NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఎంపీలు X ఎమ్మెల్యేలు గ్రావెల్ గొడవ..! సీఎం జగన్ పరువు తీసేస్తున్నారు..!!

అనగనగా ఒక రాజకీయ పార్టీ.., పదేళ్ల ప్రతిపక్షంలో ఉన్న తర్వాత అధికారంలోకి వచ్చింది. సీఎం చుట్టూ కోటరీ బాగా చేరింది. నిత్యం భజనలు చేస్తూ పనులు చక్కబెట్టుకునేది. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు బరితెగించారు. సీఎం కొడుకు అక్కడక్కడా వసూళ్లకు దిగేవారు. ఊర్లలో ఒక కమిటీలు అంటూ అయిదుగురిని రాజ్యాంగేతరంగా నియమించి పెత్తనం అప్పగించారు. “ఇసుక, మట్టి, గ్రావెల్ సహా… ఏ చిన్న పనులున్నా” వీళ్ళే చేసేవారు. అలా ఆ పార్టీ ఐదేళ్లలో అసంఖ్యాక అసంతృప్తి మూటగట్టుకుంది. అందుకే అయిదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో చారిత్రిక ఓటమి నమోదు చేసుకుంది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఉంటాదో, పోతుందో తెలియక కొట్టుమిట్టాడుతోంది..!! (ఏ పార్టీ గురించి చెప్పామో అర్ధమయ్యే ఉంటుంది..!)

ఇప్పుడు మరో పార్టీ గురించి చూద్దాం..!!

అనగనగా ఒక పార్టీ..! తొమ్మిదేళ్ల పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చింది. ఒక్కడి పేరుతో, ఒక్కడి గాలితో ఏకపక్షంగా గెలిచేసింది. ఆ తొమ్మిదేళ్ల దాహమో, అధికార ఆకలో… కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీల్లో అసలు ఆగట్లేదు. ఇసుక, మట్టి, గ్రావెల్ సహా… ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. కొందరు కనీసం కార్యకర్తలకు కూడా అవకాశం ఇవ్వకుండా కొట్టుకెళ్లిపోతుంటే.. కొందరు పైనున్నొళ్లకు అవకాశం ఇవ్వకుండా కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్ళలో వీళ్ళే గొడవలకు దిగుతుండడం ఆ అధినేతకు చిక్కులు తెస్తుంది..!! (ఇది ఏ పార్టీ గురించో అర్ధమయ్యే ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చెప్తే మరింత లోతుగా తెలుస్తుంది..!)

* అది తూర్పుగోదావరి జిల్లా ఒకరేమో ఎక్కడో జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే. మరొకరు ఎక్కడో జిల్లాకి చివరన ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే. ఒకరు కాబినెట్ ర్యాంకులో ఉన్నారు. మరొకరు సీఎంకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. జిల్లా చివరన ఉన్న నియోజకవర్గంలో కొండల మధ్య ఉన్న గ్రావెల్ పై ఈ ఎమ్మెల్యే కన్ను పడింది. ఇక మొదలయింది. జేసీబీలు, వందలాదిగా ట్రక్కులుతో విపరీతంగా రోజూ తవ్వకాలు జరిగిపోతున్నాయి. జిల్లా మొత్తానికి అదే వెళ్తుంది. అవసరమైతే పరాయి చోటకు కూడా అమ్మకానికి పోతుంది. కళ్లారా తన నియోజకవర్గంలోని గ్రావెల్ కొండా కరిగిపోతుండడం.., తనకు కనీసం వాటా లేకపోవడంతో సదరు ఎమ్మెల్యేకి కోపం వచ్చింది. కానీ… ఆయనేమో సీఎంకి సన్నిహితుడు… అందుకే జిల్లా ఇంచార్జి అయినా ఓ కీలక నేత వద్ద తన ఆవేదన చెప్పుకున్నారు. అయినా ఏం లాభం..!? కొండలు కరిగిపోతున్నాయి. అందుకే కడుపు మండి.., ఆయనే అధికారులకు పిర్యాదు చేసారు. ఇది ఈ ఇద్దరి మధ్య పెద్ద చిచ్చు రేపింది..!!

* ఇక పశ్చిమగోదావరిలో చూద్దాం..!

ఇక్కడ జిల్లా కేంద్రం పక్కనే ఓ యువ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన పక్కనే ఓ యువ ఎంపీ ఉన్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో విపరీతంగా గ్రావెల్ కొండలున్నాయి. ఇసుక వనరులున్నాయి. గత ఎమ్మెల్యే దోచేశారని ఆరోపణ ఉంది. అందుకే ఆ ఎమ్మెల్యే కళ్ళు పడ్డాయి. గెలిచింది మొదలూ దోపిడీ మొదలయింది. తన అనుయాయుల ద్వారా ఎక్కడిక్కడ తవ్వకాలు జరిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ గ్రావెల్ గుట్టపై హక్కుల కోసం ఎంపీ సన్నిహితుడు ఒకరు టెండర్ వేశారు. దీంతో ఎమ్మెల్యేకి బాగా కాలింది. నా నియోజకవర్గంలో మీరు టెండర్ వేయడం ఏంటి..? అంటూ ప్రశ్నించారు. “మీరు టెండర్ వేసారా..? అంటూ ఎంపీ సన్నిహితుడు ప్రశ్నించారు. “టెండర్ లేదు, ఏం లేదు. మన ప్రభుత్వంలో మనం టెండర్ వేయడం ఏంటి..? మీకు కావాల్సిన చోట తీసుకోండి. నా నియోజకవర్గం తప్ప” అంటూ ఎమ్మెల్యే బదులిచ్చారు. ఎంపీ సన్నిహితుడు షాక్ అయ్యారు. ఈ విషయాన్నీ ఎంపీకి చెప్పారు. త్వరలో పార్టీ పెద్దల వద్ద మాట్లాడదాంలే.. ఇప్పుడు వదిలేయ్ అంటూ ఎంపీ చెప్పడంతో ఈ విషయం ఆగింది. సో.., అదీ జరుగుతుంది. చిన్న చిన్న కక్కుర్తి అంశాలకు కూడా రచ్చకెక్కుతున్నారు. ఒకరినొకరు పిర్యాదులు చేసుకుంటూ పరువు తీసుకుంటున్నారు. తీస్తున్నారు..!!

author avatar
Srinivas Manem

Related posts

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?