NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

YS Jagan ; మార్చి 5 లోగా తేలనున్న సీఎం జగన్ భవితవ్యం..!? సుప్రీం లో కీలక కేసు విచారణ..!!

Justice NV Ramana: in Confusion about his First Case?

YS jagan ; సీఎం జగన్.. ఏపీలో ఒక బ్రాండ్. దేశానికి ఒక సంచలనం. న్యాయవ్యవస్థకి ఒక ప్రశ్న. తను అనుకున్నది సాధించడానికి.. తాను చేయాలనుకున్నది చేయడానికి ఎంతవరకైనా వెళ్లి పోరాడే రకం YS Jagan. ఎంత పెద్ద వ్యవస్థలతో అయినా, వ్యక్తులతో అయినా ఢీ కొంటారు..! ఈ క్రమంలోనే ఏపీలో హైకోర్టు తీర్పులు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండడంతో ఏకంగా సుప్రీం న్యాయమూర్తిని టార్గెట్ చేసారు. ఇది దేశీయంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం ఎటూ తేలలేదు. ఆయన రాసిన లేఖ విషయంలో భిన్న స్పందనలు వచ్చాయి. తాజాగా ఈ లేఖ వ్యవహారంలో పరిణామాలు ఏమున్నా..? ఒక్క నెల రోజుల్లో స్పష్టత వచ్చేయనున్నట్టు తెలుస్తుంది.

YS Jagan Future will decide by this march 5?
YS Jagan Future will decide by this march 5

YS Jagan ; లేఖపై అనేక పిటిషన్లు..! కానీ ఒక్కటే కీలకం..!!

సీఎం జగన్ సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై రాసిన లేఖ విషయంలో జగన్ కి వ్యతిరేకంగా అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో కొన్నిటిని సుప్రీం కోర్టు కొట్టేసింది. కానీ ఒకే ఒక్క పిటిషన్ విచారణకు స్వీకరించింది. “సీఎం జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో జస్టిస్ రమణ విషయంలోనూ పూర్తిస్థాయిలో విచారణ జరగాలి” అని కోరుతూ వేసిన పిటిషన్ మాత్రమే సుప్రీం విచారణకు తీసుకుంది. ఇప్పటికే మొదటి దశలో విచారణ పూర్తిచేసి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. దీనిపై ఈ నెల వ్యవధిలో విచారణ పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మార్చి 5 లేదా పదో తేదీలోగా ఈ లేఖ వ్యవహారంలో పిటిషన్ ని విచారణ పూర్తి చేసి, జగన్ పై చర్యలు తీసుకోవాలా..? లేదా అనేది సుప్రీం తేల్చేయనుంది. ఇప్పటికే ఈ అంశంపై జాతీయ స్థాయి న్యాయవర్గాల్లో చర్చ మొదలయింది.

Must Read Article ; చంద్రబాబు పారిశ్రామిక పాపాల చిట్టా చూసారా..!? ఎన్ని కోట్లకు కన్నం వేసారో..!? 

YS Jagan Future will decide by this march 5?
YS Jagan Future will decide by this march 5

జస్టిస్ సంగతి ఏమైనట్టు..!?

జగన్ రాసిన లేఖపై పిర్యాదులు, పిటిషన్లు అలా ఉంచితే… సీఎం రాసిన లేఖపై సుప్రీం చీఫ్ జస్టిస్ ఏం చర్యలు తీసుకున్నారు అనేది కీలకంగా మారింది. రెండు నెలల కిందట జాతీయ మీడియా “ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక కథనం వచ్చింది. సీఎం జగన్ లేఖపై సుప్రీం లో కదలిక మొదలయింది అనీ.., విచారణ జరుగుతుంది అనీ” రాశారు. అయితే దీన్ని సుప్రీం ఖండించింది. ఆ కథనం రాసిన జాతీయ మీడియాని మందలించింది. సో.. అప్పుడే జగన్ రాసిన లేఖ విషయంలో సుప్రీం లో కదలికలు లేవు అనే విషయం పరోక్షంగా అర్ధమయింది. కానీ.. రాజకీయంగా చూస్తే మాత్రం ఈ వ్యవహారం అంత తేలిగ్గా అయిపోయేది కాదు. జస్టిస్ రమణ ఏప్రిల్ 24 నాటికి ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. సో.., ఆయన్ను ఆపడానికి సీఎం జగన్ ఇటువంటి పిర్యాదు చేశారు అనడంలో సందేహం లేదు. అందుకే ఇది న్యాయవ్యవస్థ చేతిలో ఉన్నట్టే కనిపిస్తుంది.. కానీ రాజకీయ వ్యవహారంగా మారింది. రాజకీయ వ్యవహారం అంటే దేశంలో బీజేపీనే కీలక పాత్రధారి.., సూత్రధారి కూడా అవుతుంది. అంచేత చుట్టూ తిరిగిన బంతి బీజేపీ కోర్టులో ఆగుతుంది. బీజేపీ తీసుకోబోయే నిర్ణయం ఆధారంగా వ్యవస్థల పనితీరు ఉంటుంది.

చివర్లో ఈ ట్విస్టు ఉండవచ్చు.. ఆశ్చర్యం వద్దు సుమీ..!!

ఇక్కడ వరకు ఒక క్లారిటీతో చెప్పుకున్నాం. సీఎం జగన్ లేఖ.. ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్లు. అంటే ఇరువైపులా స్కెచ్చులు, అవకాశాలు ఉన్నాయి. ఇక్కడే ఓ కీలక పరిణామం జరిగే వీలుంది. సో… ఈ మొత్తం వ్యవహారం ఏమి లేకుండా సైలెంట్ అయిపోయినా ఆశ్చర్యం అవసరం లేదు. అటు సీఎం జగన్ కి వ్యతికరేకంగా దాఖలైన పిటిషన్లు కొట్టేసి.. ఇటు సీఎం జగన్ రాసిన లేఖని పట్టించుకోకుండా బుట్టదాఖలు చేసేసి.. మొత్తం గప్చుప్ చేసేసినా ఆశ్చర్యం అవసరం లేదు. అక్కడ ఉన్నదీ బీజేపీ..! ఏమైనా చేయగలదు..!!

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!