NewsOrbit
Featured బిగ్ స్టోరీ

“హ్యాట్రిక్” మొనగాడు… వైసీపీలో చేరాడు..! పార్టీకి కొత్త భయం తెచ్చాడు..!

“ఆయన హ్యాట్రిక్ మొనగాడు. వరుసగా మూడు ఎన్నికల్లో తన సత్తా చాటాడు. ఇప్పుడు అధికార వైసీపీలోకి దూరాడు. జగన్ పంచన చేరాడు. చేరినోడు ఊరకే ఉంటాడా..? 2024 నాటికి టికెట్ తెచ్చుకుంటాడు. టికెట్ తెచ్చుకుని ఊరకే ఉంటాడా..?? 2024 న రెండో హ్యాట్రిక్ మొదలు పెడతాడేమో..!!?? అందుకే ఈ గోల అంతా ఎందుకు..??
“అయ్యా జగనూ…!! ఆయన్ను చేర్చుకుంటే చేర్చుకున్నావ్ గానీ…, 2024 ఎన్నికల వరకు ఆయన్ను పార్టీలో ఉంచుకో. ఇస్తే గిస్తే ఏ ఎమ్మెల్సేనో.., రాజ్యసభో ఇచ్చుకో.., లేదా నామినేటెడ్ పదవో ఇచ్చుకో.., లేదా పార్టీ పదవి ఇచ్చుకో.., లేదంటే ఎన్నికలకు ముందే మంట పెట్టేసి తరిమేయ్.. మనకు వచ్చిన నష్టమేమి లేదు..! దయచేసి టికెట్ మాత్రం ఇవ్వకయ్యా..!! అంటూ ఆ నాయకుడి సొంత నియోజకవర్గ వైసిపి శ్రేణులు గట్టిగా కోరుకుంటున్నాయి..!! మరి ఆ నాయకుడు ఎవరు..? వారి ఘనత ఏమిటి..? ఆ హ్యాట్రిక్ ఏమిటో చూద్దాం !!

తెలుగు రాజకీయాల్లో చాలామాశెట్టి సునీల్ పెద్ద బ్రాండ్. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుండి అపజయాల్లో హాట్రిక్ సాధించారు. ఈ పెద్దాయన సోమవారం వైసిపి తీర్థం పుచ్చుకోవడం సంతోషాన్ని ఇవ్వడం మానేసి బెంగ పెట్టుకునేలా చేసింది.

 

ఆ ప్రాంత వైసిపి శ్రేణులు తీవ్ర హర్ట్ అవుతున్నారు. అందుకే వారి మనోభావాలేమంటున్నాయంటే..!!!

అయ్యా..!! సునీల్ గారు మీరు మా (వైసిపి) పార్టీలో ఎందుకు చేరుతున్నారో? ఏమి ఆశించి చేరుతున్నారో? మాకు అనవసరం. జగన్ పై మరోసారి అభిమానం వచ్చేసిందో.., పార్టిపై ప్రేమ మరోసారి పొడుచుకొచ్చిందో.., మొత్తానికి మీరు చేరడం మాకు మాత్రం నవ్వాలో / ఏడవాలో తెలియని పరిస్థితిని మిగిల్చిందండీ.! సరే మీరు “మా నేత జగన్మోహనరెడ్డిపై అభిమానం, వైసీపీ అంటే మక్కువ అనే మాటలు వద్దండీ బాబూ అస్సలు నమ్మలేం.” పదేళ్ళు, మూడు పార్టీలు, మూడు పోటీలు, మూడు ఓటములు ఘనత వహించిన హి”స్టోరీ” మీది..! ఇది గుర్తుచేసి మిమ్మల్ని బాధించాలని మా ఉద్దేశం కాదండీ..! మీకిప్పుడు మా పార్టీపై మిక్కిలి ప్రేమాభిమానాలుంటే వాటిని 2024 లోగా ధారపోసేసి మళ్ళీ మరో మంచి పార్టి చూసుకోండి!! లేదు పార్టీలోనే ఉంటా.., నా దగ్గర చాలా ప్రేమ ఉంది అంటారా..? అయితే పోటీకి మాత్రం దిగొద్దండీ.!! ఎందుకో తమకు తెలుసు ఇది కేవలం సెంటిమెంటు మాత్రమే. మీరు దీనికే హర్టింగు అయిపోయి ఆయింట్మెంట్ పూసుకోవద్దు “పార్టీ తరపున పోటీ చేస్తే మీరు ఓడిపోయేది కాక ఆ పార్టీ కూడా రాష్ట్రంలో అధికారం రాకుండా పోతుంది” నిజమే కదా..! అందుకు గడిచిన మూడు ఎన్నికలే సాక్ష్యాలు కదా..!! అలా ఎందుకు జరుగుతుందో మీకు, ఆ పైవాడికే తెలియాలి.

* మీరు ముందుగా ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో కాకినాడ నుండి పోటీ చేశారు. 2.89,563 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు. పోటీ చేశారు. ఓడి పోయారు. బాగానే ఉంది. ఆ పార్టీలో అయినా మీరు కొనసాగారా అంటే అదీ లేదు.

* ఆ తరువాత 2014 ఎన్నికలకు ముందు వైసిపిలో చేరారు. మళ్లీ పోటీ చేశారు. అప్పుడైనా గెలిచారా అంటే అదీ లేదు. 5,10,971 ఓట్లు సాధించి మళ్లీ రెండవ స్థానంలోనే నిలిచారు. మీరు ఓడారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రాలేదు. మీరు అప్పుడైనా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారా అంటే లేదు. మళ్లీ అధికార తెలుగుదేశం పార్టీలో జంప్ అయ్యారు.

chalamalasetty sunil joins ysrcp

* 2019 ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేశారు. మళ్లీ 5.11.892 ఓట్లు సాధించి రెండవ స్థానంలోనే నిలిచారు. పార్టీ ఏదైనా, మీరు ఎప్పుడు పోటీ చేసినా కామన్‌గా రెండవ స్థానం సాధించడం అనవాయితీగా, మీరు పోటీ చేసిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం రివాజుగా మారిపోతున్నది. అందుకే చెబుతున్నామండీ చలమలశెట్టి సునీల్ గారూ రాబోయే 2024 ఎన్నికల్లో మా పార్టీ (వైసిపి) తరపున మాత్రం పోటీ చేయవద్దని మా మనవి.

ఇట్లు :

కాకినాడ నియోజకవర్గ వైసీపీ అభిమానులము

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju