NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

YSRCP ; జగన్ X నిమ్మగడ్డ ట్విస్ట్ – ఇదీ అసలైన పోరు..! నిమ్మగడ్డపై వైసీపీ స్ట్రాంగ్ ఆయుధం..!!

CM Jagan VS Nimmagadda ; What Will happen?

YSRCP ; వైసీపీ వాడి పెంచింది. తన “పవర్” చూపించే ఎత్తులు వేస్తుంది. Nimmagadda Ramesh kumar నిమ్మగడ్డకి పూర్తిగా సెగ పెట్టేలా YSRCP ఒక ప్లాన్ రెడీ చేసి.., అమలు చేస్తుంది..! మళ్ళీ ఏ హైకోర్టు వరకో.., సుప్రీం వరకో విషయం వెళ్లినా ఏపీలో రెండు వ్యవస్థ (State Election Commission X YSRCP Government)ల మధ్య పోరు మాత్రం ఇప్పుడు అసలైన స్థాయికి చేరినట్టు చెప్పుకోవచ్చు..!!

రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కూడా గ్రహించి ఉండరు.. దాని పరిధిలో ఉంటూనే ఇన్ని రకాలుగా పగ తీర్చుకోవచ్చు అని.., వ్యవస్థల మధ్య ఇంత స్థాయిలో యుద్ధం జరుగుతుంది అని.., ఇన్ని మలుపులు ఉంటాయని..! జగన్ X నిమ్మగడ్డ లో తాజా ట్విస్టు ఏమిటంటే.. ప్రివిలేజ్ మోషన్. వైసీపీ దీన్ని తెరపైకి తెచ్చింది. నిమ్మగడ్డపై వేసింది. సో.. ఇది చిన్న విషయం కాదు. వైసీపీ ప్లాన్ ప్రకారం, అనుకున్నది అనుకున్నట్టు అమలు చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అసెంబ్లీకి పిలిపించి తలదించుకునేలా చేయొచ్చు. కాకపోతే దీనిలో కూడా చాలా విషయాలున్నాయి. అంత ఈజీ కాదు..!

YSRCP ; Jagan VS Nimmagadda Super Twist
YSRCP Jagan VS Nimmagadda Super Twist

YSRCP ; వైసీపీలో ఇద్దరు సీనియర్ మంత్రులు రంగంలోకి..!!

జగన్ క్యాబినెట్ లో అత్యంత సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యన్నారాయణ. ఈ ఇద్దరికీ సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. తెరవెనుక స్పీకర్, ప్రివెలజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి.., ఇతర ఎమ్మెల్యేలు దిగుతారు. నాలుగు రోజుల కిందట మంత్రులు ఇద్దరూ నిమ్మగడ్డపై కొన్ని వ్యాఖ్యలు చేసారు. వారిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేరుగా విమర్శించలేరు. సో.., గవర్నర్ కి పిర్యాదు చేసారు. ఒక లేఖ రాశారు. ఈ లేఖలో పేర్కొన్న అంశాల ఆధారంగా “మా సభా హక్కులకు భంగం కలిగింది” అంటూ మంత్రులు ఇద్దరూ నిమ్మగడ్డ కి ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. దీన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. సో.., శాసన వ్యవస్థ అంటే ఢీ కొనడం అంత సులువు కాదు.., ఈ విషయం బాగా తెలిసిన నిమ్మగడ్డ కూడా ఇప్పుడు తన పరిధిలో వేగం పెంచారు. మంత్రులు వ్యాఖ్యలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన, ఇతర కేసుల అంశాలని పరిశీలిస్తున్నారు.

YSRCP ; Jagan VS Nimmagadda Super Twist
YSRCP Jagan VS Nimmagadda Super Twist

Nimmagadda ; నిమ్మగడ్డని ప్రశాంతంగా ఉంచరు..!!

ఓ వైపు మంత్రులు టార్గెట్.. మరోవైపు విజయసాయి రెడ్డి.. ఇంకోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు.. ఇలా నలువైపులా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని టార్గెట్ చేస్తూ వైసీపీ గేమ్ ఆడుతుంది. ఎక్కడా ఆయనను ప్రశాంతంగా ఉంచకుండా పొలిటికల్ గేమ్ ఆడుతుంది. “కోర్టులో గెలిచేసాం. పంచాయతీ ఎన్నికలు పెట్టేద్దాం… అనుకున్న నిమ్మగడ్డకి ఇప్పుడు అధికార పార్టీ రకరకాల అస్త్రాలు తీసి ఇబ్బంది పెడుతుంది.

* దీనికి సిద్ధమైన నిమ్మగడ్డ కూడా “జగన్ కేసుల్లో సీబీఐ సాక్షిగా పిలిస్తే వెళ్తాను. విచారణకు సహకరిస్తాను. సాక్ష్యం చెప్తాను” అంటూ జగన్ కేసులను గుర్తు చేసి తనలోని యాంటీ జగన్ అనే కోణాన్ని బయటకు తీశారు. అసందర్భంగా, అనవసరంగా జగన్ పైనా.., వైసిపిపైనా పరోక్షంగా మాటలు విసురుతున్న నిమ్మగడ్డకి అసెంబ్లీలో ప్రివిలేజ్ నోటీసుతో తన పవర్ చూపించాలని వైసీపీ స్కెచ్ వేసింది. సో.., ఈ విషయం ఇక్కడితో ఆగదు. కోర్టుల వరకు వెళ్తుంది. చూద్దాం.., ఎవరిదీ పైచేయో.., ఎవరిది తలవంపులో..!?

 

author avatar
Srinivas Manem

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju