NewsOrbit
Featured బిగ్ స్టోరీ

బాబోయ్… సీఎం బాబాయ్ కేసు…! సీబీఐకి ఆదిలోనే చిక్కులు…!

హత్య కేసు ఏదైనా దర్యాప్తులో 4 రకాలు ఉంటాయి. 1.లాజికల్ 2. మేజికల్ 3. టిపికల్ 4. హార్మ్ ఫుల్… కేంద్ర దర్యాప్తు సంస్థ ఎప్పుడూ మొదటి పద్దతినే ఫాలో అవుతుంది. లాజికల్ గా దర్యాప్తు మొదలు పెట్టి.., అవసరమైతేనే రెండో దశకు వెళ్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో సంచలన కేసులో ఒకటిగా ఉన్న సీఎం జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలకంగా మారింది.

సలభమేనా… సవాలా…??

వైస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మొదటి పద్ధతికి ఏ మాత్రం సరిపోతుంది అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న… లాజికల్ దర్యాప్తు కు సంఘటన జరిగిన వెంటనే ఎలెర్ట్ అయితేనే దర్యాప్తు లో కొన్ని అంశాలు సులభంగా దొరుకుతాయి… మార్చి 15 2019 లో జరిగిన హత్యకు ఏడాది తర్వాత జరిగే సీబీఐ దర్యాప్తు వల్ల కొత్తగా బయటకు వచ్చే విషయాలు ఉండవు.. వివేకా హత్య కేసు దర్యాప్తులో ఇప్పటికే వాచ్ మెన్, సీ ఐ, వివేక్ వంట మనిషి, అనుచరులతో పాటు కుటుంబ సభ్యులను సీబీఐ విచారించింది. దీనితో పాటు అప్పట్లో అనుమనితులుగా బయటకు వచ్చిన కొందరిని రహస్యంగా కలిసి వివరాలు సేకరించారు… దర్యాప్తులో వీరు చెప్పిన దానికి క్షేత్రస్థాయిలో సీబీఐ అధికారులు గమనించిన విషయాలే ఇప్పుడు కీలకం.

 

 

కేసులో ముందుకూ వెనక్కూ…!!

కేసును హై కోర్ట్ ఆదేశం మేరకు దర్యాప్తు చేపట్టిన సీబీఐ మొత్తం కేసు నివేదిక అంత కోర్ట్ కే సమర్పిస్తుంది.. ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి దీన్ని మీడియా ముఖంగా చెప్పడానికి అవకాశం లేదు… అయితే కేసు స్వయానా ముఖ్యమంత్రి బాబాయి హత్య కావడం… అప్పట్లో సీబీఐ విచారణ కోరుతూ హై కోర్ట్ ని ఆశ్రయించిన ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి… అధికారంలోకి వచ్చాక ఆ పిటిషన్ వాపసు తీసుకోవడం.. టీడీపీతో పాటు ఇతర పక్షాలు దీనిపై స్పందించడం… నేరుగా జగన్ మీద ఆరోపణలు చేయడంతో ఈ కేసుపై మరింతగా వేడి పెంచాయి.. వివేకా కూతురు సునీత సైతం కేసు దర్యాప్తు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం, వివేకా హత్య కేసు మీద ఆమె జగన్ వైఖరి పట్ల సానుకూలంగా లేకపోవడం దీనిలో ఎం జరిగింది..? అనే ఆసక్తి పెంచింది. హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మరో కొద్దీ రోజుల్లో తేలనుంది.. పక్కాగా ఇది రాజకీయ హత్య అని చెప్పేందుకు అవసరమైన అంశాలు ఏవి ఇప్పటివరకు లభ్యం కాలేదు అని తెలుస్తోంది.

జగన్ మౌనం వెనుక..!

టీడీపీ ప్రభుత్వం వేసిన సిట్ దర్యాప్తు లో ఏం తేలింది అనేది బయటకు రాలేదు… ఎన్నికల అనంతరం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎలాంటి చర్చ రాలేదు.. వివేకా హత్య రాజకీయంగా జరిగింది అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ దీని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అన్నది పెద్ద ప్రశ్న. అయితే ఈ కేసులో వివేక కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు ఉండటం వల్లనే జగన్ తన నిశ్శబ్దం కొనసాగిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్న మాట.. వివేక హత్య తర్వాత ఆయన రెండో పెళ్లి వ్యవహారం బయటకు వచ్చింది.. చిన్న పాప ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది… అది కాక వివేక హత్యకు ముందు ఫోన్ కాల్ డేటాలో కూడా కొన్ని నంబర్లు సిట్ గుర్తించింది.. దానిపై దర్యాప్తు చేసింది… దీనిలో కొన్ని విషయాలు తెలుసుకున్న జగన్ బాబాయ్ హత్యకు పక్కాగా కుటుంబ, వ్యక్తిగత కోణం కారణమని తెలుసుకునే… అది బయటకు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని భావించే దీన్ని పక్కన పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నట్లు భావించవచ్చు.

ఇక చివరిగా హత్య కేసులో దాదాపు ప్రత్యక్ష సాక్ష్యం లేనివి వీగిపోతాయి… వివేక హత్య కేసులో సీబీఐ ఎం తెలుస్తుంది… ఎవర్ని నిందితులుగా చేరుస్తుంది… హత్య క్రమం… సాక్షాలు ఎలా కోర్టుకు నివేదిస్తుంది అనేది ఆసక్తికరం… ఇక స్థానికంగా వివేక కుటుంబం నుంచి.. ప్రభుత్వం నుంచి సరైన సహాకారం లేకుంటే ఈ కేసును నిరూపించడం కూడా సీబీఐ కు కాస్ట సాధ్యమే…

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju