YS Jagan: జగన్ షిమ్లా టూర్ విహారమా..? కీలక ఒప్పందమా..!? ఫ్యామిలీ టూర్ టాప్ సీక్రెట్లు..!!

YS Jagan: Tour Secrets of YS Family
Share

YS Jagan: సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతిల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గత వారంలో ఆ కుటుంబం షిమ్లా టూర్ వేసిన సంగతి తెలిసిందే..! మూడు రోజుల పాటూ అక్కడే గడిపి.. రకరకాల ఫోటోలు, అక్కడి డీజీపీతో జగన్ చర్చలు అన్నీ బయటకు వచ్చాయి. పాతికేళ్ల వివాహబంధాన్ని జగన్ అక్కడ జరుపుకున్నారనేది మాత్రమే బయటకు తెలిసిన వాస్తవం. కానీ దీనిలో కూడా కొన్ని సీక్రెట్లున్నాయి. జగన్ ఏం చేసినా అందులో చాలా లోతులు, లెక్కలు ఉంటాయి. ఆయన రాజకీయ, కుటుంబ, ఆర్ధిక వ్యవహారాల్లో ఆరితేరినప్పటికీ.. కొన్ని ఒత్తిళ్లలో ఉన్నారు. సీఎం అయిన తర్వాత అనుకోని కొన్ని, అనుకోకుండా కొన్ని చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఒకరకమైన రాజకీయ చట్రంలో ఇరుక్కుపోయారు. కేసులు, విమర్శలు, ఆరోపణలు, ఒత్తిళ్ల నుండి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే పరిస్థితి లేదు. అన్నిటికీ మించి జగన్ కుటుంబంలోనే నెలకొన్న కొన్ని అంతర్గత అసమ్మతులు, అసంతృప్తుల పరిస్థితుల కారణంగానూ తాము చులకన అవుతున్నామన్న భావన ఆయనలో ఉంది. అందుకే షిమ్లా టూర్ వేదికగా కొన్ని కుటుంబ సంప్రదింపులు కూడా జరిగాయని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తుంది..!

YS Jagan: Tour Secrets of YS Family
YS Jagan: Tour Secrets of YS Family

YS Jagan: విజయమ్మ వెళ్ళొచ్చారట..!!

షిమ్లా టూర్ కి కేవలం జగన్, భారతి మాత్రమే వెళ్ళొచ్చారని అందరికీ తెలుసు. ఫోటోలు కూడా అవే బయటకు వచ్చాయి. కానీ ఈ టూర్ లో విజయమ్మ, ఇంకొందరు కుటుంబ ముఖ్యులు కూడా హాజరయ్యారనేది అంతర్గత సమాచారం. వైఎస్ వివేకా హత్య కేసులో దగ్గరి వాళ్ళ పాత్రపై అనుమానాలు బలపడుతుండడం.. ఈ కేసు ఛేదనలో జగన్ పై ఒత్తిళ్లు ఎక్కువవుతుండడం.., తెలంగాణాలో పార్టీ పెట్టిన షర్మిల తరచూ జగన్ పై పరోక్షంగా చురకలు వేస్తుండడం ., జగన్ బెయిల్ రద్దు కేసులో ఈ నెలలోనే తుది తీర్పు రానుండడం.. ఇలా కీలక అంశాలపై ప్రశాంతంగా చర్చించడానికి అక్కడకు వెళ్లారని టాక్ నడుస్తుంది. జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశమే లేదని అందరిలోనూ నమ్మకం ఉంది. బెయిల్ షరతులు ఉల్లంఘించలేదు, పైగా ఆయనపై కొత్త ఆరోపణలేమి లేవు, సీబీఐ కూడా బెయిల్ రద్దుపై పట్టుపట్టడం లేదు. ఈ కేసులో జగన్ కి సానుకూలంగానే తీర్పు వస్తుందని సన్నిహితులు అందరూ నమ్ముతున్నారు. అయితే వైసీపీలో ఓ వర్గంలో మాత్రం జగన్ బెయిల్ రద్దయితే ఫలానా వ్యక్తి సీఎం, ఫలానా మంత్రి సీఎం అంటూ కొత్త ప్రచారాలకు తెరతీస్తున్నారు. ప్రత్యర్థి సోషల్ మీడియాలు కూడా భారతి పేరుని, షర్మిల పేరుని తెరమీదకు తీసుకొస్తూ ఊహాగానాలు రాస్తున్నారు. అందుకే ఈ అంశంలో కూడా ఒక స్పష్టత కోసం అక్కడ చర్చలు జరిపినట్టు సమాచారం. అన్నిటికంటే ముఖ్యంగా షర్మిల వ్యవహారమే ఎక్కువగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది..

YS Jagan: Tour Secrets of YS Family
YS Jagan: Tour Secrets of YS Family

సగం ఫలితం ఇదేనా..!?

తెలంగాణ రాజకీయాల్లో షర్మిల అడుగు పెట్టిన నాటి నుండి జగన్ – షర్మిల మధ్య రకరకాల వివాదాలు, విబేధాలు నెలకొన్నాయి. వాటికి బలం చేకూర్చుస్తూ షర్మిల కూడా అప్పుడప్పుడూ మాట్లాడుతున్నారు. సాక్షి మీడియాపై ఆమె కామెంట్లు చేయడం, తనకు ఎందుకు పదవి ఇవ్వలేదో జగన్ నే అడగండి అంటూ మీడియాకు చెప్పడం.., నీటి విషయంలో ఇద్దరు సీఎంలు డ్రామాలాడుతున్నారు అంటూ చురకలు అంటించడం.. వంటివి చూస్తే జగన్ ని షర్మిలా ఎంతగా విభేదిస్తున్నారో అర్ధమవుతుంది. అన్నిటికీ బలం చేకూర్చేలా జూలైలో జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమాలకు షర్మిల హాజరు కాలేదు. దీంతో జగన్ ఒకరకంగా ఇరుకున పడ్డారు. కుటుంబ పెద్దగా చెల్లికి అన్యాయం చేస్తున్నారన్న అపఖ్యాతి ఆరంభమయింది. సెప్టెంబర్ 2న జరిగే వర్ధంతి కార్యక్రమాలకు కూడా షర్మిల రాకపోతే ఆ అపఖ్యాతి పెరుగుతుంది.. ఇద్దరి మధ్య ఏదో పెద్ద వివాదమే ఉంది అనే చర్చ బయటకు వెళ్తుంది.. అదే జరిగితే ఎక్కువ నష్టపోయేదియో జగనే.. అందుకే షర్మిలను వర్ధంతి వేడుకలకు వచ్చేలా చేయడంపై షిమ్లాలో చర్చించారని.. ఆ ఫలితంగానే ఈ నెల రెండో తేదీన జరిగిన వర్ధంతి కార్యక్రమాలకు షర్మిల కుటుంబ సమేతంగా ఇడుపులపాయకు హాజరయ్యారని అంటున్నారు. అయితే షిమ్లాలో చర్చలు సగం, సగం సానుకూలత వచ్చింది కాబట్టే.. షర్మిల – జగన్ ఏమీ మాట్లాడకుండా ఎడమొఖం, పెడమొఖంగా తండ్రి వర్దంతిలో పాల్గొన్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

 


Share

Related posts

నోటిదురుసును ప్ర‌ద‌ర్శించిన ట్రంప్.. కౌంటర్ ఇచ్చిన జో బైడెన్!

Teja

బాలయ్యకు నానిపై తీవ్ర కోపం వచ్చింది..! ఎమన్నాడంటే..?

somaraju sharma

కమలం పార్టీ గంటా కి బంపర్ ఆఫర్..??

sekhar