NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP Balineni: ఏబీఎన్ ఆర్కేతో రహస్య బంధం..! బాలినేని తొలగింపు కారణం ఇదే..!

YSRCP Balineni: Secret Behind Balineni Removal

YSRCP Balineni: మంత్రివర్గం విస్తరణ పూర్తయింది.. జగన్ మార్క్ స్పష్టంగా కనిపించింది.. ఉన్నత పదవుల్లో సామజిక విప్లవం వికసించింది.. వైసీపీ అంటే వెనుకబడిన, అణగారిన వర్గలదేనని సీఎం జగన్ మరోసారి రుజువు చేసారు.. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయానికి నాంది వేసి అమలు చేసారు..! అంతా బాగానే ఉంది.., కానీ పాత మంత్రుల్లో 11 మందిని కొనసాగించారు.. ఏ నలుగురో, అయిదుగురునో కొనసాగిస్తారు అనుకుంటే ఏకంగా 11 మందికి మళ్ళీ అవకాశం ఇచ్చారు.. కానీ తనకు బంధువు, తనకు మొదటి నుండి రాజకీయంగా అండగా నిలిచినా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టారు.. నిజానికి పాతవారిని అయిదుగురిని కొనసాగించినా అందులో కచ్చితంగా బాలినేని పేరు ఉంటుందని భావించారు. కానీ 11 మందిలో కూడా అతని పేరు లేదు.. దీనికి కారణం ఏమిటి..!? జగన్ ఎందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు..? బాలినేని అలిగినా పెద్దగా పట్టించుకోవడం లేదు..!? అనేది కాస్త లోతుగా పరిశీలించాల్సిన అంశమే.. అందులో అనేక ఆసక్తి కోణాలున్నాయ్, కారణాలున్నాయ్!

YSRCP Balineni: ఏబీఎన్ ఆర్కేతో బంధమే దెబ్బ..!?

బాలినేని పైకి చాలా సైలెంట్ గా కనిపిస్తారు.. ధాటిగా మాట్లాడరు.. ముభావంగా ఉన్నట్టు ఉంటారు.. కానీ బాలినేనిలో మరో కోణం ఉంది. లోపల అనేక ఆలోచనలుంటాయ్.. అనేక ఎత్తులుంటాయ్.. రహస్య లావాదేవీలుంటాయ్..! అవన్నీ సీఎం జగన్ దగ్గరకు ఎప్పటికప్పుడు చేరుతూ ఉంటాయి. కానీ బంధువే కావడంతో జగన్ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ.. ఒక్క పెద్ద అంశాన్ని మాత్రం జగన్ సీరియస్ గా తీసుకున్నారు.. క్షమించకూడదు అనుకున్నారు..!

YSRCP Balineni: Secret Behind Balineni Removal
YSRCP Balineni Secret Behind Balineni Removal

* ఏబీఎన్ ఛానెల్.. ఆ పత్రిక ఫాలో అయ్యేవారికి చాలా మందికి తెలిసే ఉంటుంది.. “మంత్రివర్గంలో జరిగిన చర్చ మొత్తం మరుసటి రోజున “ఈనాడు, సాక్షి”లో రాని అంశాలు కూడా ఆంధ్రజ్యోతిలో వస్తుంటాయి. లోపలి అంశాలు, అంతర్గత చర్చలు కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చేస్తాయి.. వైఎస్ కుటుంబ అంతర్గత వ్యవహారాలు, షర్మిల – జగన్ విబేధాల వ్యవహారం కూడా ఆంధ్రజ్యోతికి ముందే అందేవి.. ఆ మీడియాలోనే ముందు వచ్చేది. కొత్తపలుకులో అంశాలు కూడా అన్నీ అంతర్గత అంశాలే ఉండేవి.. సో.. తన మంత్రివర్గంలో, తన పార్టీలో ఎవరో ఏబీఎన్ కి పూర్తి సమాచారం ఇస్తున్నారని జగన్ గ్రహించారు. కొందరిపై నిఘా పెట్టారు. మొదట మంత్రి అవంతి శ్రీనివాస్ అని భావించారు. నిజమే.. అవంతి ఏబీఎన్ పెద్దలకు సమాచారాన్ని అందిస్తున్నారని గ్రహించారు.. కానీ “వైఎస్ కుటుంబ అంతర్గత వ్యవహారాలు ఎలా వెళ్తున్నాయి..? అని మరింత ఆలోచించే సమయంలో.. “మంత్రి బాలినేని – సీఎం జగన్ ఇద్దరే మాట్లాడుకున్న అంశాలు కూడా ఆంధ్రజ్యోతిలో ఉన్నదీ ఉన్నట్టు ప్రచురించారు..” అప్పుడు జగన్ అనుమానాలు బలపడ్డాయి. ఇద్దరు రహస్యంగా మాట్లాడుకున్నప్పుడు మూడో వ్యక్తికీ ఎలా తెలిసాయి..? తాను లేదా రెండో వ్యక్తి బయటపెట్టాలి.. తాను చెప్పలేదు కాబట్టి ఆ రెండో వ్యక్తి (బాలినేని) బయటపెట్టి ఉండాలని జగన్ అలోచించి.. మరింత నిర్ధారణ కోసం ఇంటెలీజెన్స్ వర్గాలు, ఆంధ్రజ్యోతికి బాలినేని బృందం ఇచ్చిన ప్రకటనలు అన్నిటినీ ఆరాతీసి.. పూర్తిగా నిర్ధారించుకున్నారు.. “తన రాజకీయ పతనం కోరుకుని.. నిత్యం తనపై బురదజల్లే వార్తలు రాస్తున్న ఆంధ్రజ్యోతి మీడియా పెద్దలకు” బాలినేని ద్వారా సమాచారం వెళ్లడాన్ని జగన్ తట్టుకోలేకపోయారు. అందుకే బాలినేనిని పక్కన పెట్టేశారని సమాచారం. అయితే ఎంతైనా సీనియర్, బంధువు, మొదటి నుండి తనతో రాజకీయంగా నిలిచారు.. కాబట్టి క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పదవిని ఇచ్చే ఆలోచనలో ఉన్నారు..!

YSRCP Balineni: Secret Behind Balineni Removal
YSRCP Balineni Secret Behind Balineni Removal

బాలినేనికీ – ఆర్కేకి బంధమేమిటి..!?

బాలినేని ఫక్తు వైసీపీ.. ఏబీఎన్ ఆర్కే ఫక్తు తెలుగుదేశం వకాల్తా.. ఈ ఇద్దరికీ బంధమేమిటి..!? అనే అనుమానాలు రావచ్చు.. దానికి ఒక క్లారిటీ ఉంది. జర్నలిస్టుల సంఘంలో ఓ పేద్ద నాయకుడిగా చెప్పుకుని.. జర్నలిజంతో వ్యాపారం చేసే ఓ ప్రముఖ జర్నలిస్టు ఒంగోలు ఆంధ్రజ్యోతిలోనే ఏళ్ల తరబడి ఉన్నాడు.. అతనికి, బాలినేనికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ జర్నలిస్టు ఆంధ్రజ్యోతి అయినప్పటికీ.. ఒంగోలు టీడీపీకి అనుకూలంగా కాకుండా వైసీపీ బాలినేని మద్దతుగా ఉండేవారు. అందుకు బహుమతిగా బాలినేని అనేక ప్రకటనలు, బహుమతులు అందించేవారు.. ఈ క్రమంలోనే ఏబీఎన్ ఆర్కేకి 2005 – 2006 లో ఓ కష్టమొచ్చింది. అతని పవర్ ప్రాజెక్టుపై నాటి వైఎస్ సర్కారు దృష్టి పెట్టింది. అవి మూసేసి పరిస్థితి రావడంతో వైఎస్ సర్కారులో ఎవరైతే వైఎస్ కి చెప్పగలరు, తనకు సహకరించగలరు అని ఆరాతీయగా.. ఏబీఎన్ ఆర్కే ఈ బాలినేనితో కలిశారు. అప్పుడు ఇద్దరికీ మంచి పరిచయం ఏర్పడింది. బాలినేని వైఎస్ కి దగ్గరి బంధువు.. తన పని అయిపోతుందని భావించినప్పటికీ ఆర్కే పని అవ్వలేదు. ఆ పవర్ ప్రాజెక్టులు మూసేయాల్సి వచ్చింది. కానీ బాలినేనితో బంధం కొనసాగింది. ఆ బంధం ఎంతలా అంటే.. “బయటకు చెప్పకూడని అంతర్గత అంశాలు కూడా బాలినేని ఈ మీడియాకు అందించేలా.. బాలినేని ఎన్ని ఆర్ధిక లావాదేవీలు జరిపినా ఆంధ్రజ్యోతిలో ఒక్క అక్షరం కూడా రాయనంతగా” ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేలా బంధం బలంగా కొనసాగింది..!

* 2014 నుండి 2019 మధ్య ప్రతిపక్ష నేతగా బాలినేని జిల్లాలో, తన నియోజకవర్గంలో చేసిందేమీ లేదు. పైగా పార్టీ మారడానికి కూడా ప్రయత్నాలు చేసారు. 2015- 16 లో వైసీపీ ప్రజాప్రతినిధులు అనేక మంది టీడీపీలోకి జంపయ్యారు. ప్రకాశం జిల్లా నుండి కూడా నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. దీనిలో ఏబీఎన్ రాధాకృష్ణ కీలక పాత్ర పోషించి మధ్యవర్తిత్వం చేసారు. ఈ క్రమంలోనే బాలినేనితో కూడా ఏబీఎన్ రాధాకృష్ణ చర్చించారు. ఒక అవగాహనా, ఒప్పందానికి వచ్చారు. బాలినేని చేరిక దాదాపు ఖరారు అనుకున్నపటికీ.. స్థానిక రాజకీయం కారణంగా ఆగిపోయింది. అదే సమయంలో బాలినేని ఎమ్మెల్యేగా ఉండి ఉంటె మాత్రం వైసీపీ నుండి టీడీపీకి మారిన 23 ఎమ్మెల్యేల సంఖ్య 24కి చేరేది..! ఇది కూడా సీఎం జగన్ కి బాగా తెలుసు. ఆయనకు పూర్తిగా సమాచారం ఉంది.. ఇదే కాకుండా..

YSRCP Balineni: Secret Behind Balineni Removal
YSRCP Balineni Secret Behind Balineni Removal

* ఈ క్రమంలోనే బాలినేని మంత్రిగా ఈ మూడేళ్ళలో కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలకు పాల్పడ్డారు. అద్దంకి నియోజకవర్గంలో దాదాపు 500 ఎకరాల అటవీశాఖకు చెందిన భూమిని గ్రానైట్ మైనింగ్ చేసుకునే వీలుగా “ల్యాండ్ కన్వెర్ట్” ప్రక్రియ చివరి దశలో ఉంది. ఇది అతి పెద్ద లావాదేవీ. కొన్ని వందల కోట్లు, వందలాది ఎకరాలు, ఢిల్లీ స్థాయిలో పెద్దలు తలదూర్చాల్సిన అంశం. ఈ మొత్తం అంశంలో సూత్రధారి, కీలక పాత్ర మొత్తం బాలినేని పోషించారు. ఇవే కాదు.. అనేక కీలకమైన, రహస్యమైన అంతర్గత ఆర్ధిక లావాదేవీలు జరిపారు. ఒకవేళ “భవిష్యత్తులో టీడీపీ ప్రభుత్వం వస్తే.. ఇవన్నీ బయటపెడితే తనకు ముప్పు ఉంటుందని భావించి.. ఆ ముప్పుని ఎదుర్కోవాలంటే టీడీపీకి సన్నిహితుడైన ఏబీఎన్ ఆర్కేతో స్నేహం ఉండాలనీ భావించి.. ఆర్కేతో ఇలా బంధాన్ని కొనసాగిస్తున్నారు.. సో ఇవన్నీ సీఎం దృష్టికి వెళ్లి, ఆయన నిర్ధారించుకుని.., తనకు ముప్పు అని తెలుసుకుని.. పక్కకు పెట్టినట్టుగా స్పష్టమైన సమాచారం..!

author avatar
Special Bureau

Related posts

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju