Tv Debates : మీడియా చర్చల్లో ముష్టియుధ్దాలే మిగిలాయా..!? చానెల్స్ చేసేది ఇదేనా..?

Share

Tv Debates ఇప్పుడు మీడియాలో ఇవి చాలా ముఖ్యం. ప్రజాభిప్రాయాలను తమ భుజాలపై మోస్తున్నామనే భావనలో జరిగే మాసివ్ చర్చలు ఇవి. రాజకీయ నాయకులు, కాలమిస్టులు, సంఘ సంస్కర్తలు, పార్ట నాయకులు, మేధావులు.. ఇలా సమాజంలోని అనేక వర్గాల వారు టీవీ చర్చల్లో పాల్గొంటారు. ఇప్పుడు డిబేట్స్ అలా లేవు. నిన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ లో జరిగిన డిబేట్ ఇందుకు ఉదాహరణగా నిలిచింది. రాష్ట్ర బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని అమరావతి జేఏసీ నాయకుడు శ్రీనివాస్ చెప్పుతో కొట్టారు.. అదీ లైవ్ లో. ఈ ఘటన సంచలనం రేపింది. అసలు ఈ డిబేట్స్ ఎవరి కోసం? ఎందుకోసం? జరుగుతున్నాయో కూడా డిబేట్ నిర్వహిస్తున్న వెంకటకృష్ణ కూడా చెప్పలేరేమో. భావోద్వేగాలను కంట్రోల్ చేయలేనప్పుడు డిబేట్స్ ఎవరి కోసం. వీరి డిబేట్స్ వల్ల ప్రభుత్వ నిర్ణయాలు మారతాయా? వ్యవస్థల్లో మార్పులు వస్తున్నాయా? అంటే క్వశ్చన్ మార్కే..!

Tv Debates
Tv Debates

Tv Debates నాడు చర్చాగోష్టి.. నేడు ఇష్టాగోష్టి

పల్లెటూళ్లలో ఒకప్పుడు రచ్చబండ జరిగేది. ఊరి పెద్దలంతా ఉదయమో, సాయంత్రమో ఒకచోట చేరి గ్రామ సమస్యలపైనో.. రాష్ట్ర, జాతీయస్థాయిలో జరిగే విషయాలపైనో తెలిసినంతలో మాట్లాడుకునేవారు. తగిన రీతిలో ఎలా గ్రామాభివృద్ధి జరగాలి.. ఇందుకు ప్రభుత్వాన్ని ఎలా సంప్రదించాలి, రోడ్లు, స్కూళ్లు, గ్రంధాలయాలు, కమ్యూనిటీ హాల్స్, పంచాయతీ నిధులు ఖర్చు.. ఇలా అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చేవి. ఇవన్నీ మనం పాత సినిమాల్లోనో.. పెద్దవాళ్లో చెప్తేనో తెలిసాయి. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కార మార్గాలు దొరికేవి. కాలం మారింది. రేడియో, దూరదర్శన్ వచ్చాయి. ఆరోజుల్లో చర్చాగోష్టి కార్యక్రమాల్లో పలు విషయాలు, సమస్యలపై అర్ధవంతమైన చర్చలు జరిగేవి.. ప్రజలను ఆలోచింపజేసేవి.  భావోద్వేగాలు, సొంత అభిప్రాయాలు, కామెంట్స్, లైక్స్, లైవ్.. లాంటి ప్రస్తుత మీడియా విపరీత పోకడలు ఉండేవి కావు. ఇప్పుడు మీడియా విస్తృతి పెరిగింది. తమ చానెల్ హైలైట్ అవ్వాలి.. నాయకులు తమకు తాము ఫోకస్ కావాలి.. తాము ప్రజల కోసమే ఉన్నామనే భ్రమలు పార్టీలు ప్రజలకు కల్పించాలి. మొత్తంగా.. ఎవరికి వారు హైలైట్ కావాలి.

 

బీజేపీ నేత పరువు కాపాడేదెవరు..?

ఈ అత్యత్సాహమే నేటి టీవీ డిబేట్లలో భావోద్వేగాలు రగిలేలా చేస్తున్నాయి. నిన్నటి డిబేట్ లో అమరావతి అంశం చర్చకు వచ్చింది. ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు 3వేల కోట్లు బ్యాంకు రుణాలకు ప్రభుత్వ హామీ ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనిపై డిబేట్ కు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని, అమరావతి జేఏసీ నేత శ్రీనివాస్ ను చానెల్ హోస్ట్ వెంకటకృష్ణ ఆహ్వానించారు. అయితే.. టాపిక్ లో జగన్ మంచి పని చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పడం తప్పైపోయింది. బ్యాంకు రుణాలు తెచ్చాం అని గొప్పలు చెప్పుకునే సీఎంలు గతంలో కూడా ఉన్నారు.. అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. దీంతో శ్రీనివాస్ కోపోద్రిక్తుడై విష్ణువర్ధన్ రెడ్డికి తన చెప్పు చూపించడమే కాదు ఆయన మొహాన విసిరిగొట్టారు. వెంటనే వెంకటకృష్ణ.. లైవ్ ప్రోగ్రామ్ ను నిలిపేశారు. పోయిన బీజేపీ నేత పరువును కాపాడేదెవరు.. చెప్పు విసిరిన శ్రీనివాస్ కు తప్పు అని ఇప్పుడు తెలిసినా ఉపయోగం లేదు. ఈ సంఘటనకు సమాధానం చెప్పేది ఎవరు.. సదరు చానెలా.. హోస్టా..?

మీడియా అత్యుత్సాహం మారదా..?

ఆమధ్య వైసీపీ నేత శ్రీధర్.. ఓ మహిళను ‘విజయవాడ వచ్చి తంతాను’ అన్నారు. గతంలో మరో తెలుగు చానెల్ లైవ్ డిబేట్ లో నేతలు బూతులు తిట్టుకుంటూ కొట్టుకోబోయారు. సమస్యల పరిష్కారం కోసం.. వ్యవస్థల్లో మార్పు కోసం పెరిగిన టెక్నాలీజీ ఉపయోగపడట్లేదు. ప్రజలకే అసహ్యం అనిపించేలా ఉండే ఈ డిబేట్స్ ఎవరికి ఉపయోగం? జాతీయ చానెల్స్ లో ఒకేసారి పది మందితో ఆన్ లైన్లో డిబేట్స్ పెట్టిస్తారు. ఒకరు మేకప్ వేసుకుంటూంటారు.. మరొకరు తింటూంటారు. ఇటివలే ఓ ఆన్ లైన్ డిబేట్ లో పాల్గొన్న ఓ వ్యక్తికి ఆయన భార్య ముద్దు పెట్టబోయిన సంఘటన విపరీతంగా వైరల్ అయింది. ఇటువంటి సంఘటనల మధ్య ప్రజలకు టీవీ చానెల్స్ డిబేట్స్ ఏం చెప్తున్నట్టు. హీరోల అభిమానులతో డిబేట్స్ పెడుతారు. మా హీరో ఇలా.. మా హీరో అలా అనుకుంటారు. వారు కొట్టుకుంటారేమో అనే ఫీలింగ్ ప్రేక్షకులకు వచ్చేస్తుంది. ఇకపైనైనా డిబేట్స్ లో చానెల్స్ భావోద్వేగాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టకపోతే మరిన్ని ఘటనలు జరగడం ఖాయం..!!


Share

Related posts

Nandi Awards: నంది అవార్డులు లేనట్టేనా..? నటీనటులు, టెక్నీషియన్లకు నిరాశేనా..!?

Muraliak

న్యూస్ ఛానళ్ళ రథ చక్రాల క్రింద..!

Siva Prasad

Etela Rajender : ఎవరిపై ఈ ‘ఈటెల్లాం’టి మాటలు..! అసహనమా.. తిరుగుబాటా..?

Muraliak