంలో వాలంటీర్లు ఇద్దరు కలిసి రూ. 15 వేలు లంచం డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
* ప్రకాశం జిల్లా కారంచేడులో ఓ వికలాంగుడుకి పింఛను ఇప్పించడానికి రూ. 8 వేలు లంచం డిమాండ్ చేసి ఓ వాలంటీర్ అడ్డంగా దొరికిపోయాడు.
* ప్రకాశం జిల్లా కందుకూరు పక్కన లింగసముద్రంలో ఓ గ్రామ వాలంటీర్లు పక్క గ్రామంలోకి వెళ్లి మీకు పథకాలు ఇప్పిస్తాం అంటూ 15 మంది మహిళలు ఒక్కొక్కరి వద్ద రూ. 5 వేలు డిమాండ్ చేసి అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. * గుంటూరు జిల్లాలో వాలంటీర్లు ఆఫీస్ లోనే మందు కొడుతూ దొరికిపోయారు.
* ఇలా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పాలనలో ప్రక్షాళన తీసుకు వద్దాం అనుకున్న సీఎం జగన్ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరేవేరడం లేదు. వారికి పనికి తగిన వేతనం, సరైన సమయానికి అందిస్తే.. కొంత మేరకు ప్రక్షాళన చేస్తే జగన్ అనుకున్న లక్ష్యంలో కొంత నెరవేరే అవకాశం ఉంది.

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju