NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan – NV Ramana: జస్టిస్ ఎన్వీ రమణ రాగానే జగన్ కేసులు తెరపైకి..!? జగన్ ప్రత్యర్థుల ఎత్తుగడ..!!

MP RRR: CM Jagan Future in Justice Hand

YS Jagan – NV Ramana: జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడానికి ఇంకో మూడు రోజులే మిగిలి ఉంది. ఈ నెల 24 న ఆయన ఆ కుర్చీ ఎక్కనున్నారు..! ఆ క్షణం కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. చాలా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. దాదాపు యాభై నాలుగేళ్ల తర్వాత తెలుగు వ్యక్తి సుప్రీమ్ చీఫ్ జస్టిస్ అవుతున్నాడు అనే సంతోషం కంటే.. “తమ” మనిషి ఆ కుర్చీ ఎక్కుతున్నాడు.. జగన్ వ్యతిరేకి ఆ కుర్చీ ఎక్కుతున్నాడు.. అనే సంతోషమే “జగన్ వ్యతిరేక వర్గం”లో నాటుకుంది. అందుకే సరిగ్గా జస్టిస్ రమణ ఆ కుర్చీలోకి రావడానికి పది రోజుల ముందు నుండి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దవుతుంది.. జగన్ బెయిల్ రద్దవుతుంది.. అంటూ పదే పదే రంకెలేస్తున్నారు..! ఇదే ఇక్కడ లోతైన చర్చనీయాంశం..!!

సీఎం జగన్ రిస్క్ లో పడినట్టేనా..!? జస్టిస్ రమణ విషయంలో ఏం జరిగింది…!?

YS Jagan - NV Ramana: big sensations soon in Ap Politics
YS Jagan NV Ramana big sensations soon in Ap Politics

YS Jagan – NV Ramana: పిటిషన్లు మీద పిటిషన్లు..!!

జగన్ గడిచిన రెండేళ్ల పాలనలో ప్రజల్లో కొంత మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ అనేక వర్గాలకు శత్రువుగా మారిపోయారు. 2019 లో తనకున్న రాజకీయ శత్రువుల కంటే ప్రస్తుతం జగన్ కి ఎక్కువ మంది రాజకీయ శత్రువులున్నారు. అందుకే జగన్ బెయిల్ ఎప్పుడు రద్దవుతుందా..!? జగన్ ఎప్పుడు జైలుకి వెళ్తారా..!? వైసీపీలో కుంపటి మొదలవుతుందా..!? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ వర్గానికి నాయకత్వం, దర్శకత్వం వహిస్తున్నది ఒకరైతే.. అమలు చేస్తున్నది మాత్రం వేరే వ్యక్తి..! మొదటి వ్యక్తులు ఎవరనేది పక్కన పెడితే రెండో వ్యక్తి.. అంటే బయటకు కనిపిస్తున్నది మాత్రం రఘురామకృష్ణంరాజు.. “జగన్ బెయిల్ రద్దు చేయించే అతన్ని మళ్ళీ అరెస్టు చేయించాలనే” ఏకైక లక్ష్యంతో ఈ వర్గం ఉంది. ఢిల్లీ నుండి పనులు చక్కబెడుతున్న అందరికీ కనిపిస్తున్న రఘు మాత్రమే. ఆయనే పిటిషన్లు వేస్తూ.. మళ్ళీ మళ్ళీ పిటిషన్లు వేస్తూ ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. లోపాయికారీగా ఈ పనిని చక్కబెట్టడానికి జగన్ కి పక్కాగా వ్యతిరేకమైన “టీడీపీ- బీజేపీ ఉమ్మడి” బృందం ఒకటి ఆంధ్రా టూ ఢిల్లీ తిరుగుతూ అంతర్గత చర్చల్లో మునిగిందని విశ్వసనీయ సమాచారం..!

YS Jagan - NV Ramana: big sensations soon in Ap Politics
YS Jagan NV Ramana big sensations soon in Ap Politics

జస్టిస్ రమణ కీలకం..!? ఆయనేం చేస్తారో..!?

దేశం మొత్తం మీద ఎక్కడ.. ఏ కోర్టులో పిటిషన్ వేసినా దానిపై అభ్యంతరాలుంటే వెళ్ళాల్సింది.. తుది తీర్పు ఇవ్వాల్సింది సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తినే.. సో ఆ కుర్చీలోకి జస్టిస్ రమణ వెళ్ళబోతున్నారు. “ఈయన జగన్ కి ఎలాగూ వ్యతిరేకి కాబట్టి.. మన పని ఈజీ” అనేది జగన్ వ్యతిరేక వర్గీయుల వాదన..! అయితే ఇక్కడ కొన్ని అంశాలు గమనించాల్సి ఉంది. “దాదాపు మూడు దశాబ్దాలుగా రమణ న్యాయ వృత్తిలో ఉన్నారు. ఈ వృత్తిలో ఉన్న ఎవ్వరికైనా సుప్రీమ్ చీఫ్ జస్టిస్ అవ్వడం అనేది ఒక కల. ఒక అత్యున్నత పురస్కారం. ఆ స్థాయికి రమణ చేరుకోకుండా జగన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే రమణ జీవితకాల శ్రమని, లక్ష్యాన్ని ఒకే ఒక్క లేఖతో జగన్ తుంచేయాలని చూసారు. ఎంత కాదనుకున్నా.. రాజ్యాంగ బద్ధమైన పదవులు అంటూ బయటకు చెప్పుకున్నా.. ఈ దెబ్బతో సీఎం జగన్ జస్టిస్ రమణకి శత్రువుగా మారిపోయారనేది మాత్రం ఒప్పుకోవాలి. దీన్ని ఆయన ఏ విధంగా తీసుకుంటారు..? అక్కడితో వదిలేస్తారా..!? తన స్థాయిని ప్రయోగిస్తారా..? అంటే పైకి అవునని, కాదని చెప్పలేం. అవి రాజ్యాంగ బద్ధం కాదు. కానీ… ఆయన కూడా ఒక మనిషి. అందరిలాగానే కోపాలు, తాపాలు, అలకలు, ద్వేషాలు ఉంటాయి. అంచేత జగన్ చేసిన పనిని అక్కడితో వదిలేస్తారులే అనుకోవడం పొరపాటే. ఏమైనా జరగొచ్చు..! అందుకే రమణ దగ్గరికి ఈ పిటిషన్ వెళ్లేలా చేయడమే.. లేదా పరోక్షంగా ఆయన ఆదేశాలతో ఈ పిటిషన్ పై సుప్రీమ్ లో తీర్పు వచ్చేలా చేయడమే ఈ వర్గం పెద్ద పని. అందుకే అసాధారణ రీతిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. రఘురామకృష్ణం రాజు రూపంలో బయటకు కొన్ని తెలుస్తున్నాయి. కొన్ని జరిగిపోతున్నాయి..!!

 

author avatar
Srinivas Manem

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!