NewsOrbit
బిగ్ స్టోరీ

వారం రోజులు టైమ్ అడిగిన జగన్ ? కీలక నిర్ణయం దిశగా అడుగులు!

సరిగ్గా ఎనిమిది రోజుల్లో అనగా నెల 19 తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. టిడిపి అభ్యర్థిగా వర్ల రామయ్య పోటీ చేయనుండటంతో ఓటింగ్ ప్రక్రియ అనివార్యమైంది. అయితే ఎన్నికల్లో వైసీపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకోనుంది. ఇందులో ఇద్దరు రాజ్యసభకు ఈనెల 19 తేదీన ఎన్నిక కానుండదంతో వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ముందుగానే మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు మోపిదేవి వెంకట రమణ లను వైసిపి ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసినందువల్ల వారు 19 తేదీన తమ మాంత్రి పదవులకు రాజీనామా చేస్తారు. దీంతో మరో వారం రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

Jagan to have 5 deputy CMs in his cabinet, each from different ...

విషయం అందరికీ తెలిసిందే….! రెండు మంత్రి పదవులు కోసం దాదాపు డజను మంది వైసీపీ ఎమ్మెల్యేలు కాచుకుని ఉన్నారు. క్రితం సారి పదవి వస్తుందని ఆశించి భంగపడిన వారు మరియు ఏడాది కాలంలో జనాల మధ్య బాగా ఆదరణ సంపాదించిన వారు ఇంకా మంత్రి పదవి రాక వేరే పోస్టులతో సరిపెట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉండగా శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకోవడంతో తనకు అత్యంత నమ్మకమైన ఇద్దరు మంత్రులను రాజ్యసభకు ఎంపిక చేయగా.. ఇప్పుడు రాజ్యసభకే జగన్ వీరిరువురి ని ఎంచుకున్నారు అంటే ఇక మంత్రులను ఎవరిని చేయవచ్చు అన్న విషయాన్ని విశ్లేషకులు ఇప్పుడే అంచనా వేయడం మొదలు పెట్టేసారు.

అయితే నిజానికి చెప్పాలంటే జగన్ ఇంకా విషయంలో ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు అని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఏడాది నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు వారికి మంత్రి పదవి దక్కకపోయినా ముఖ్యమంత్రికి చేదోడువాదోడుగా ఉంటూ అన్ని విషయాల్లో అండగా నిలుస్తున్నారు. అవసరమైనప్పుడల్లా ప్రతిపక్షం వారి పైన పేట్రేగిపోతున్నారు. అయితే జగన్ కచ్చితంగా మరొక వారం రోజుల్లో ఇద్దరు మంత్రులను ప్రకటించవలసి ఉంటుంది. దీంతో జగన్ ఇంత కొద్ది సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక్కడ ముఖ్యంగా చర్చ ఏమిటంటే జగన్ రెండు మంత్రి పదవులు భర్తీ చేసేందుకు ఇద్దరి ప్రాంతాలకు లేదా సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారా…. లేక మరొక నిర్ణయం దిశగా అడిగేసి రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకు వస్తారా అన్న ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొంది. అయితే అదే సామాజికవర్గానికి చెందిన వారికి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. దీంతో ఆశావహులు జగన్ ను నేరుగా కలిసేందుకు వీలు కాకపోవడతో సీనియర్ నేతలను కలసి తమ గోడును విన్నవించుకుంటున్నారు. తూర్ప గోదావరి, గుంటూరు జిల్లాలకే ప్రాధాన్యం ఉంటుందన్న గ్యారంటీ ఏమీ లేకపోవడంతో ఇతర జిల్లాలకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju