NewsOrbit
బిగ్ స్టోరీ

అంతఃకరణపై రక్తం మరక!

మొన్న బుధవారం నాడు నా క్రైస్తవ స్నేహితుడి నుండి ఒక నాకు ఒక వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది. హైందవులు అయిన తన అత్తా మామలు నమ్మశక్యం కాని రీతిలో విచ్చలవిడిగా ఈ మెసేజ్‌ని ప్రచారంలో పెడుతున్నారని ఆతను వాపోయాడు. వారు ఒక తరహా రాజకీయ విలువలకి సంబంధించిన ఒక రాజకీయ పక్షానికి మద్దతుదారులు. ఆ హిందీ మెసేజ్‌లో ఏముందంటే;
“న్యూజీలాండ్ లో జరిగిన సంఘటన గురించి రాహుల్ గాంధీ ఒక డైలమాలో ఉన్నారు. ఆ సంఘటనలో చనిపోయిన వారు తన తల్లి మతస్థులు. వారిని చంపిన వ్యక్తి తన తండ్రి మతస్థుడు. [తండ్రికి వారు వాడిన పదం’ అబ్బూ’]”
ఇక్కడ నేను రాహుల్ పుట్టుక గురించి వ్యక్తపరిచిన అసభ్య నిందారోపణలని పట్టించుకోదలచలేదు. రాహుల్‌ను నేను ఒక సంకేతకంగా భావించదలచాను. అలాగే ఆ మెసేజ్ లో పేర్కొన్న మనిషికి ఆయనకీ ఎటువంటి సంబంధం లేదని, తనది ఆ ఇంటి పేరు(గాంధీ) కాదని నేను భావించదలచాను. ఇక్కడ నా ముఖ్య ఉద్దేశం ఆ మెసేజ్ లో అంతర్భాగంగా ఉన్న అవమానకరమైన ప్రచారాన్ని, ఉద్దేశాన్ని ప్రక్కకు పెట్టి ఆ మెసేజ్ కూర్చటానికి వాడిన భాష విస్తృత అర్థం, అలాగే దాని పర్యవసానాలని అర్థం చేసుకోవటం. తల్లితండ్రులు ఇద్దరు భిన్న మతాలకి చెందిన మనిషి ఎవరైనా రాహుల్ కావొచ్చు.
ఇక్కడ మనకి కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది ఏమిటంటే ఏదైనా దారుణం జరిగినప్పుడు దానికి మన స్పందన ఎలా ఉండాలి అనే దానిని ప్రాధమికంగా, కేవలం మన మత అస్థిత్వం మాత్రమే నిర్ణయిస్తుంది అని అనుకోవడం. ఒక వ్యక్తికి ఒకటికన్నా ఎక్కువ మత అస్థిత్వాలు ఉంటే తను నిందితుని వైపు వకాల్తా పుచ్చుకోవాలా లేక బాధితుల పక్షాన నిలబడాలా అనేది తేల్చుకోలేకుండా ఉంటారనేదానికి రాహుల్ ని ఒక మేలైన ఉదాహరణగా ఇక్కడ చూపిస్తున్నారు. పైన పేర్కొన్న మెసేజ్ రూపొందించినవారు ఎవరైనాగానీ ఆ వ్యక్తి అవగాహన ప్రకారం ఏదైనా ఒక సంఘటనపై ఒకరి అభిప్రాయం కేవలం అతను లేక ఆమె మతం మీద ఆధారపడి రూపొందుతుంది. మత అస్థిత్వాన్ని దాటి నైతిక విలువల ఆధారంగా మనిషి నిర్ణయం తీసుకోగలడు అనే అవగాహనకి అందులో చోటే లేదు. మత విశ్వాసాల అవశేషాల నుండి భర్తీ చేయగల నైతిక విలువలకి ఇందులో స్థానమే లేదు. దుర్మార్గాన్ని సామాన్యీకరించటంలో తమవంతు పాత్ర పోషిస్తున్నవారి, దీనిని నరనరాన జీర్ణించుకున్న వారి ప్రపంచంలో నైతిక విలువలు అనేవాటికి చోటే లేదు. అలాగే వాటితో వారికి పని కూడా లేదు.
రాజకీయ మౌఢ్యం అంటే ఇదే. “అస్థిత్వ రాజకీయాలుగా” ముద్రపడిన రాజకీయాల వాస్తవమైన భాష ఇది. కానీ ఈ రాజకీయాలను శక్తివంతమైన మెజారిటీ వాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారికి కొన్ని డొల్ల పాత్రికేయ చర్చలలో చాలా తప్పుగా అంటగడుతున్నారు.
ఆ మెసేజ్‌లో వాడిన భాష ప్రకారం తనకు తానుగా ఒక నిర్ణయం తీసుకోగలిగిన నైతిక, మేధో సామర్ధ్యాలు రాహుల్‌కి లేవు. నైతికంగా, మేధోపరంగా తాను తీసుకునే నిర్ణయం తన తల్లిదండ్రులు ఎవరు అనే దానికి లోబడి ఉంటుంది. నైతికపరమైన నీ ఇష్టాలను నీలో ప్రవహించే రక్తం నిర్ణయిస్తుంది. పుట్టుకతో నీకు సంక్రమించే ఎన్నో ఇతర సంబంధాలనూ, బాధ్యతలనూ పూర్తిగా విస్మరించే ఒక మంద నైతికతకి ఇది చక్కటి ఉదాహరణ. మన పితృత్వ, మాతృత్వ సంబంధాలు తప్ప మరింకే సంబంధాలు మనకి ఉండవు. మన అస్థిత్వం అంతా కేవలం మన తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది.

న్యూజిలాండ్ మారణహోమం మృతులకు బ్రిటన్‌లో నివాళి అర్పిస్తున్న చిన్నారి.

“మానవ ప్రవృత్తి” ని పరిగణనలోకి తీసుకోని నియతవాదం లోంచి ఇది పుట్టింది. మనిషి స్వీయ మేధ తన “అక్రసియా” (మానవ బలహీనత, స్వయం నిర్ణయ సామర్ధ్యం లేకపోవటం)ని అదుపులో పెడుతుందన్న ఆరిస్టాటిల్ ఆలోచన కానీ, నిరంతరం తనని తాను ప్రశ్నించుకోవటం, తాను నిజంగా స్వేచ్ఛగా ఉన్నానా లేదా అని ఎప్పటికప్పడు సరిచూసుకోవటంతో కూడిన ఆధునిక సిద్ధాంతమైన “స్వతంత్ర అంతఃకరణ” కానీ, పుట్టుకతో సంబంధంలేని బాధ్యత, కరుణతో కూడిన నైతిక నిష్టతో బతకాలనే కాంక్ష కానీ పైన పేర్కొన్న మెసేజ్‌కు ఆమడ దూరం. అక్కడ ముఖ్యమైనవి కేవలం ఒకరి కుటుంబ, వంశ, మత సంబంధాలే. మనం చెప్పుకోవాల్సివస్తే అక్కడ వారు చెబుతున్న మతం అనే దాంట్లో కూడా మతానికి సంబంధించి ఏమి లేదు. వారు మతానికి ఇస్తున్న నిర్వచనం, ఆలోచన లేని మధ్య తరగతి కుటుంబీకులకి మతం అంటే ఉండే అభిప్రాయం ఒకటే. అది ఏమిటంటే వారి ఇంటి నుండి పక్కవారి ఇల్లుని (లేదా ఆ పక్కింటి మనుషులని) ప్రాదేశికంగా వేరు చేసే పేర్లు, అలవాట్లు, కట్టుబాట్లు.
ఈ అభిప్రాయంలో మతం అనేది ఒకరిని మరొకరినుంచి వేరు చేసే ముళ్లకంచె మాత్రమే. ఈనాటి మన పట్టణాలలో మతం అనేది ఒక గేటెడ్ కమ్యూనిటీ తప్ప ఇంకేమీ కాదు. ఈ గేటెడ్ కమ్యూనిటీకి పరిమితం అయ్యేది లోపల కేవలం నివాస స్థలమే కాదు. వారి నైతికత, వారి మానసిక చైతన్యం కూడా. గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళందరిది ఒకే మతం. ఆ ప్రాతినిధ్యం వహించే వారిని చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. ఈ గేటెడ్ కమ్యూనిటీకి బయట ఉండేది హింస, భయంతో కూడుకున్న ప్రపంచం. దేశం(నేషన్) అనే భావన కూడా అటువంటి గేటెడ్ కమ్యూనిటీనే. ఇక్కడ దేశానికీ ఉండే సరిహద్దులే గేట్లు. ఇంత పరిమిత సరిహద్దులకు కట్టుబడిపోయిన రాజకీయ అస్థిత్వమే మన మన నైతిక, మేధోపరమైన సందేహాలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
దీని ప్రకారం మనమందరం (ఊహల్లో ప్రమాదకరమైన యూనిఫారాలు ధరిస్తూ) మన సరిహద్దులు కాపాడే సైనికులం. మనం కాపలా కాస్తున్న కోట నుండి ఒక్క పురుగు కూడా తప్పించుకోవటానికి వీలు లేదు. ఈ రకమైన ఆలోచన ధోరణి, ఈ ఆట నుండి మనం తప్పించుకోగలమా? ఒకరి గురించి ఆలోచించటం, ఒకరిని పట్టించుకోవటం, ఒకరకంగా అసలు జీవితం అనేవి ఇటువంటి భయకంపిత మానసిక రుగ్మత వెలుపల సంభవమేనా? మా అమ్మ హిందూ, మా నాన్న ముస్లిం అయితే ఏం మునిగింది?
మొన్న చనిపోయినవారు ఏ మతం వారు అనే దానితో నిమిత్తం లేకుండా వారి గురించి మనందరికీ పట్టింపు ఉండాలి. వారు చనిపోయారు కాబట్టి వారి గురించి మనకి పట్టింపు ఉండాలి. ముస్లింలు కాబట్టి వారిని చంపిఉంటే వారిని ముస్లింలుగానే మనం పట్టించుకోవాలి. ఆ హంతకుడిని వ్యతిరేకించడం క్రైస్తవ ప్రయోజనాలనే వ్యతిరేకించడం అని ఎవరైనా భావిస్తే అప్పుడు క్రైస్తవుడు అంటే మెజారిటీ ఆధిక్యతావాది, జాతి దురహంకారుడు తప్ప మరోటి కాదు. క్రైస్తవంలో నైతికత, సత్యనిష్ట కలిగిన క్రైస్తవుడిగా ఉండటం అంటే ఆ మతం పేరు మీద ద్వేషాన్ని కక్కే రాక్షసులను వ్యతిరేకించడమే. ఇటువంటి విద్వేషపూరిత నేరాలు జరిగినప్పుడు, మీరు హిందూ అయి ఉండి భిన్న మతాల తల్లిదండ్రుల సంతానాన్ని పరిహసించేందుకు వాటిని ఉపయోగించుకుంటున్నారంటే మీరు నైతికంగా పతనావస్థలో ఉన్నట్లే లెఖ్క.
దేశం ప్రాదేశిక డిమాండ్ల కంటే ఎక్కువ గాఢమైన, సుదీర్ఘమైన చరిత్ర మతానికి ఉంది. మతం చరిత్ర మొత్తం దేవుని పేరు మీద జరిగిన ప్రాదేశిక హింస అనేది కాదనలేని నిజం. నైతికనిష్టతో పని చేసిన మత సంస్కర్తలు అందరూ, మతం అంటే అధిగమించడానికి వీలు లేని విబేధాల గోడ అనే ఆలోచన నుంచి జనాన్ని బయటపడేసేందుకే కృషి చేశారు. చారిత్రాత్మకంగా మనం చేయాల్సిన పని ఏమిటంటే బేధ భావాల భయం లేకుండా భిన్న మతాల వారు ఒకరితో ఒకరు సంపర్కం పెట్టుకోగలిగేందుకు దోహదపడడం.
రాహుల్‌కి అంతఃకరణ అంటూ ఏమి లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. రక్తసంబంధం అనే ప్రాచీనమైన భావన అంతఃకరణ కన్నా మౌలికమైనది అని నమ్మేవారు మాత్రమే ఇటువంటి అంచనాలకి రాగలరు. రాహుల్ రెండు మత అస్థిత్వాలు మధ్య ఇరుక్కుపోవటం వల్ల డైలమాలో చిక్కుకున్నాడంటూ వీరు నవ్వుతున్నారు. ఇక్కడ వారి అతి తెలివి వాదన చూడండి. రాహుల్ కేవలం తన మత అస్థిత్వ చట్రంలోనే ఆలోచించగలడు కాబట్టి బాధితుల పక్షాన నిలబడలేడు అంటున్నారు. అంతే కానీ అసలు మత చట్రపు ఆలోచనలే తప్పు అనటం లేదు వీళ్ళు. ఇలాంటి అంచనాలు వేసి, ఆ అంచనాల ప్రకారం ఎదుటివారిని నిందించటానికి నైతిక దివాలాకోరుతనం అవసరం. అటువంటి దివాలాకోరుతనం ఒక సమాజం నైతికంగా పూర్తిగా పతనమవ్వటానికి దారి తీస్తుంది. నా క్రైస్తవ స్నేహితుని హిందూ అత్తామామల లాగా. రక్తం, ప్రాదేశిక ఆధారిత వాదనలు చేసినప్పుడు మతం తన మతాన్ని, నైతికత తన నైతికతని కోల్పోతాయి. నైతికత, విలువలు అనేవి ఇటువంటి ఊహాజనిత జాతీయవాద సరిహద్దుల మీద రక్తమోడతాయి.

  క్రైస్ట్‌చర్చ్‌లో టెర్రర్ దాడి మృతులకు నివాళి అర్పించేందుకు వచ్చిన బాలికకు కొవ్వొత్తి అందిస్తున్న పోలీసు

ఈ జాతీయవాద మౌఢ్యపు ఆలోచన ధోరణి ప్రతిదానినీ ఒకటికే పరిమతం చేస్తుంది- ఒకే ఎంపిక, ఒకే నైతికత, ఒకటే మతం, ఒకటే జాతి. బహుళత్వాన్ని ఒక స్ప్లిట్ పర్సనాలిటీ లాగా నవ్వులాటగాను, ప్రమాదకరంగాను పరిగణిస్తారు. బహుళత్వం అనేది పూర్తిగా నిర్మూలించాల్సిన జబ్బు. మనలో ఉన్న బహుళత్వం, మన బయట సమాజంలో ఉన్న బహుళత్వం రెండు ఈనాడు ప్రమాదంలో ఉన్నాయి.
ఇది ‘అలెన్ బడ్యూ’ వర్గ విరోధాల సందర్భంలో చెప్పిన “ఒకటి రెండుగా చీలును” సిద్ధాంతం కాదు. నేను బహుళత్వాన్ని ఏకత్వానికి దారిగా చూస్తాను. ఇందులో ఏమిటంటే ఎలాంటి నైతిక, సాంస్కృతిక, రాజకీయ చర్చలూ ప్రాతిపదిక కాని యుద్ధం, నియమనిష్ట లేని శాంతి రెండు తప్పుడు ఐచ్ఛికాలే. నేను ఒక అయస్కాంత సామాజిక స్థలం కోసం చూస్తున్నాను. ఎక్కడ అయితే ఏకత్వం, బహుళత్వం మధ్య ప్రేమ, సంఘర్షణ ఉంటాయో, రెండూ ఆకర్షింపబడుతూ, వికర్షింపబడుతూ ఉంటాయో అటువంటి సామాజిక స్థలం కావాలి. ఈ బహుళత్వానికి దారి చూపే నైతిక విధానం గాంధీ ఉదహరించిన పోట్లాడుకునే ఇరువురు సోదరుల దృష్టాంతానికి దగ్గర ఉంటుంది. ఈ ఇరువురు సోదరులు తమ విషయంలో కలగచేసుకునే మూడో పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆ మూడో పార్టీ ఎవరంటే తటస్థ, నిరాపేక్ష మధ్యవర్తిగా మనం భావించే చట్టం. ఈ మూడో పార్టీ ఇరువురి మధ్యన ఉన్న మనోహరమైన సామీప్యతను, ప్రేమపూర్వకమైన స్వేచ్ఛనూ దెబ్బతీస్తుంది. బడ్యూ దృష్టిలో ఈ మూడో పార్టీ ఎవరంటే చరిత్ర.
బహుళత్వం అనేది రెండుగా ఉండాలన్న వాంఛ – మరోకరి కోసం చూస్తూ, మరొకరిలాగా ఉండడం కోసం చూస్తూ. బహుళత్వం అంటే ప్రేమ. అటువంటి వాట్సాప్ మెసేజ్ లు పంపేవారికి మనం బహుళత్వంలో ఉండటం సుతరామూ ఇష్టం లేదు. నైతికత, విలువలు, మతంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఉన్నాయి అంటే ఈ బహుళత్వం, అలాగే ఈ బహుళత్వం కుప్పకూలే ప్రమాదం కూడా ఉండటం వలనే. ఒకటిగా ఉండటం లేక ఏకత్వం మనిషి జీవితంలో ఒక వాంఛనీయ లక్ష్యంగా ఉంది అంటే దానికి కారణం బహుళత్వం ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చే సమస్య, కోరిక మాత్రమే. బహుళత్వం లేనిదే ఏకత్వం లేదు.

మానష్ ఫిరాక్ భట్టాచార్జీ

‘ద వైర్’ వెబ్‌సైట్ సౌజన్యంతో

author avatar
Siva Prasad

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment