YSRCP: సీఎం జగన్ జోష్..! కానీ సవాళ్లు చూపించిన ఎన్నికలు ఇవి..!!

YS Jagan: Damaging by Immature decisions
Share

YSRCP: నిన్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీకి బంపర్ మెజారిటీ ఇచ్చేవే.. తిరుగులేని ఆధిక్యతని ఇచ్చేవే.. జగన్ నాయకత్వాన్ని నిలబెట్టేవే.. సీఎంగా 95కి పైగా మార్కులు వేసేవే… కానీ లోలోపల చాలా పాఠాలు నేర్పాయి. చాలా సవాళ్లు మిగిల్చాయి. పైకి నవ్వుతున్న మొహాల్లో.. లోపల ఆలోచనలు రేకెత్తించాయి..! టీడీపీని కోలుకోకుండా చేయాలని కుప్పంపై పార్టీ పెద్దలు దృష్టి పెట్టారు.. కుప్పం ఓడిపోతే ఇక రాష్ట్రంలో ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవదు.. ఆ పార్టీ పనైపోయినట్టేనని పార్టీ పెద్దలు భావించి ఉండవచ్చు.. కానీ అనూహ్యంగా ప్రకాశం జిల్లా దర్శి, కృష్ణా జిల్లాలోని కొండపల్లి.. జగ్గయ్యపేట లాంటి మున్సిపాలిటీలో వైసీపీలో కొన్ని సందేహాలను మిగిల్చాయి. 97 మార్కులొచ్చాయి అంటూ సంబర పడిన సీఎం జగన్ ఆ మూడు మార్కులు ఎందుకు తగ్గాయి..? ఎవరి వలన తగ్గాయి..? తన వాళ్లలో ఎవరు ఏం చేశారు.. అనేది తెలుసుకుని సరిదిద్దుకోగలిగితే ఆ మూడు కూడా కలుస్తాయి, 2024 నాటికి కలిసొస్తాయి..!

YSRCP: టీడీపీకి పెరిగిన ఓటింగ్ శాతం..!?

ప్రత్యర్థి ఎంత బలహీనపడితే.. అధికార పార్టీ అంత బాగా పరిపాలించినట్టు. అధికార పార్టీకి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఎన్ని ఎక్కువ ఓట్లు పడితే.. పరిపాలన అంత చక్కగా ఉన్నట్టు.. ఎన్నికల్లో యంత్రాంగం, పోలీసులను దించకుండా స్వేచ్ఛగా జరిపించి గెలుచుకుంటే.. అప్పుడు ఆ అధికారం శాశ్వతంగా 30 ఏళ్ళు నిలబడుతుందన్న నమ్మకం ఉన్నట్టు… కానీ నిన్న, ఈరోజు వైసీపీ గెలుపు ఆనందం కంటే టీడీపీకి ఓటింగ్ శాతం పెరిగిందన్న బాధ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 13 శాతం.., స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంత మేరకు ఓటింగ్ శాతం పెరిగింది. సీట్లు కూడా పెరిగాయి. సగటున 40 శాతం ఆ పార్టీ పాతుకుపోయినట్టే భావించవచ్చు. ప్రత్యర్థి బలం ఒక్క శాతం పెరిగినా అది అధికార పార్టీ లోపమే.. పరిపాలనలోనో.., అధికార పార్టీలోనో.. స్థానిక నాయకత్వంలోనో ఎక్కడో ఒక చోట పెద్ద లోపాలున్నట్టే గ్రహించాలి. వైసీపీలో చూసుకుంటే పరిపాలనలో లోపం కంటే.., అధికార పార్టీలో కంటే.. స్థానిక నాయకత్వంలోనే ఎక్కువ లోపాలు కనిపిస్తున్నాయి. అందుకే పార్టీ కొన్ని చోట్ల చతికిలపడింది. ఈ విషయాన్నీ వైసీపీ అంత తేలిగ్గా వదిలేయకూడదు. అప్పుడే పార్టీ మూలాల్లోకి వెళ్లి, ఆమూలాగ్రం బాగు చేయగలుగుతుంది. ప్రస్తుతం వైసీపీ అదే పనిలో ఉంది. బలంగా ఉన్నామన్న దర్శిలో ఏమైంది..!? కొండపల్లిలో ఏం జరిగింది..? జగ్గయ్యపేటలో ఏమైంది..!? అనే అంశాలను ఆరాతీస్తోంది. కొందరిపై సీరియస్ చర్యలకు సిద్ధమవుతున్నట్టే తెలుస్తుంది..!

YSRCP: Jagan Happy But.. YSRCP to face Challenges
YSRCP: Jagan Happy But.. YSRCP to face Challenges

సవాళ్ళను స్వీకరిస్తారా..!?

మొత్తానికి 45 సంవత్సరాల చరిత్ర ఉన్న టీడీపీని కొంచెం గెలిస్తే చాలు అనే స్థాయికి తీసుకొచ్చిన ఘనత పూర్తిగా సీఎం జగన్ కె చెందుతుంది.. 40 ఏళ్ళ రాజకీయం అంటూ పదే పదే చెప్పుకునే చంద్రబాబుని సొంత నియోజకవర్గంలో ఓడించిన ఘనత జగన్ కె చెందుతుంది.. జగన్ అధికారంలో ఉంటె ప్రత్యర్థిగా ఉండడం ఇంత నరకంగా ఉంటుందా అనేలా టీడీపీకి రెండేళ్లుగా చుక్కలు చూపిస్తూనే ఉన్నారు.. వాటిని తట్టుకుని, ఎంతో కొంత పునాదులను కాపాడుకుంటూ టీడీపీ నెట్టుకొస్తోంది. అటువంటి పరిస్థితుల్లో టీడీపీ 40 శాతం ఓటింగ్ సాధించే స్థాయికి రావడంలో జగన్ ఫెయిల్యూరే అనేకంటే.. జిల్లా స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో వైసీపీ నాయకుల, మంత్రుల విఫలం అనుకోవచ్చు. సవాళ్ళను స్వీకరించడం.. వాటిని గెలుపులుగా మలచుకోవడం జగన్ కి అలవాటే.. కానీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా స్వీకరిస్తారనేది చర్చనీయాంశం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఓటమిలో ఉన్నప్పుడు సవాళ్ళను కచ్చితంగా స్వీకరించాల్సిందే.. అలా స్వీకరించారు కాబట్టే నంద్యాల ఉప ఎన్నిక ఫలితం నుండి జగన్ రాటుదేలారు.. సో.. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో టీడీపీ గెలుపు, వైసీపీ ఓటమి నుండి పార్టీ నేతలు నేర్చుకుంటే.., సరిదిద్దుకుంటే పరిస్థితులు చక్కబడినట్టే. లేకపోతే టీడీపీకి అవకాశాలు పెంచినట్టు అవుతుంది..!


Share

Related posts

తిరుపతి ఉప ఎన్నిక విషయంలో గందరగోళంలో బీజేపీ- జనసేన..??

sekhar

నేతల నేటి వాక్కులు

somaraju sharma

AP Panchayat Elections : ఇంతకీ ఎవరు ఊరికి మొనగాళ్ళు?పల్లెపోరులో ఎవరికి వీరతాళ్లు?

Yandamuri