Subscribe for notification

ఆ మంత్రి ప్రతిష్ట “పేక మేడలా” కూలినట్టే..! వైసీపీలో అందరికీ వర్తిస్తుంది..!!

Share

పాపం..!! ఆ మంత్రి గారి పరుషం ఆ పేక ముక్కకి తెలియలేదు..! మంత్రి గారి బూతులు ఆ పేక వాళ్ళ “అమ్మ మొగుడి”కి కూడా తెలియలేదు..! మంత్రి గారి రాజకీయం ఆ పేకలో నోట్ల కట్టలకి తెలియలేదు..! మంత్రి గారి గురించి ఆ నోట్ల కట్ట “అమ్మా మొగుడు”కి.. ఆ కౌంటింగ్ మెషిన్ కి, ఆ కార్లుకి కూడా తెలియలేదు..! అందుకే అడ్డంగా పోలీసులకు దొరికిపోయాయి. మంత్రిని మ్యూట్ చేసేశాయి. వైసీపీలో ఆ మంత్రి పెంచుకున్న ప్రతిష్టని పేక మేడలా కూల్చేశాయి..! దీనిలో ఎన్నో నిఘోడ వాస్తవాలున్నాయి. అనేక అనుమానాలున్నాయి. అధికార పార్టీ కీలక నేత, మాటల మంత్రి, ఓ సామాజికవర్గానికి పార్టీలో పెద్ద దిక్కు, ప్రతిపక్షానికి విరుగుడు పడని కీలక కొడాలి నానికి ఇలా షాక్ తగిలింది అంటే దీనిలో కొన్ని శక్తులు తెరవెనుక పని చేశాయి అనేది మాత్రం వాస్తవం..! పోలీసు ఉన్నతాధికారుల దృష్టి ఎంతగా ఉంది అంటే… ఏకంగా పక్క జిల్లా పోలీసులు ఈ సీక్రెట్ ఆపరేషన్ లో పాల్గొన్నారు..!! అదీ దెబ్బ, అదీ షాక్..!!

ఎవరి హస్తం..! ఎవరి స్కెచ్..!?

కొడాలి నాని అంటే వైసీపీలో అందరికీ ఇష్టమే. చంద్రబాబుని, లోకేష్ ని, టీడీపీని ఇరుకున పెడుతూ బీభత్సంగా ఆడుకుంటారు అందుకే వైసీపీ కార్యకర్తలు, నాయకులూ కొడాలి నానిని బాగా దగ్గర చేసుకున్నారు. అటువంటి కొడాలి నానికి తెలియకుండా.. ఆయన ఇలాకాలో పక్క జిల్లా పోలీసులు రహస్య నిఘా పెట్టి, పేకాటని పట్టుకోవడం.., భారీగా వాహనాలు, కాష్ ని సీజ్ చేయడం పెద్ద స్కెచ్ ప్రకారమే జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశం లేనిదే పక్క జిల్లా పోలీసులు దీనిలో తలదూర్చరు. సో.. పోలీసు ఉన్నతాధికారులు ఆదేశం ఇచ్చారు అంటే.. కచ్చితంగా అధికార పార్టీలో కీలక స్థానంలో ఉన్న నేత ఆదేశం అయి ఉండాలి. ఆ నేత ఎవరు..? కొడాలి నానికి వైసీపీలోనూ, ప్రభుత్వం లోనూ చెక్ పెట్టాలని ఒక సైలెంట్ వ్యూహంతో దీన్ని అమలు చేసారా…? అనే అనుమానాలు కలుగుతున్నాయి..!

జగన్ కి తెలియకుండా జరిగిందా..!?

సీఎం జగన్ వ్యవహారం ఎవరికీ ఓ పట్టాన అర్ధం కాదు. ఆయన ఒక ముక్కుసూటి మనిషి. అనుకున్నది చేసేస్తారు. ముఖస్తుతికి లొంగరు. కాకపోతే ఎవరైనా తన శత్రువు చంద్రబాబుని తిడుతుంటే, విమర్శిస్తుంటే ఆస్వాదిస్తారు. అందులో కొడాలి నాని ఆరితేరారు. వైసీపీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నాని మారారు. సో.., నానిని ఒక అడుగు కిందకు దించాలంటే ఇలా బుక్ చేయాలని అధికార పార్టీలోనే కొందరికి అనిపించి ఉండవచ్చు. దీని వలన పార్టీకి ప్లస్ తప్ప, మైనస్ ఏమి ఉండదు. సొంత మంత్రి అయినా ప్రభుత్వం ఊరుకోలేదు.., ఎవరు తప్పు చేసినా ప్రభుత్వం ఊరుకోదు అనే సిగ్నల్స్ జనానికి వెళ్తాయి.. సో.., జనంలో మంచి పేరు, నాని ప్రాభవం ఒక మెట్టు తగ్గించవచ్చు… అనే కొన్ని అంతర్గత వ్యూహాలతో ఈ ఆపరేషన్ నిర్వహించి ఉండవచ్చు.

వైసీపీలో పాఠం ఇది..!!

టీడీపీ పరిస్థితి వేరు. వైసీపీ పరిస్థితి వేరు. టీడీపీలో చంద్రబాబు, లోకేష్ ని పొగిడి.., నాలుగు బిస్కట్లు వేసి.., పార్టీ మారి, మళ్ళీ వచ్చిన స్వేచ్ఛ, స్వతంత్రత ఉంటాయి. క్రమశిక్షణ అనే పేరు బయటకు చెప్పినా.., అంతర్గతంగా చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీ చెప్పేది జరుగుతుంది..!
కానీ వైసీపీలో పరిస్థితి వేరు. ఇక్కడ అంతర్గత స్వేచ్ఛ, స్వతంత్రత పెద్దగా ఉండవు. జగన్ కి తెలియకుండా చీమ కూడా కదలడానికి వీల్లేదు. ఆ పార్టీలో జగన్ సర్వం, జగన్ దే మొత్తం. కోటరీలను అవకాశం లేదు. సజ్జల, వైవీ, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళను కూడా జగన్ ఒక లిమిట్ లోనే ఉంచారు. వాళ్లకి పోటీగా అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి లాంటి వారిని దించారు. సో.., జగన్ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాలి అంటే చెల్లదు. ఏదైనా అలిమిటీ లో చేయాల్సిందే.., మాటల దాడి అయినా, ముఖస్తుతి అయినా..! ఇది పార్టీలో అందరికీ వర్తిస్తుంది. కొడాలి నానికి తగిలిన దెబ్బ రేపు ఇంకొకరికి ఉండవచ్చు. ఆశ్చర్యం లేదు..!!

 

 

 

 

 

 


Share
Srinivas Manem

A seasoned Journalist with over 12 years of experience in working for news agencies predominantly in Telugu, previously worked for Eenadu as District Chief Reporter. Srinivas expertise is in Andhra Pradesh political analysis, however, he also pens many interesting topics ranging from politics to entertainment and life style.

Recent Posts

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

30 mins ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

46 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

2 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

5 hours ago