ఈ సారైనా హైదరాబాద్ ప్రజలు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటారా? ఈ నెంబర్లు చూడండి

తెలంగాణ రాష్ట్రంలో కొద్దిరోజుల్లో జరగనున్న జిహెచ్ఎంసి ఎన్నికలకు అటు టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ వారు కూడా పోటాపోటీగా ఉన్నారు. ఇక ఓటర్లను ఉద్దేశించి చేసిన వారు ప్రసంగాలు, ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు జోరందుకున్నాయి ఇటువంటి హీట్ పరిస్థితుల్లో నాయకులంతా ఒక విషయాన్ని మరిచిపోతున్నారు…

 

మరీ ఇంత తక్కువా అని ఆశ్చర్యపోకండి

ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా ప్రజలే కీలకం. అందులో ఓటర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లాంటి నగరపాలక పోల్స్ దగ్గరికి వచ్చే సరికి ప్రజల దగ్గర నుండి కనీస అవగాహన కరువవుతోంది. ఈ విషయం గురించి మీకు తెలియనట్లయితే…. ఈ ప్రశ్న వినండి…! రాబోయే ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? మనదేశంలో ఓటింగ్ అనగానే దాదాపు ఒక 70 శాతం లేదా కనీసం 60 శాతం పోలింగ్ జరుగుతుందని ఊహిస్తారు. అయితే హైదరాబాద్ కథ వేరే….

వీరే విలన్లు?

విషయం ఏమిటంటే…. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం 50 శాతం పోలింగ్ నమోదు అయితే గొప్ప. 2019 ఎన్నికల్లో కేవలం 41.22 శాతం మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. దీనిని బట్టి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 2016 జిహెచ్ఎంసి ఎన్నికల్లో 45.27 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. కొన్ని డివిజన్లలో అయితే కేవలం 15 శాతం ఓటర్లు పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు వేయడం గమనార్హం. ఇక అర్బన్ ఏరియాల్లో ఉండే ప్రజల కన్నా మురికివాడల్లో ఉండేవారే ఎక్కువగా ఓటింగ్ వేయడానికి మొగ్గు చూపుతున్నారని సర్వేల్లో తేలింది. ఓటింగ్ కూడా సంపన్న ఏరియాలోని బూత్ వద్ద అతి తక్కువగా నమోదు అవుతుందని రికార్డులు ఉన్నాయి.

ఈ సారి మరింత తక్కువ?

అతిముఖ్యంగా మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, చందనగర్, ఫిలింనగర్, షేక్ పేట, అబిడ్స్ లాంటి సంపన్న ప్రదేశాలలో ఓటింగ్ అతి తక్కువ శాతంలో నమోదవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. సిటీలో ఉండే ప్రజలు పోలింగ్ బూత్ కి రావడానికి ససేమిరా అంటున్నారు. ఆరోజు ప్రభుత్వం అన్నింటికీ సెలవు ప్రకటించినప్పటికీ…. ఎవరూ వారి ఇల్లు వదిలి రావట్లేదు. ఇక ఈ కరోనా సమయంలో ఈసారి ఓటింగ్ శాతం మరింత దిగజారుతుందని అంచనా వేస్తున్నారు…