NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

YS Sharmila: డౌటే లేదు.. జగన్ పైకి కూడా షర్మిల బాణం..!?

YS Sharmila: Political Party in AP.. Twists

YS Sharmila: రాజకీయ పార్టీ ఎవరి కోసం పెట్టారు..!? ఎవరికి వ్యతిరేకంగా పెట్టారు..!? ఎవరు పెట్టిస్తే పెట్టారు..!? ఆమె ఎవరి బాణం..? ఎవరి పైకి బాణం..!? ఈ ప్రశ్నలన్నీ కొన్ని రోజులుగా తెలుగు రాజకీయ అభిమానుల్లో/ వైఎస్ కుటుంబ అభిమానుల్లో కూడా మిగిలిపోతున్నాయి. సమాధానం స్పష్టంగా దొరకడం లేదు. అయితే ఈ ప్రశ్నలను ఛేదించడానికి ఎక్కువ సమయం అవసరం లేదు. ఒక్కో అనుమానాన్ని షర్మిలానే తీర్చేస్తున్నారు. ఒక్కో ప్రశ్నకు ఆమెనే సమాధానం ఇచ్చేస్తున్నారు. తన అన్న .. ఏపీ సీఎం జగన్ పై ఒకో వేదికపై ఒక్కోలా స్పందిస్తూ తన అంతర్గత వ్యతిరేకత / తమ విబేధాలను మాత్రం బయటపడేలా చేస్తున్నారు..!

YS Sharmila: Viral Comments on Jagan Channel
YS Sharmila Viral Comments on Jagan Channel

YS Sharmila: సాక్షి పేరెత్తి.. జగన్ టార్గెట్ గా..!!

షర్మిల ఏమి తెలియక మాట్లాడరు. మాట్లాడడంలో జగన్ కంటే ఒక అడుగు ముందే ఉంటారు. సూటిగా, స్పష్టంగా చెప్పేస్తారు. కొంచెం తెలివిగా.. ఆచితూచి మాట్లాడతారు. అటువంటి షర్మిల ఈరోజు తన ఎదురుగా సాక్షి విలేఖరి వీడియో తీస్తుండగా… “మీ కవరేజీ చాల్లెమ్మా.. ఎలాగూ సాక్షి మా కవరేజి ఇవ్వదుగా..” అంటూ ఈరోజు చేసిన వ్యాఖ్య అలజడి రేపింది. జగన్, షర్మిల.. వైఎస్ కుటుంబ అభిమానులకు గుచ్చుకుంది. ఇన్నాళ్లు ఇద్దరూ ఒకటే.. ఒకరు తెలంగాణాలో, ఒకరు ఏపీలో రాజకీయం అనుకున్న వైఎస్ అభిమానులకు షర్మిలకు/ జగన్ కు మధ్య విబేధాలు ఒక్కోటీ బయటపడుతున్నాయి. గత నెలలలో జరిగిన ఏ మీడియా మీట్ లో “నాకు ఎందుకు పదవి ఇవ్వలేదో జగన్ ని అడగండి” అంటూ నేరుగా వ్యాఖ్యలు చేసారు. సో.. ఆమె వ్యాఖ్యలు జగన్ కి వ్యతిరేకం. ఆ ఇద్దరి మధ్య విబేధాలు అనేవి ఫిక్స్..!!

YS Sharmila: Viral Comments on Jagan Channel
YS Sharmila Viral Comments on Jagan Channel

జూలై లో స్పష్టత..! ఆవిర్భావ సభ ద్వారా అజెండా..!?

షర్మిల రాజకీయ పార్టీ పూర్తిస్థాయిలో ఇంకా రాలేదు. ప్రస్తుతానికి ఆమె ఒక పార్టీ పేరు, వేదిక లేకుండా ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే ఆడుతున్నారు. జూలై నెలలో పార్టీ ఆవిర్భావ సభ ఉంది. వైఎస్ జయంతిని పురాక్సారించుకుని అప్పుడు పెట్టారు. ఆ సభకి వైఎస్ కి అత్యంత ఆత్మీయులను ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. సూరీడు, కేవీపీ రామచంద్రరావు సహా వైఎస్ తో కలిసి పని చేసిన కొందరు కీలక కాంగ్రెస్ పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నట్టుగా సమాచారం. వైఎస్ అసలైన అభిమానులు నాతోనే ఉన్నరని.. వైఎస్ కి అసలైన వారసురాలిని తానేనని షర్మిలా చాటి చెప్పాలి అనుకుంటున్నారు. తద్వారా ఏపీలోని వైఎస్ అభిమానులకు కూడా చేరువై.. వచ్చే రెండేళ్లలో ఇక్కడ కూడా రాజకీయ పునాదులు నిర్మించాలనేది షర్మిల వ్యూహంగా తెలుస్తుంది. ఓ జాతీయా పార్టీ వ్యూహంలో భాగంగా ఆమె ఇవన్నీ చేస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై అప్పుడే ఏదీ ఫిక్సవ్వలేం..!!

author avatar
Srinivas Manem

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju