NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan; జనంలోకి జగన్ కానీ.. షరతులు వర్తిస్తాయి..!!

YS Jagan; Ready to Field Tours bu...

YS Jagan; వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది.. ఎమ్మెల్యేలు కానీ.., ఎంపీలు కానీ.. ఇటు సీఎం స్థాయిలో కానీ ఈ ప్రభుత్వానికి ఉన్న లోపాల్లో ఒకే ఒక్కటి క్షేత్రపర్యటనలు లేకపోవడమే.. గత ప్రభుత్వాలు ఏడాదికి రెండు, మూడు సార్లు రకరకాల కార్యక్రమాలు పేరుతో జనంలో తిరిగేవి. వైఎస్ అధికారంలో ఉన్నపుడు ఏడాదిలో రెండు సార్లు రచ్చబండ అనీ.., కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక ప్రజాపథం అనీ.., చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి మీ ఊరు అని కార్యక్రమాలు నిర్వహిస్తూ… పాలకులు, అధికారులు యంత్రాంగం మొత్తం గ్రామాల్లో తిరిగేది. కానీ గడిచిన రెండేళ్లుగా ఈ క్షేత్ర కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కరోనా కానీ..,
ఆసక్తి లేకపోవడం కానీ.., అనుభవ లేమి కానీ కారణాలు ఏమైనా ఉన్నప్పటికీ జగన్ పాలనలో ఇదో లోపంగా చెప్పుకునే స్థాయికి చేరింది. ప్రతిపక్షాలు కూడా సీఎం కాంప్ ఆఫీస్ కె పరిమితమయ్యారు అంటూ పదే పదే విమర్శలు గుప్పిస్తున్నాయి. లోపాలు అధిగమించి, విమర్శలకు సమాధానం చెప్పాల్సిన తరుణం జగన్ కి ఆసన్నమైనది. సో… “వారానికి రెండు సచివాలయాల సందర్శన” అన్నారు. ఇప్పటికే రెండేళ్లు ముగిసిన నేపథ్యంలో ఇక జనంలోకి వెళ్లాలనేది జగన్ ఆలోచన..

YS Jagan; Ready to racchabanda two but...
YS Jagan Ready to racchabanda two but

YS Jagan; కానీ కొన్ని ఇబ్బందులున్నాయి..!!

జగన్ జనంలోకి వెళ్లడం ఇప్పుడు సులువేం కాదు. కరోనా కారణంగా కొంత కాలం ఆగాల్సి ఉంటుంది. మూడో దశ రాకపోకలు చూసుకుని, షెడ్యూల్ రూపకల్పన చేసుకోవాలి. పైగా ఒకే వారంలో రెండు సచివాలయాలు అంటే రెండు భిన్నమైన జిల్లాల్లో ప్లాన్ చేసుకుంటే ఈ జిల్లాల్లో యంత్రంగం మొత్తం సీఎం దగ్గరే ఉండాలి. ఆ రోజు ఇతర పనులన్నీ నిలిచిపోవాల్సిందే. పైగా ఆర్ధిక భారం కూడా ఎక్కువ ఉంటుంది. నిరుద్యోగుల డిమాండ్లు.., ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోవడం.., గ్రామాల్లో చురుకుగా పనులు జరగకపోవడం కొన్ని సమస్యలు. గతంలో టీడీపీ జన్మభూమి కార్యక్రమలు చేపట్టడానికి ముందే ఆ గ్రామంలో గడిచిన ఏడాదిలో జరిగిన అభివృద్ధి పనులు అంటూ కొన్ని అభివృద్ధి, సంక్షేమ పట్టికలు వేసేవారు. దీనిలో మొత్తం వాస్తవం కాకపోయినా ఎంతో కొంత జనాలకు చేరువయ్యేది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వానికి అలా చెప్పుకోడానికి ఏమి లేదు. కేవలం సంక్షేమ పథకాల లెక్కలు తప్పితే పనుల లెక్కలు మాత్రం చెప్పలేరు. ఇలా ఇన్ని సవాళ్ల మధ్య సీఎం క్షేత్రానికి వెళ్లాలంటే కొన్ని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.

YS Jagan; Ready to racchabanda two but...
YS Jagan Ready to racchabanda two but

ఎమ్మెల్యేలపై అక్కడక్కడా వ్యతిరేకత..!!

ఇటీవల వైసిపి ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగడం ప్రారంభించారు. కొన్ని చోట్ల అనుకోని ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతాల్లో నిరసనలతో పాటూ శ్రీకాకుళం జిల్లా, నెల్లూరు జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు కూడా నిరసనలు ఎదురయ్యాయి. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న ప్రశ్నలు, ఇబ్బందులు సీఎం స్థాయిలో ఎదురైతే ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుంది. సీఎం జగన్ ఇటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసే ముందే…. రాజధాని విషయంలో మూడు రాజధానుల విషయంలో ముందడుగు పడాలి. ఆయన అనుకుంటున్నట్టు విశాఖ నుండి పాలన మొదలవ్వాలి. లేకపోతే ఏపీలో ఎవ్వర్నీ మీ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టు 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. రాష్ట్రానికి అత్యవసరమైన రాజధాని, పోలవరం విషయంలో ప్రభుత్వం సత్ఫాలితాలు సాధించిన తర్వాత జనంలోకి వెళ్తే సానుకూలత కనిపించవచ్చు. ఇవేమి లేకుండా కేవలం సంక్షేమ రథం ఊరేగుతూ గ్రామాల్లో పర్యటనలు చేస్తే ఆశించిన అనుకూలత కనిపించకపోవచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం.

* అన్నిటికీ మించి సీఎం కి చిక్కులున్నాయి. మానసిక అశాంతత నెలకొంది. బాబాయి వివేకా హత్య కేసులో ఒత్తిళ్లు.., కోర్టు కేసులు.., వ్యవస్థలతో వివాదాలు.., రఘురామా వివాదం.. ఈ అన్నిటితో జగన్ సతమతమవుతున్నారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా జగన్ వ్యవస్థలతో పేచీ పెట్టుకున్నారు. అందుకే ఇన్ని తలభారాలు పెట్టుకుని జనంలోకి వెళ్లి మాట్లాడాలంటే తడబాటు తప్పకపోవచ్చు..

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!