NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

నిమ్మగడ్డ వెనుక ఉన్న ఆ అదృశ్యశక్తి ఎవరు?

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల విషయం ఒక కొలిక్కి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న పోరాటం చివరికి విజయవంతం అయింది. సుప్రీంకోర్టు ఈరోజు ఏపీ ప్రభుత్వం పిటిషన్ ను కొట్టివేసింది. ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని…. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ తో సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

 

who is that lucky power behind nimmagadda?
who is that lucky power behind nimmagadda

ఎస్ఈసీ కి లేఖ…!

అయితే ఈ అంశంపై సుప్రీం తీర్పు వెలువడటానికి ముందు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చాలా ఘాటుగా స్పందించారు. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరును తప్పుబడుతూ ఆయన రాసిన ఒక సంచలన లేఖ హాట్ టాపిక్ అయింది. ఎన్నికల కమిషన్ కు హితవు పలుకుతూ ఆయన ఒక ఉత్తరం రాశారు. ఒకవైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే…. మరొకపక్క జోరుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న సమయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏమిటి అని నిమ్మగడ్డ వైఖరిపై వైసీపీ నేత తీవ్ర విమర్శలు చేశారు.

పంతాలకి పోరాదు….

ఇక నిమ్మగడ్డ ని ఉద్దేశిస్తూ ప్రభుత్వ ఉద్యోగం లో ఉండి ఇలా రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఇక ఇలాంటి ఒక పరిస్థితి కేవలం భారతదేశంలో చూస్తున్నామని విమర్శించిన ముద్రగడ మీకు వీలైతే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి…. ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి కానీ ఇలా పంతానికి పోయి పోరాటలు నడుపవద్దు అని అన్నారు. అంతేకాకుండా ముద్రగడ మరింత తీవ్రమైన వ్యాఖ్యలను ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఆ అదృశ్యశక్తి వల్లే ఇదంతా..!

నిమ్మగడ్డ చేస్తున్న పనులు… ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తుంటే అతని వెనుక ఒక అదృశ్యశక్తి నడిపిస్తోందని అనుమానం కలుగుతోందని ముద్రగడ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం పై నిమ్మగడ్డ చేస్తున్న దాడి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది అని…. రాజకీయ నాయకుల లాగా పంతాలకి పోయి పంచాయతీ ఎన్నికలను నిర్వహించి తీరుతామని ఒక ప్రభుత్వ ఉద్యోగి అనరాదని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా ఎన్నికల ఆలోచన చేయడం మానేసి ప్రభుత్వానికి సహకరిస్తూ కొనసాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju