NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Vizag Steel Plant : వైజాగ్ “ఉక్కు దెబ్బ” జగన్ కా..? మోడీ కా..!? (పార్ట్ – 1)

Vizag Steel Plant : Mistake of Jagan or Modi..?

Vizag Steel Plant : “అది 1960 వ దశకం… విశాఖ ఓ ఉద్యమం ఊపిరి పోసుకుంది. 1966 నుండి 1970 వరకు నాలుగేళ్ల పాటు “ఉక్కు సంకల్పం”తో ఉద్యమం సాగింది. “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” (Visakha ukku – Andhrula Hakku) నినాదంతో ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు, నిరసనలు, నిరాహార దీక్షలు, గొడవలు, ఘర్షణలు… ఒకటేమిటి…? నాలుగేళ్ళ పాటు చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం జరిగింది. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో ఉద్యమం ఊపిరిలీనింది. ఈ ఫలితంగా 1970 లో ప్రధాని ఇందిరాగాంధీ “విశాఖలో ఉక్కు పరిశ్రమ” నిర్మిస్తాం అంటూ ప్రకటించారు.
* 1970 ఏప్రిల్ 10 విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు ప్రధాని ఇందిర పార్లమెంటులో ప్రకటించారు. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలను దానం చేసారు. 1971 జనవరి 20న ఇందిరా గాంధీ చేతనే కర్మాగారం శంకుస్థాపన జరిగింది. కానీ సాంకేతిక లోపాలు, నిధుల లోటు, ప్రభుత్వాలు మారడం, రాజాకీల ఫలితంగా 1987 వరకు పరిశ్రమ నిర్మాణ పూర్తికాలేదు. చివరికి 1990 లో నిర్మాణం పూర్తి చేసి పూర్తిస్థాయిలో పరిశ్రమ కార్యకలాపాలు మొదలు పెట్టారు. అప్పట్లో ఏడాదికి రూ. 50 కోట్లు నికర లాభం ఆర్జించేది..!

Vizag Steel Plant : Mistake of Jagan or Modi..?
Vizag Steel Plant Mistake of Jagan or Modi

Vizag Steel Plant : విశాఖ ఉక్కు – ప్రత్యేకతలు ..!!

మొత్తం కార్మికులు – 17200 (పెర్మనెంట్) , 16000 కాంట్రాక్టు
మొత్తం విస్తీర్ణం – 36 వేల ఎకరాలు
ఉత్పత్తి సామర్ధ్యం – ఏడాదికి 73 లక్షల టన్నులు ఉక్కు
నికర ఆదాయం – రూ. 96 కోట్లు (2018 – 19) ఆ తర్వాత నష్టం వస్తుంది.

Vizag Steel Plant : నష్టాలు ఎందుకు ..?

ఉక్కు రంగంలో అంతర్జాతీయ సంస్థల పోటీ. విశాఖ ఉక్కు నుండి జర్మనీ, జపాన్, రష్యా దేశాలకు ఎక్కువగా ఎగుమతి జరిగేది. కానీ అంతర్జీతీయ విపణిలో ధరల హెచ్చుతగ్గులు, ఇతర దేశాల పోటీ కారణంగా ఇక్కడ మార్కెట్ తగ్గింది. దీంతో పాటూ ఇనుము ధర పెరుగుదలతో ప్రత్యామ్నాయంగా వేరే మెటీరియల్ వాడకం పెరిగింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) పేరుతో కేంద్ర ప్రభుత్వమే దీన్ని నడిపిస్తుంది. మొదట్లో బాగానే లాభాలు వచ్చేవి. ఇప్పటి వరకు లాభాలు, నష్టాలు అన్నిటినీ లెక్కలు వేసుకుంటే సుమారుగా రూ. 5 వేల కోట్లు లాభాలే ఆర్జించినట్టు..!!

Vizag Steel Plant : Mistake of Jagan or Modi..?
Vizag Steel Plant Mistake of Jagan or Modi

నష్టాలు భర్తీకి ఏం ప్లాన్ వేశారు..!?

కేంద్రం చేతిలో కర్మాగారం ఉంది. నష్టాలు వస్తున్నాయని దీన్ని కేంద్రం ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్ర మంత్రివర్గం సమావేశాల్లో ఈ నోట్ ని ఆమోదించారు. ప్రైవేట్ పరం చేసి.. 2 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యానికి పెంచి.., దేశం మొత్తం మీద ట్రైన్ చక్రాలు తయారీ సంస్థగా దీన్ని చేస్తే బాగుంటుంది అనేది కేంద్రం యోచన. ప్రభుత్వ పరంగా ఉంటె మార్పులు కుదరవు, నష్టాలు భర్తీ సాధ్యం కాదు కాబట్టి.., ప్రైవేట్ పరం చేసేయాలని కేంద్రం యోచిస్తుంది. కానీ.. ఇది సెంటిమెంట్ కి ముడిపడి ఉన్న అంశం కావడంతో దాదాపు నాలుగు జిల్లాల్లో “విశాఖ ఉక్కు” సెంటిమెంట్ రగులుతుంది..! అందుకే కొద్దీ రోజులుగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. తాజాగా ఈరోజు విశాఖ నగరంలో అఖిలపక్షం బైక్ ర్యాలీ నిర్వహించింది. కొందరు రాజకీయ నేతలు కూడా ఉద్యమంలోకి వస్తున్నారు. మలివిడత ఉద్యమానికి అక్కడి కార్మికులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్లాన్ చేస్తున్నారు..!!

(ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చితే రాజకీయంగా జగన్, మోడీల్లో ఎవరికీ నష్టం వస్తుంది..? దీని వెనుక ప్రణాళిక ఏమిటి..? అనేది తర్వాత కథనంలో చర్చిద్దాం..!)

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!