NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

కొలిక్కి వచ్చిన వైఎస్ హత్య కేసు..!? సీబీఐ విచారణలో కీలక అడుగు..!!

YS Viveka Case: New Suspects in CBI Enquiry

“న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక క్రైమ్ ప్రతినిధి

ఓ వ్యక్తి మృతిపై అనుమానాలు ఉంటే.., మొదట పోలీసులు దాన్ని ఐపీసీ సెక్షన్ 174 ప్రకారం నమోదు చేయాల్సి ఉంటుంది. అక్కడితో అయిపోదు… ఆ వ్యక్తి మృతికి అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది.. ఒకవేళ ఆ కేసులో లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత ఎలాంటి అనుమానాలు లేకుంటే దాన్ని పక్కాగా ఇన్వెస్టిగేషన్ అధికారి నివేదిక రూపంలో డీఎస్పీ స్థాయి అధికారికి పంపాల్సి ఉంటుంది. మరి సదరు మృతి మీద దర్యాప్తులో ఇన్వెస్టిగేషన్ టీమ్ కు ఖచ్చితమైన ఆధారాలు లభించినప్పుడు మాత్రమే సదరు కేసును ఇతర సెక్షన్లకు బదిలీ చేయాలి…! తాజాగా వైయస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో సిబిఐ అధికారులు సెక్షన్ 302 హత్య కేసు కింద మార్పు చేశారు. దీంతో పాటు ఇప్పటి వరకు ప్రాథమిక విచారణ నిర్వహించిన బృందాన్ని పక్కనపెట్టి సిబిఐ నేర పరిశోధన విభాగానికి కేసును బదిలీ చేశారు. డిఎస్పీ స్థాయి అధికారిని కేసు ఇన్వెస్టిగేషన్ అధికారిగా నియమించారు..!!

హత్య ఆయుధం లభించిందా ??

సాధారణంగా హత్యకేసులో హత్యకు ఉపయోగించిన ఆయుధమే ప్రధాన ఆధారంగా పరిగణిస్తారు. అలాగే హతుడికి సంబందించిన ఆనవాళ్లు కేసులో ప్రధానమైనవి. ఈ రెంటిలో ఏవి లేకున్నా దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోదు. వైయస్ వివేక హత్య కేసులో మృతుడి ఆనవాళ్లు స్పష్టం గా ఉండడంతో ఇప్పుడు అతని హత్యకు ఉపయోగించిన ఆయుధమే ప్రధానమైనది.

YS Viveka Case: CBI Mind Game with Criminals..?

ప్రాథమిక దర్యాప్తులో సుమారు 85 మందిని విచారించిన సిబిఐ అధికారులు.., దీనిలో కీలకమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా కేసును అమితమైన వేగంతో దర్యాప్తు చేస్తున్న బృందానికి హత్యకు ఉపయోగించిన కొన్ని రకాల ఆయుధాలు లభించినట్లు సమాచారం. దీంతో సీబీఐ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించి కేసును హత్య కేసుగా మార్పు చేసి, దర్యాప్తును వేగవంతం చేసి వెంటనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.!

YS Viveka Case: Third Degree Lie Detector to Suspects

కారణాలు వ్యక్తిగత వైరాలేనా ..?

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కు పూర్తిగా వ్యక్తిగత వ్యవహారాలు కారణమని తెలుస్తోంది. దీనిలో ఆర్థిక సంబంధాలు ముడిపడి ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. వివేక ఫోన్ నెంబర్ లో హత్య జరిగిన రోజు దగ్గరనుంచి గత మూడు నెలలుగా ఆయన కాల్ లిస్ట్ సేకరించిన సిబిఐ.. దానిలో కీలకమైన వ్యక్తుల అందరినీ విచారించింది. దీనిలో కొన్ని సెటిల్మెంట్ వ్యవహారాలు, కొన్ని కుటుంబ పరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక హత్య జరిగిన రోజు సంఘటనా స్థలంలో ని సమీప సెల్ టవర్ల నుంచి వెళ్ళిన కాల్స్ ను సిబిఐ వడబోసింది.

YS Viveka Murder Case: CBI Third Phace Started

దీంతోపాటు రాజకీయ పరమైన విభేదాలతోనే హత్య జరిగి ఉంటుందా..? అనే కోణంలోనూ సిబిఐ వివరాలు సేకరించింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఓ చెప్పుల దుకాణం యజమాని అకౌంట్ నుంచి భారీగా నగదు బదిలీలు జరిగినట్లు గుర్తించిన సిబిఐ అధికారులు అతనిని, అతడికి సంబంధించిన వ్యక్తులను విచారించగా కీలకమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచే మారణాయుధాలు లభించి కేసును వెంటనే హత్య కేసు గా మార్చినట్లు, చార్జిషీటు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే సిబిఐ ఈ కేసు పూర్తి నివేదికను చార్జిషీట్లను నేరుగా న్యాయస్థానానికే పంపనుంది. దీంతో అసలు ఈ కేసులో నిందితులు ఎవరు..? ఏ కారణాల చేత ఈ వ్యవహారం జరిగిందనేది కొద్దిరోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది.

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?