NewsOrbit
బిగ్ స్టోరీ

జగన్ మరో ప్రతిష్ఠాత్మక నిర్ణయానికి కేంద్రం బ్రేకులు..!!

కేంద్రంతోనూ జగన్ పోరాడక తప్పదా..సిద్దమేనా ? సీఎం జగన్ ముందున్న ప్రత్యామ్నాయాలేంటి…??

 

ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న నిర్ణయాల అమలుకు ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. పేదలకు ఇంటి స్థలాల విషయంలో ఇప్పటికే న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు చేయటంతో ఇప్పటికే పలు మార్లు ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఇక, మరో ప్రతిష్ఠాత్మక నిర్ణయంగా ముఖ్యమంత్రి ఒకటో తరగతి నుండే ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. దీని పైన రాజకీయం గా అనేక విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు..పవన్..కొందరు మీడియా సంస్థల అధినేతల మొదలు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్ ధీటుగా స్పందించారు. వారి పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియాల్లో చదువుకోవాలి..పేదల పిల్లలకు వద్దా అంటూ నిలదీసారు. దీని పైన హైకోర్టుకు కొందరు వెళ్లగా..ప్రభుత్వం ఆంగ్ల విద్య పైన జారీ చేసిన జీవోను కొట్టి వేసింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అక్కడ వ్యవహారం పెండింగ్ లో ఉంది. ఇటు వైపు ఈ విద్యా సంవత్సరం నుండే దీనిని అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలని సిఫార్సును ఆమోదించింది. దీంతో..ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నారు..కేంద్రంతోనూ దీని పైన పోరాటం చేయాల్సిందేనా..లేక తన నిర్ణయాన్ని నిలుపుదల చేసుకోవాలా..

కేంద్ర కేబినెట్ ఆమోదంతో…ప్రాధమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలన్ని కస్తూరి రంగన్ సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుండే ఒకటో తరగతి నుండే ఆంగ్ల బోధన ప్రారంభించి..ఏడాదికి ఒక్కో క్లాస్ కు పెంచుకుంటూ పోవాలని నిర్ణయించింది. దీని పైన వ్యతిరేకత వచ్చినా..ముఖ్యమంత్రి ఈ విషయంలో మాత్రం ముందుకే వెళ్తామని తేల్చి చెప్పారు. దీని పైన పేదల్లోనూ సానుకూల స్పందన వస్తుందంటూ వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని కొందరు హైకోర్టులో సవాల్ చేయగా..కోర్టు దీనికి సంబంధించిన జీవోను కొట్టివేసింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా..అక్కడ ఈ వ్యవహా రం పెండింగ్ లో ఉంది. ఇదే సమయంలో కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, దీని అమలు వెంటనే మొదుల పెట్టాలనేది కొందరి డిమాండ్ కాగా..ఆచరణ ఎంత వరకు సాధ్యమనే ప్రశ్న సైతం ఇప్పుడు వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయాన్ని అమలు చేసే దిశగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాము తల్లి తండ్రుల అభిప్రాయాన్ని ఈ విషయం పైన సేకరించగా అందు లో 96 శాతం ఆంగ్ల మాధ్యమానికి మొగ్గు చూపినట్లుగా ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది.

కేంద్రంతో పోరాటం..ఇటు న్యాయ పరంగానూ..ఇప్పటికే తాను అమలు చేయాలనుకుంటున్న పలు నిర్ణయాలు కోర్టులకు చేరటంతో వాటి పైన ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోంది. ఇదే సమయంలో కేంద్రం ఇప్పుడు తాజాగా తీసుకున్న అయిదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన సైతం జగన్ కు సవాల్ గా మారుతోంది. దీని నుండి వెనక్కు వెళ్లేందుకు జగన్ రాజీ పడే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. దీని పైన కేంద్రం తోనూ పోరాటం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేకుంటే కేంద్ర నిర్ణయం పైన కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో పీపీఏల పైన తీసుకున్న నిర్ణయం పైన కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ, జగన్ పూర్తిగా ఆ విషయంలో వెనక్కు తగ్గకపోయినా…కేంద్రంతో వివాదాలు మాత్రం వద్దనే చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు ఈ విషయంలో జగన్ ఏం చేస్తారు.. కేంద్రంతో కయ్యానికి దిగుతారా.. లేక మధ్యే మార్గంగా ఉన్న అవకాశాల పైన అధ్యయనం చేసి..కేంద్రాన్ని ఒప్పిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. త్వరలోనే సీఎం జగన్ దీని పైన విద్యా శాఖ..న్యాయ నిపుణులతో చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ దీని పైన ప్రధానికి లేఖ ద్వారా ముందుగా తన అభిప్రాయం చెబుతారని పార్టీ నేతలు చెబుతున్నారు.

author avatar
Special Bureau

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Pawan Kalyan – Ambati Rayudu: పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు

sharma somaraju