NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

విశాఖ టీడీపీ ఇన్చార్జి పార్టీ ఆఫీసుకు పోరట… ఏమంటే వాస్తు బాగోలేదట..! విడ్డూరం….

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో వినూత్నరీతిలో పార్లమెంటు ఇన్చార్జి లను నియమించి తద్వారా పార్టీ పూర్వ వైభవం వైపు అడుగులు వేస్తుందని ఆశిస్తుంటే ఇన్చార్జిల తీరు అతనికి కొత్త తలపోటులను తెస్తోంది. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ విశాఖ నడి ఒడ్డున ఉండే టిడిపి పార్టీ కార్యాలయం లోనికి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. కారణం ఏంటో మీరే చూడండి….

 

జరిగే పనేనా…?

విశాఖ నడిబొడ్డున ఉన్న పార్టీ కార్యాలయంలోకి రాకుండా గాజువాక లోని తన కార్యాలయం లోనే ఉంటున్నారు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. గాజువాక నుండి గతంలో గెలిచిన పలా ఇంజనీరు. కానీ వాస్తు విషయాల్లో మాత్రం ఆయన చాలా ఖరాఖండిగా ఉంటున్నాడు. నగరం మధ్యలో ఉన్న పార్టీ కార్యాలయానికి వాస్తు దోషం ఉన్న కారణంగానే తాను అందులో అడుగుపెట్టేది లేదని చెప్పేశారట. గాజువాక లో తన కార్యాలయం ఉంది కాబట్టి తనను ఎవరు కలవాలన్నా అక్కడికి రావాలని అందరికీ మాట పంపించేశారు. విశాఖ లాంటి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎక్కడో గాజువాక కార్యాలయంలో కూర్చుని పార్టీ కార్యక్రమాలను చూస్తానంటే మరి కుదురుతుందా….?

భలే కారణాలు దొరికాయే….

అతని నిర్ణయంపై అనేకమంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఎవరు ఏమి చెప్పినా కూడా తాను మాత్రం నగరంలోని కార్యాలయానికి వచ్చేదే లేదంటూ పల్లా చెబుతున్నారట. నగరంలోని పార్టీ కార్యాలయానికి వాస్తు దోషాలు ఉన్నట్లు.. పార్టీకి వీధిపోటు కూడా ఎక్కువగా ఉన్న కారణంగా ఏ కార్యక్రమం తలపెట్టినా కలిసి రావడం లేదని బలంగా నమ్ముతున్నారు. అంతేకాకుండా గతంలో అధ్యక్షులుగా పనిచేసిన ఇద్దరు నేతలు రాజీనామాలు చేయకుండానే పార్టీని వదిలేయడం కూడా సెంటిమెంట్ గా భావిస్తున్నారట. అంతకుముందు నగర అధ్యక్షులు గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు రెహ్మాన్, వాసు గణేష్ లు వైసీపీలో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

వీధి పోటా…? వైసీపీ పోటా…?

అయితే విశాఖకు చెందిన కొందరు నేతలు మాత్రం పల్లాకు వైసిపి హవా నడుస్తున్న సమయంలో పార్టీ కార్యాలయం లోనికి అడుగు పెట్టాలంటే భయంగా ఉందని దానికి వాస్తు ని సాకుగా చూపిస్తున్నారని అంటున్నారు. తనకు ఎంతో బలం ఉన్న గాజువాక కార్యాలయం నుండే పాలన చేసేందుకు ఆయన మొగ్గు చూపుతారు కానీ జగన్ కి భయపడే విశాఖలో అడుగుపెట్టడంలేదని…. ఇంజనీరింగ్ చదివిన వ్యక్తికి వాస్తు దోషాలకు ఏమిటి సంబంధం అని చెవులు కొరుక్కుంటున్నారు. వీటన్నింటికీ చంద్రబాబు సరైన సమాధానం చెప్తాడా లేదా పల్లా శ్రీనీవాస్ చెప్తాడా? అయితే వాస్తు దోషం మాత్రం నిజమని…. ఇతరుల నమ్మకాలను కించపరచకూడదన్నది జనాల మాట…!

Related posts

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju