NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

మోహన్ బాబు కి చంద్రబాబు అంటే భయమా..? గౌరవమా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరెత్తితే చాలు మంటెత్తిపోయే వారిలో ముందు వరుసలో ఉంటాడు సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, విద్యావేత్త మంచు మోహన్ బాబు. ఒకప్పుడు బాబుతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించిన ఆయన ఇప్పుడు అతని పేరు వింటేనే విపరీతమైన కోపంతో రగిలి పోతున్నాడు. అయినా కూడా అతనిపై ప్రత్యక్షంగా విమర్శలకు దిగడం వంటివి చెయ్యట్లేదు. అసలు దీని సంగతి ఏంటో ఒక సారి చూద్దాం

Mohan Babu fires on Chandrababu

పగబట్టి…. తగలెట్టి

గత ఏడాది సరిగ్గా ఎన్నికలకు ముందు తన విద్యా నికేతన్ విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను బాబు సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఆపేస్తుందని మోహన్ బాబు రోడ్డెక్కి ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అక్కడితో ఆగిపోకుండా ప్రొఫెషనల్ విషయాన్ని పర్సనల్ గా తీసుకొని మోహన్ బాబు టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైకాపాకు మద్దతుగా ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఎన్నికల్లో బాబు ఘోర పరాజయం చెందిన తరువాత శాంతించాడు.

ఇదే అతని అసలు బాధ

ఇంత జరిగిన తరువాత చంద్రబాబు ను లక్ష్యంగా చేసుకుని తాజాగా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతనికి తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి ఈ ప్రశ్న ఎదురైనప్పుడు పరోక్షంగా అతని పై విమర్శలు ఆరోపణలు గుప్పించారు. ‘‘ఒకడి వల్ల నా రాజకీయ జీవితం నాశనమైంది. అతణ్ని నమ్మి రాజకీయాల్లోకి దిగాను. నన్ను మోసం చేసి అతను ముఖ్యమంత్రి అయ్యాడు. కలిసి వ్యాపారం మొదలుపెడితే అందులోనూ మోసం చేశాడు. వేల కోట్లకు పడగలెత్తాడు. కానీ అతను వేల కోట్లు సంపాదించడం.. నేను ఇప్పుడున్న స్థితిలో ఉండటం రెండూ ఒకటే. ఆ వ్యక్తి చేసినవన్నీ మరిచిపోయి రాజీకి వెళ్లాలని కొందరంటారు. కానీ కాకా పట్టేవాళ్లు అలా అంటారు కానీ.. నేను అంతా ఎలా మరిచిపోతాను’’ ఇవే ఖచ్చితంగా మోహన్ బాబు అన్న మాటలు.

నిజంగా మనసులో ఉన్న మాటలేవి?

మరి పైన అంత కథ చెప్పిన మోహన్ బాబుచంద్రబాబు పేరుని నేరుగా ఎత్తకుండా ఒకడు…. ముఖ్యమంత్రి అయ్యాడు…. నన్ను మోసం చేశాడు…. నేను ఎప్పటికీ మర్చిపోను అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టడం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. మోహన్ బాబు కి జగన్ అండ ఎంతకాదన్నా ఉంటుంది. బాబు ని అసలు లెక్క చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అసలు ఇప్పుడు ఎవరినీ శాసించే స్థితిలో కూడా లేసు. తన సొంత పార్టీ నేతలే అతని మాట వినట్లేదు. ఇలాంటి సమయంలో మోహన్ బాబు చంద్రబాబుకు భయపడాల్సిన అవసరం లేదని పలువురు అంటున్నారు. ఇదంతా గౌరవం అని కొందరంటారు. అంటేమోహన్ బాబు కి లోపల ఎక్కడో కొంత బబు అంటే కొంత గౌరవం దాగి ఉందని కొందరు అంటున్నారు. మరి మీరేమంటారు?

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju