NewsOrbit
Featured బిగ్ స్టోరీ

వివేకా హత్యపై “వైఎస్ఆర్ ఆత్మ – జగన్ అంతరాత్మ” ఏమనుకుంటున్నాయి…?

ప్రస్తుత సీఎంకి చిన్నాయినా.., మాజీ సీఎంకి అత్యంత ఇష్టమైన తమ్ముడు…, మాజీ సీఎం భార్యకి వివేకం అన్న…! రాష్ట్రంలోని అత్యంత రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబంలో సంచలనాత్మకంగా హత్యకు గురైన వివేకానందరెడ్డి ఉదంతం ఇప్పట్లో ఎవ్వరూ మరిచేది కాదు. ఈ హత్యపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు జరుగుతుంది.

వైఎస్సాఆర్ కి అత్యంత ఇష్టమైన తమ్ముడు వివేకా… అందుకే వైఎస్ ఈయనను బుద్ధుడు అని పిలిచేవారు. విజయమ్మ కూడా “వివేకం అన్న” అంటూ పిలిచేవారు. జగన్ ఆప్యాయంగా చిన్నాయినా అంటూ పలకరించేవారు. బయటకు తెలియకుండా పులివెందుల రాజకీయాన్ని మూడు దశాబ్దాలుగా ఆయన నడిపించేవాడు అని విజయమ్మ పుస్తకంలోనే రాశారు. ఎవరు అవునన్నా, కాదన్నా వైఎస్ మరణం తర్వాత జగన్ కి అండగా నిలబడింది వివేకనే..! ఇటువంటి వ్యక్తి హత్య ఉదంతంపై ఏడాది దాటినా ఏమి తేలడం లేదు. మరి ఈ తరుణంలో వైఎస్ ఆత్మ – జగన్ అంతరాత్మ సంభాషిస్తే ఎలా ఉంటుంది..? అనేది “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక కథనం.

 

వైఎస్ ఆత్మ : ఏరా నానా జగనూ…! చిన్నాన్న హత్య కేసు ఎటూ తేల్చలేదు. 18 నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు హత్య ఎవరు చేసారు? అనే స్పష్టత రాలేదు. బాధ్యులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకునేలా చేస్తావు అనుకుంటే… నీలోనూ వేగం లేకపోతే ఎలారా..? ఏమైంది నానా…??

జగన్ అంతరాత్మ :

లేదు నాన్న.., చిన్నాయినా హత్య విషయంలో ఎక్కువగా మానసికంగా కుంగిపోయింది నేను. మీరు దూరమై, ఆయన దూరమయ్యాక అత్యంత ఒంటరిగా మిగిలింది నేను నాన్న. కానీ నా పరిస్థితులు వేరేలా ఉన్నాయి. “తుపాను వేళన సముద్రం నడిమధ్యలో నావలో ఒంటరిగా ఉన్నట్టు… బాబాయి హత్య జరిగిన నాటికి నేను అదే పరిస్థితిలో ఉన్నాను.” ఎన్నికల ప్రచారం.., మన ప్రత్యర్థి చంద్రబాబుని ఓడించే నా “రాజకీయ చావు- బతుకుల పోరాటంలో ఉన్నాను” ఆ సమయంలో బాబాయి హత్యకు గురి కావడం ఒకేసారి కోపం, నిస్సహాయత, అసహనం.., పుట్టుకొచ్చాయి. కానీ ఎన్నికల హడావిడి కారణంగా దృష్టి పెట్టలేకపోయాను”

YS Viveka Murder Case: CBI Third Phace Started

సీబీఐ వచ్చింది…! నిజాలు తేలుస్తుంది…!

“కానీ నాన్న… నేను సీఎం అయిన తర్వాత ఈ హత్య విషయంలో సీరియస్ గా దర్యాప్తు చేయించాను. మీ దగ్గర డీజీపీగా చేసిన మహంతి కుమారుడు, కడప ఎస్పీ అభిశేక్ మహంతి చేత దర్యాప్తు చేయించాను. దీనిలో నాకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు.., అంతుచిక్కని వ్యవహారాలు… బయటకు వస్తున్న తరుణంలో… ఇటు మన ప్రత్యర్థి చంద్రబాబు రాజకీయ విమర్శలు, అటు చెల్లమ్మ సునీత రెడ్డి అనుమానాలు రేకెత్తించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సీరియస్ గానే విచారణ చేయించాను. ఓ దశలో దీనిలో మన కుటుంబం, బంధువర్గంలో ఏమైనా పాత్రలున్నాయా..? ఉన్నా ఉపేక్షించకూడదు.., అనే కోణంలో కూడా దర్యాప్తు సాగింది. ఈ సమయంలో చెల్లమ్మ పిటిషన్, ఇతర వ్యవహారాలు కారణంగా మరింత వాస్తవాలు కోసం కోర్టు ద్వారా సిబిఐ రంగంలోకి దిగింది.

నేను హామీ ఇస్తున్నా నాన్న…!!

“సీబీఐ దర్యాప్తు కీలక దశలో ఉంది. నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. ఈ హత్య కేసులో ఎవరున్నా… మన బంధువులే అవ్వనీ, మన ప్రత్యర్థులే అవ్వనీ, ఎంతటి వారైనా ఉపేక్షించను. దర్యాప్తులో వెల్లడైన వాస్తవాల్లో మన దగ్గరి వాళ్ళ పాత్ర, ప్రమేయం ఉండకూడదు అని కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ విధంగా ఉన్నా … ఎంతటి వారైనా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని మీకు హామీ ఇస్తున్నాను నాన్న…!”

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju