YSRCP: కేంద్రం చేతిలో జగన్ మోసపోతున్నారా..!? తెలివా – తెలియని తనమా..!?

PK Strategy: KCR, Kodali in Part of PK Plan..?
Share

YSRCP: అసలు విషయం చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం.. “ఒక ఊర్లో ఇద్దరు అన్న తమ్ములు విడిపోవాలనుకున్నారు. వారి ఉమ్మడి ఆస్తులను వాటా వేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో వారి ఇంట్లో మూడు మొబైల్ ఫోన్లు ఉన్నాయి. మూడు ఫోన్ లలో ఇద్దరు చెరొక ఫోన్ తీసుకోగా.., మూడో ఫోన్ గురించి పెద్ద పేచీ ఏర్పడింది. గొడవ పడ్డారు. పోలీసుల వరకు వెళ్లారు. పోలీసులు ఈ పంచాయతీని తీరుస్తామని చెప్పి.. గొడవకు కారణమైన మూడో ఫోన్ కాకుండా.. మొత్తం మూడు మొబైల్ ఫోన్లు తెప్పించుకున్నారు. ఈ మూడు తమ దగ్గర ఉంటాయని.. మీ ఇద్దరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవచ్చని.. కానీ ఉండేది మాత్రం తమ కంట్రోల్ లో అంటూ తీర్పు చెప్పారు.. ఆ ఇద్దరు అన్నతమ్ముల్లో ఒకడు తన దగ్గరున్న ఫోన్ ఇవ్వడానికి అంగీకరించాడు. అయితే ఇంకొకడు మాత్రం ఒప్పుకోలేదు.. “అలా చేస్తే తన వద్ద ఉన్న ఫోన్ కూడా కోల్పోవాల్సి వస్తుందని గ్రహించాడు..” అందుకే అంగీకరించలేదు. కానీ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లిన తరువాత వాళ్లు వదిలిపెట్టరు కదా మూడు ఫోన్లు వారి వద్దనే ఉంచేసుకున్నారు. ఇది ఒక కథ. పోలీస్ స్టేషన్ కు పంచాయతీకి వెళితే ఇద్దరూ నష్టపోయారు… ఇదే కథని ఏపీ, తెలంగాణాలో నీటి ప్రాజెక్టుల గొడవకు ముడిపెట్టి ఆలోచించండి..!

YSRCP: YS Jagan Risk with Central Sharing..
YSRCP: YS Jagan Risk with Central Sharing..

YS Jagan: కేంద్రంతో పేచీ అలాగే ఉంటుందేమో..!?

ఆ కథలో మాదిరిగానే సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు తమ పంచాయతీని కేంద్రం వద్దకు తీసుకువెళితే ప్రాజెక్టులు అన్నీ తమ అధీనంలో పెట్టుకుంటాం, సిబ్బంది జీతాల చెల్లింపులకు నిధులు ఇరు రాష్ట్రాలు ఇవ్వండి. పర్యవేక్షణ బాధ్యతను తాము నిర్వహిస్తామని పోలీస్ పంచాయతీ మాదిరిగా కేంద్రం చెప్పేసింది. దీంతో ఇప్పుడు ఏమైంది. ఇప్పటి వరకూ అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న ప్రాజెక్టులు ఉమ్మడి పెత్తనంలోకి వెళ్లాయి.. అన్ని ప్రాజెక్టులపై అధికారం కేంద్రానికి దఖలు పర్చడం అయ్యింది. దీనికి ఏపి ప్రభుత్వం అంగీకరించింది.., కానీ తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలుపలేదు. అయినప్పటికీ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసేసింది.

* నిజానికి ఇక్కడ గొడవ శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు విషయంలోనే.. ఆ ప్రాజెక్టుల దగ్గరున్న ఇతర ప్రాజెక్టుల విషయంలోనే.. కానీ ఇరు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి కావడం వల్ల వివాదం ఏర్పడిన దృష్యా దీనిపై కేంద్రం యజమాయిషీ చేయడంలో తప్పులేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉన్న ప్రకాశం జిల్లా కుడి కాలువ మీద కేంద్రం పెత్తనం ఏమిటి…? పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, హింద్రీనివా సుజల స్రవంతి తదితర ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం ఏమిటి..? వాటికీ తెలంగాణకు, వాటికీ కేంద్రానికి ఏమాత్రం సంబంధం లేదుగా..!! అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం చేయడం వరకూ బాగానే ఉంటుంది కానీ రాష్ట్రాల అంతర భూభాగంలో ఉన్న ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం ఏమిటి?.

YSRCP: YS Jagan Risk with Central Sharing..
YSRCP: YS Jagan Risk with Central Sharing..

సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఏపి, తెలంగాణ మధ్య వివాదం ఏర్పడితే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పటైన కృష్ణానదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సమస్య పరిష్కారానికి పెత్తనం చేయడం బాగానే ఉంటుంది. తప్పులేదు. ఇవన్నీ ఆలోచించే తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. బోర్డు జాబితాలో జలవిద్యుత్ కేంద్రాలు కూడా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడం లేదని స్పష్టం చేసింది. కృష్ణా జలాల కేటాయింపుల అంశం కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్నందున ఇప్పుడు గెజిట్ అమలు చేయడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ కోసం నిర్మించిందని, రాష్ట్ర అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి తప్పదని చెప్పింది. హంద్రీనివా, పోతిరెడ్డిపాడులను కూడా బోర్డులో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం సూచించగా ఏపి ప్రభుత్వం అంగీకరించలేదని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఏపి ప్రభుత్వం కూడా తమ వాదనలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడం, ఫిర్యాదులు చేయడం గానీ చేయాలి గానీ కేంద్రం తీసుకున్న అన్ని నిర్ణయాలకు గుడ్డిగా ఒప్పుకుంటే రాష్ట్ర ప్రయోజనాలను ఏపి కోల్పోవాల్సి వస్తుంది. ఈ అంశంలో జగన్ కాస్త సీరియస్ గా దృష్టి పెడితే రాష్ట్ర నీటి ప్రయోజనాల విషయంలో మంచి నిర్ణయం దిశగా అడుగులు వేయవచ్చు. పక్క రాష్ట్రంతో పేచీ అంటే అప్పుడప్పుడూ అయినా తీర్చుకోవచ్చు.. కూర్చుని మాట్లాడుకోవచ్చు.. కేంద్రంతో పెత్తనం పంచుకోవడం అంటే ఏపీలోని నీటి ప్రాజెక్టులను ఢిల్లీకి రాసిచ్చినట్టే..!


Share

Related posts

జగన్ “నీరూ”పించుకోవాల్సిన సమయం సందర్భం ఇదే..!

Srinivas Manem

మోడీని టెన్షన్ పెట్టిస్తున్న ఏలూరు..??

sekhar

Sharmila: సాక్షి పై పంచ్ డైలాగ్ వేసిన షర్మిల..!!

sekhar