YS Jagan: అయ్యో.. సీఎం గారూ! మాట తప్పుతున్నారేమో..! ఆ బిరుదు పోతుందేమో..!?

YS Jagan: Damaging by Immature decisions
Share

YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకూ ఒక బ్రాండ్ ఉంది.. ఒక ప్రత్యేక క్రేజ్ ఉండేది.. “మాట తప్పడు, మడమ తిప్పడు” అన్నs.! టీడీపీ అధినేత చంద్రబాబు యూటర్న్‌ల మీద యూటర్న్‌లు తీసుకుంటాడనీ, ఆయనకు విశ్వసనీయత లేదనీ, తమ నాయకుడు జగన్.. మాట తప్పడు, మడమ తిప్పడు అంటూ చెప్పుకొచ్చేవాళ్లు. గ్రామ స్థాయి వైసీపీ కార్యకర్త మొదలు కొని ఎమ్మెల్యేలు, మంత్రులు వరకూ ఈ మాట చెబుతుంటేవారు. కానీ… ఇటువంటివన్నీ ప్రాక్టీకల్ గా అధికారంలోకి వచ్చాక వర్కవుట్ అవ్వవు.. ఈ విషయం ఇప్పుడిప్పుడే సీఎం సహా.., శ్రేణులకు కూడా అర్ధమవుతున్నట్టుంది..! “మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం” ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్క్ అవుట్ అవుతుంది.., కానీ అధికారంలో ఉన్నప్పుడు కష్టమే.. అధికారంలో ఉన్న వాళ్లు మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఉండాలంటే “రాష్ట్రంలో పరిస్థితులు సహకరించాలి, కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, ఆర్ధిక పరిస్థితి సహకరించాలి”..! అధికారంలోకి రావడం కోసం జగన్మోహనరెడ్డి ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. ఆ నాడు ఆయనకు మాట తప్పడు, మడమ తిప్పడు అన్న బ్రాండ్ ఉండటంతో ప్రజలు ఆయన్ను నమ్మారు. ఓట్లు వేశారు. అధికారాన్ని అప్పగించారు. కానీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం జగన్ కు సాధ్యం కావడం లేదు. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చి ఈ రెండున్నరేళ్లలో మాట తప్పారు. మడమ తిప్పారు. ఒకరి రెండు కూడా.. చాలా విషయాల్లో మాట తప్పారు. మడమ తిప్పారు.

YS Jagan: Damaging by Immature decisions
YS Jagan: Damaging by Immature decisions

YS Jagan: జగన్ “మాట తప్పినవి, మడమ తిప్పినవి” కీలకాంశాల్లో..!

1 . పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు..టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ పై అదనపు 4 శాతం వ్యాట్ విధించారు. దీంతో ఇతర రాష్ట్రాలతో పాల్చుకుంటే ఏపిలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 3 నుండి 4 లు ఎక్కువగా ఉండేది. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోనూ, అంతకు ముందు పాదయాత్రలోనూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను చూపుతూ చంద్రబాబు ప్రభుత్వంలో బాదుడే బాదుడు అంటూ విమర్శించారు. 2018 సెప్టెంబర్ లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రెండు శాతం వ్యాట్ తగ్గించారు. అయితే జగన్మోహనరెడ్డి సీఎం అయిన తరువాత ఆ రెండు శాతం నుండి 4 శాతంకు పెంచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి రాగానే రేట్లు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే వ్యాట్ ట్యాక్స్ 2 శాతం పెంచడం మాట తప్పడమే కదా. ఇప్పుడు కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి..!

2 . వివేకానంద రెడ్డి హత్య కేసులోనూ మాట తప్పారు. మడమ తిప్పారు. 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి హత్య జరిగితే ఆనాడు చంద్రబాబే చేయించాడు, టీడీపీయే చేయించింది అని ఆరోపిస్తూ సీబీఐ విచారణ జరగాలని అని జగన్ డిమాండ్ చేశారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.. కానీ ఆ తరువాత 2020 జనవరి నెలలో సీబీఐ విచారణ అవసరం లేదు అని కోర్టులో గతంలో తాను వేసిన పిటిషన్ ను వెనక్కు తీసుకున్నారు. అంటే ఈ విషయంలోనూ మాట తప్పినట్లే, మడమ తిప్పినట్లే. ప్రభుత్వం తన చేతిలో ఉన్నప్పటికీ బాబాయి హత్య కేసులో నిజాలు తేల్చనీయట్లేదని రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..

3. రాజధాని అమరావతి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిని స్వాగతించారు. అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో ఏమీ లేదని పేర్కొంటూ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మూడు రాజధానుల బిల్లును మూడు రోజుల క్రితం మళ్లీ ఉపసంహరించుకున్నారు. సో.. రాజధాని విషయంలోనూ మాట తప్పారు. మడమ తిప్పారు.

YS Jagan: Damaging by Immature decisions
YS Jagan: Damaging by Immature decisions

4. శాసనమండలి రద్దు. 2020 జనవరిలో శాసన మండలిలో వైసీపీకి బలం లేదు. దీంతో శాసనమండలి తమకు అవసరం లేదు, మండలి వల్ల ఖర్చు దుబారా తప్ప ఏమీ లేదు అందుకే శాసన మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తీర్మానం చేశారు. కేంద్రానికి ఆమోదం కొరకు పంపారు. కానీ ఇప్పుడు మండలిలో వైసీపీకి బలం వచ్చేసరికి దుబరా అనే మాట పక్కన పెట్టేశారు. అనవసర ఖర్చు అవసరం అయ్యింది. శాసనమండలి రద్దును వెనక్కు తీసుకున్నది జగన్ సర్కార్.

5. పార్టీ ఫిరాయింపులు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి టీడీపీలో చేరారు. దీన్ని జగన్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ప్రతీ సభ.., ప్రతీ మీటింగ్.. ప్రతీ పాదయాత్రలో ఇదే అంశాన్ని హైలైట్ చేశారు.. తాను అధికారంలోకి వచ్చిన కొత్తలోనే తాను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించను అని చెప్పారు. కానీ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను తన పంచన చేర్చుకున్నారు. అధికారికంగా పార్టీ కండువా కప్పుకోకపోయినప్పటికీ అనధికారికంగా వాళ్ళు వైసీపీ సభ్యులే..!

6. ప్రత్యేక హోదా..25 మంది ఎంపీలను గెలిపించండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు జగన్. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీకి పూర్తిస్థాయిలో అధికార బలం ఉంది, మనం ప్రత్యేక హోదా అడగలేము అన్నారు. పార్లమెంట్ అయితే బీజేపీకి బలం ఉంది. కానీ రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. ఏ కీలక బిల్లు ఆమోదం పొందాలన్న వైసీపీ రాజ్యసభ సభ్యుల సహకారం కావాలి. మరి ఈ రాజ్యసభ సభ్యుల బలాన్ని ఉపయోగించుకుని ప్రత్యేక హోదాను కేంద్రాన్ని అడగవచ్చు, కానీ అడగడం లేదు.


Share

Related posts

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖ..! ఎందుకంటే..!?

somaraju sharma

YSRCP: వైసీపీలో అలజడి – రెబల్ గా మారనున్న మరో ఎంపీ..!? సీఎంని కలిసినా చల్లారని అగ్గి..!?

Srinivas Manem

హైదరాబాద్ ‌లో హాట్ హాట్ రాజకీయం .. రాష్ట్రం మొత్తం ఇదే టాక్ !

sridhar