NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రాజు గారి మీద సినిమాల ప్రభావం బాగా కనిపిస్తుంది..!!

వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు గారు తన వ్యక్తిత్వంతో, తన నాయకత్వంతో, తన హోదాతో ప్రజల్లో స్థిరమైన పేరు సంపాదించుకోకుండా ఒక వివాదమైన అంశంతో వార్తల్లో నిలిచారు. పార్టీని ఢీ కొట్టడం ద్వారా ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను వ్యతిరేకించడం ద్వారా ఆయన ఒక్కసారిగా తెరపైకి వచ్చారు.

వివాదం ఇదిగో ముగిసిపోతుంది, అదిగో సమసి పోతుంది అనుకున్న సమయంలోనే ఆయన రకరకాల డైలాగులు చెప్పుకుంటూ, విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ పార్టీతో కయ్యం పెట్టుకుంటూనే ఉన్నారు. ఇటు పార్టీ తగ్గడం లేదు. అటు ఆయన కూడా వెనుకడుగు వేయడం లేదు. అయితే రాజు గారికి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో కానీ సినిమాల్లో రచయితగా పని చేస్తున్నట్లు ఉన్నారు. అందుకే ఆయన ప్రతి విమర్శ వెనుక సినిమా డైలాగులు బీభత్సముగా ఉంటున్నాయి.

*వైసిపి ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాసు, సత్యనారాయణ, వదునూరు ప్రసాదరాజు వీళ్ళందరూ మూకుమ్మడిగా రఘు రామ కృష్ణం రాజు పై విమర్శలు చేశారు. అది వివాదానికి ఆరంభం. ఆ సమయంలో రఘురామ కృష్ణంరాజు రెండోసారి వీడియో రిలీజ్ చేస్తూ “నాన్న పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది” ఒక సినిమా డైలాగ్ వదిలారు. దాంతో వార్తల్లో ఆకట్టుకునే స్థాయికి వెళ్లారు. అలా ఆయన ప్రతి వీడియోను జనం చూడడం మొదలుపెట్టారు. ఇదే అదనుగా దొరికిందే తడవుగా కొన్ని మీడియా సంస్థలు, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే అనేక మీడియా ఛానళ్లు రామకృష్ణంరాజును హైలెట్ చేస్తూ వచ్చాయి. అయన చేత డైలాగులు చెప్పించడం, వాటిని ప్రధాన శీర్షికలుగా ప్రచురించడం ఆనవాయితీగా మారింది. నిన్నటికి నిన్న పార్లమెంట్ లో రఘురామ కృష్ణంరాజు స్థానం మారిస్తే దాన్ని కూడా ఆయన పాజిటివ్ గా తీసుకుని మరో సినిమా డైలాగును వదిలారు. “సింహానికి సింహాసనం ఎక్కడ ఉన్నా ఒకటే.. సింహం సింహమే”. అంటూ మరో నందమూరి బాలకృష్ణ డైలాగ్ కొట్టారు.

 

* పార్టీని ఎంపి ఢీ కొనడం అనేది సీరియస్ అంశం. ఈ ప్రభావం ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అక్కడ ఓటర్లు, ప్రజల పైన పడుతుంది. నియోజకవర్గ అభివృద్ధి పైన పడుతుంది. అధికార పార్టీ ఎంపీగా ఉన్నంత కాలం ఆయన అనుకున్న పనులు జరుగుతాయి. గుర్తింపు ఉంటుంది. అధికారులు సహకరిస్తారు. నిధులు వస్తాయి. పనులు జరుగుతాయి. మంచి జరుగుతుంది. అందుకే ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు కూడా అధికార పక్షం లోకి రావాలని కోరుకుంటారు. కానీ రఘురామ కృష్ణంరాజుకు నిధులు, పనులు, వ్యక్తిత్వం, మంచితో సంబంధం లేనట్టు ఉంది. అందుకే అధికారపక్షంతో కాలు దువ్వుకుంటూ వార్తల్లోకి ఎక్కడమే పనిగా పెట్టుకున్నారు. గడిచిన రెండు నెలలుగా నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఆయన అంటూ ప్రత్యేకంగా చేసిన అభివృద్ధి పని, ఇచ్చిన నిధులు ఏమీ లేవు. కేవలం బిజెపిలో తన ఎదుగుదలను, ఢిల్లీ స్థాయిలో తన చక్రం తిరగడానికో, వైసీపీలో పశ్చిమ గోదావరి జిల్లాలో తన హవా నడవడానికో ఎటువంటి అంతర ఉద్దేశం పెట్టుకున్నారో తెలియదు గానీ రఘు రామ కృష్ణంరాజు మాత్రం ఓ నిర్ధుష్టమైన దారిలో వెళుతూ తన ఫందాను కొనసాగిస్తున్నారు. ఇవి పార్టీకి నష్టం చేకురుస్తుందో తెలియదు గానీ ఆయనకు, నియోజక వర్గానికి మాత్రం ఎంతో కొంత నష్టం చేకూర్చడం వాస్తవం.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju