NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan : మైండ్ లో “కమ్మ”నైన టార్గెట్ ఆ 35 ..! “న్యూస్ ఆర్బిట్” కీలక పొలిటికల్ రిపోర్ట్..!!

TDP ; Municipolls Winning Analysis

YS Jagan : ఒక భవనం పూర్తిగా కూల్చాలంటే పైనున్న భవనంతో పాటూ… కింద పిల్లర్లు, ఆ కింద ఉన్న పునాదులు కూడా కూల్చాలి..! ఇదే లెక్కన రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీని పతనం చేయాలి అంటే ఆ పార్టీ పునాదులను కూల్చాలి..! అంటే టీడీపీని పతనం చేయాలి, పూర్తిగా బలహీనం చేయాలి అనుకుంటున్న సీఎం జగన్ ఆ పార్టీ పునాదులు, పిల్లర్లపై దృష్టి పెట్టాలి. ఎస్… సీఎం జగన్ (YS Jagan) అదే చేస్తున్నారు. ఒక పకడ్బందీ ప్రణాలికతో వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలోనే ప్రత్యేకమైన 35 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ 35 నియోజకవర్గాలు ఏంటి..? అక్కడ ప్రత్యేకతలు ఏమిటి..? జగన్ టార్గెట్ ప్రణాళిక ఏమిటి..? అనేది “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకంగా అందిస్తుంది..!!

కచ్చితంగా చదవాలి : కుప్పంలో వైసీపీ టార్గెట్ .. పక్కా ప్లాన్ ఎలా వేశారంటే..!? (పార్ట్ – 1 )

YS Jagan fixed Target for special 35
YS Jagan fixed Target for special 35

YS Jagan : టీడీపీకి కులం గట్టి పునాది..!!

ఎవరు అవునన్నా.. కాదన్నా టీడీపీకి ఒక పునాది కమ్మకులమే. పిల్లర్లు ఆ కుల నాయకులే. 1983 లో పార్టీ ఏర్పాటు ఆత్మగౌరవ నినాదంతో వస్తే రావచ్చు గాక… ఎన్టీఆర్ ఉన్నంత కాలం పార్టీ అన్నివర్గాలకు దగ్గరైతే అయి ఉండొచ్చు గాక… కానీ 1999 నుండి టీడీపీ ఫక్తు కుల పార్టీగా మారిపోయింది. పేరుకి ఇది బీసీల పార్టీ, బలహీనవర్గాల పార్టీ అంటూ పైకి చెప్పుకున్నా.., పదవుల లెక్క చూపించినప్పటికీ.. పెత్తనం మొత్తం ఒక కులానిదే. అందుకే టీడీపీకి బలమైన పునాది కమ్మ సామాజికవర్గం. రాష్ట్రంలో మొత్తం 7 శాతం వరకు ఓటర్లు ఈ కులస్తులు ఉంటె.., దాదాపు 45 నియోజకవర్గాల్లో గెలుపు / ఓటములను శాసించగల స్థాయిలో ఓటర్లు ఉన్నారు. మరో 35 నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గం గెలిపించిన వాళ్ళే గెలుస్తారు. సో… ఈ 35 టీడీపీకి కంచుకోటగా వంటివి. 2019 లో జగన్ వాటిలో కూడా కొన్ని గెలిచినప్పటికీ.. అది ఆ సామాజికవర్గం చేతిలోనే ఉన్నట్టు.

కచ్చితంగా చదవాలి : కుప్పంలో వైసీపీ టార్గెట్ .. పక్కా ప్లాన్ ఎలా వేశారంటే..!? (పార్ట్ – 2 )

YS Jagan fixed Target for special 35
YS Jagan fixed Target for special 35

* ఉదాహరణకు – తూర్పుగోదావరి జిల్లాలో మండపేట, పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు, ఉంగుటూరు, కృష్ణా జిల్లాలో గన్నవరం, గుడివాడ, పెనమలూరు, విజయవాడ తూర్పు, మైలవరం.. గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమ, నరసరావుపేట, వినుకొండ, గురజాల, వేమూరు, తెనాలి.., ప్రకాశం జిల్లా అద్దంకి, పర్చూరు, కందుకూరు, నెల్లూరు జిల్లా ఉదయగిరి, అనంతపురం జిల్లా రాప్తాడు, ఉరవకొండ, హిందూపురం… ఇలా దాదాపు 35 వరకు ఉన్నాయి.

సీఎం సూపర్ ప్లాన్ – ప్రత్యామ్నాయ ప్రణాళికలు..!!

ఈ నియోజకవర్గాల్లో 2019 లో కొన్ని చోట్ల వైసీపీపై నే గెలిచినప్పటికీ.. అక్కడున్న టీడీపీ పునాదులు కూలలేదు. అక్కడ మళ్ళీ మళ్ళీ వైసిపినే గెలవాలి అంటే.., ఆ పునాదులు కూల్చాలి. అసలైన రాజకీయం చేయాలి. ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాలి. సీఎం జగన్ అదే చేస్తున్నారు. ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం రాజకీయం చేస్తున్నారు. బయటకు తెలియని, ఎవరూ ఊహించని ఒక ప్రణాళికతో వచ్చే ఎన్నికలకు కూడా టీడీపీ అడ్రెస్స్ గల్లంతయ్యేలా ప్రత్యామ్నాయం ఏర్పాటు చూపిస్తున్నారు. కలిసి వచ్చిన వాళ్ళని కలుపుకుంటూనే.., తోక జాడించిన వాళ్ళని నియంత్రిస్తున్నారు. ఒక ప్రత్యామ్నాయ రాజకీయం చేస్తున్నారు.
* ఒక సింపుల్ ప్లాన్ – ఒక ఊరిలో 100 ఓట్లు ఉన్నాయనుకుందాం. 35 కమ్మ ఓట్లు, 30 బీసీ ఓట్లు.., 20 ఎస్సి ఓట్లు, 10 రెడ్డి ఓట్లు, 5 శాతం ఇతర ఓట్లు ఉన్నాయనుకుందాం. అంటే ఆ ఊరిలో కమ్మ ఆధిపత్యం ఉన్నట్టే. కానీ కమ్మకి ప్రత్యామ్నాయంగా ఇతర కులాలు ఎదిగితే/ కలిస్తే వారి ఆధిపత్యం గండి పడినట్టే. సో.., రాష్ట్రంలో మనం పైన చెప్పుకున్న నియోజకవర్గాల్లో ఆ కులానిదే ఆధిపత్యం. ఈ నియోజకవర్గాల్లో కూడా అదే సింపుల్ ప్లాన్. వారికి ప్రత్యామ్నాయ ఒక రాజకీయ ఆధిపత్యం తయారు చేస్తే బాగుంటుంది అనేది సీఎం జగన్ వ్యూహం.

YS Jagan fixed Target for special 35
YS Jagan fixed Target for special 35

కులం టార్గెట్ కాదు.. పార్టీనే..!!

ఇక్కడ మరో కీలక అంశం ప్రస్తావించాలి. ఏ నాయకుడికీ ఒక కులం, మతం టార్గెట్ గా ఉండదు. అధికారంలో ఉన్నాకా అసలు ఆ ఆలోచనే ఉండదు. సీఎం జగన్ కూడా ఇప్పుడు అంతే. అదే పంథాలో ఉన్నారు. కమ్మ కులం ఆయన టార్గెట్ కాదు. ఆ కులాన్ని ఏదో చేసేయాలని ఉద్దేశం కాదు. టీడీపీ అనుకూల కమ్మ / టీడీపీ అనుకూల పునాదులున్న కమ్మని నియోజకవర్గాల్లో పాగా వేయడమే సీఎం జగన్ ముందస్తు వ్యూహం. అందుకే ఆ కులానికి, ఆ నాయకులకు నష్టం లేకుండానే ఆ నియోజకవర్గాల్లో టీడీపీ పునాదులు పెకిలించి., వైసీపీ పునాదులు బలంగా వేసుకునేలా పక్కా ప్రణాళిక వేస్తున్నారని చెప్పుకోవచ్చు.!

 

author avatar
Srinivas Manem

Related posts

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N

Sneha: ప్ర‌స‌న్న కంటా ముందే నిర్మాతతో స్నేహ ప్రేమాయ‌ణం..నిశ్చితార్థం త‌ర్వాత పెళ్లెందుకు క్యాన్సిల్ అయింది..?

kavya N

Rakul Preet Singh: ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ర‌కుల్.. ఇంత‌కీ ఆమె స్టార్ట్‌ చేయ‌బోయే రెస్టారెంట్ పేరేంటంటే?

kavya N

YSRCP: కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి బిగ్ షాక్ .. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

చిల‌క‌లూరిపేటలో సైకిల్ ప‌రుగులు.. వైసీపీ కావ‌టి ప్ర‌చారం ప‌దిమందికి త‌క్కువ.. ఐదుగురికి ఎక్కువా..?

ఉండిలో ఆర్ – ఆర్ – ఆర్ ముచ్చ‌ట‌.. చివ‌ర‌కు తేలేదేంటి..?

బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తున్నా చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు.. అందుకే జ‌గ‌న్ ది గ్రేట్‌..?

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల .. 78 శాతం ఉత్తీర్ణత.. ఫలితాలు తెలుసుకోవడం ఇలా..

sharma somaraju

Pushpa 2: పుష్ప 2లో ఒక్క జాత‌ర‌ సీన్ కే ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా.. మ‌రో 5 సినిమాలు తీయొచ్చు!

kavya N