ఇటలీ నేర్పిన పాఠం…!

23 Mar, 2020 - 11:38 AM

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

చైనా నుండి విస్తరించిన కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తోంది. మొత్తం 195 దేశాల్లో 170 దేశాలకు వైరస్‌ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారంకల్లా మృతుల సంఖ్య 13,444కు, వైరస్‌ సోకిన కేసుల సంఖ్య 3,08,130కు చేరింది. శనివారం నుంచి 1,702 కొత్త మరణాలు, 28,674 కేసులు నమోదయ్యాయి. 35 దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దాదాపు అన్ని దేశాలు సరిహద్దులను మూసేవేసి అంతర్జాతీయ విమానాల సర్వీసులను రద్దు చేశాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్న కఠిన ఆంక్షలతో ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు వంద కోట్ల మంది ఇండ్లకే పరిమితమయ్యారు.

ఇటలీలో పరిస్థితి దారుణం

ఇటలీలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. కరోనా మరణాల్లో ఇటీవలే చైనాను దాటేసిన ఇటలీ.. ప్రస్తుతం తొలి స్థానంలో ఉన్నది.
ఇటలీలో ఆదివారం ఒక్కరోజే 651 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 59,138 కేసులు నమోదు కాగా, ఆదివారం ఒక్కరోజే 5,560 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇటలీలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 5,476.

కరోనా వైరస్‌తో చైనాలో 3,270, స్పెయిన్‌లో 1,772, ఇరాన్‌లో 1,685, ఫ్రాన్స్‌లో 674, అమెరికాలో 419, యూకేలో 281, నెదర్లాండ్స్‌లో 179, దక్షిణ కొరియాలో 104, స్విట్జర్లాండ్‌లో 98, జర్మనీలో 94, బెల్జియంలో 75 మంది మృతి చెందారు.
భారతదేశం వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 396కు చేరుకుంది. ఆదివారం ఒక్కరోజే 64 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధికంగా 74, కేరళలో 64, ఢిల్లీలో 30, రాజస్థాన్‌లో 28, తెలంగాణలో 27, ఉత్తరప్రదేశ్‌లో 27, కర్ణాటకలో 26, గుజరాత్‌లో 18, మధ్యప్రదేశ్‌లో 6, ఆంధ్రప్రదేశ్‌లో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

ఇటలీ వాసుల స్వయంకృతాపరాధం

ఇటలీలో పెరుగుతున్న మరణాలు, తాజా పరిణామాలపై మిలాన్ వాసి ఆవేదనతో రాసిన లేఖ వారి స్యయంకృతాపరాధాన్ని వెల్లడిస్తోంది. కరోనా భయం గుప్పిట్లో బతుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్ని వివరిస్తూ అతను రాసిన లేఖ వైరల్ అవుతోంది.

‘ఇప్పుడు మేమంతా ఉన్నది క్వారంటైన్‌లో.. మాకు మేముగా ఒక చీకటి చెరసాలలో నిర్బంధిచుకున్నాం. వీధుల్లోకి వెళ్ళలేం, పొరపాటున వెళితే వెంటనే పోలీసులు వచ్చి తీసుకెళ్లి మళ్ళి జైల్లో వేస్తారు. షాపులు, ఆఫీసులు, వీధులు అన్ని మూతబడ్డాయి.

మాకు అనిపిస్తుంది ఇదే యుగాంతం ఏమో అని.. ఇంకా మా జీవితాలు ముగిసిపోయిన అధ్యాయాలేమో అని. మాది ఒక అందమైన అభివృద్ధి చెందిన దేశం.. మేము అనుకోలేదు. ఇలా ఈనాడు అంధకారంలోకి నెట్టి వేయబడుతామేమో అని. దీనికంతటికి కారణం ఒకటే మేమే.. మా దేశ ప్రజలే అంటే మేమే ఇటాలియన్స్ ఏ మాత్రం సందేహం లేదు. మేము చేసినటువంటి తప్పే మా దేశం అనుభవిస్తున్న ఈ కష్టానికి కారణం.. నిజం. ఒక్క క్షణం మేము ఆలోచన చేయలేదు. ఓ పది రోజుల క్రితం మా ప్రభుత్వ అధికారులు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే ఈనాడు మా దేశానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు’అని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

‘వైరస్ వ్యాపిస్తుందని బయటకు వెళ్ళొద్దని ప్రభుత్వం సెలవులు ఇస్తే తాము విహారయాత్రలకు వెళ్ళాం, సినిమాకి వెళ్ళాం, షికార్లు తిరిగాం, చిన్న చిన్న పార్టీలు చేసుకున్నాం అన్నారు. బజారులో కూర్చుని గుంపులు గుంపులుగా ముచ్చట్లు పెట్టుకున్నాం..
ప్రభుత్వం చేసిన సూచనల్ని చాలా తేలిగ్గా తీసుకున్నామని.. ఆనాడు తెలియదు ఆ క్షణం చేసినటువంటి ఆ చిన్న తప్పు.. ఇప్పుడు ఇటలీని, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందన్నారు. రోజుకు రెండు వందల మంది చనిపోతున్నారని.. ప్రజలు జీవితాలు చాలా దుర్భరంగా తయారయ్యాయని చెప్పుకొచ్చారు. ఇటలీలో మందులు లేక కాదు.. వైద్యులు లేక కాదు.. కేవలం అంత మంది కరోనా బాధితుల్ని ఉంచడానికి సరిపోయేంత స్థలం లేక.. కేవలం స్ధలం లేక.. 80 ఏళ్ళ పైబడిన వృద్ధికి కరోనా సోకితే సజీవంగానే తగలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు. ఇదంతా తాము చేసుకున్న తప్పులే అన్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న ఇటలీ దేశాధ్యక్షుడు

కరోనా మహమ్మారికి ఇటలీలో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే దేశ పరిస్థితిపై దేశాధ్యక్షుడు సర్గియో మట్టరెల్లా బోరున విలపించారు. కేవలం 6 కోట్ల జనాభా కలిగిన దేశం, ప్రపంచంలోనే అత్యాధునిక వైద్యసాదుపాయలు ఉన్న దేశం. అలాంటి దేశ అధ్యక్షుడే ఎవరిని కాపాడలేమంటూ చేతులెత్తేసి కన్నీళ్లు పెట్టుకున్నారు. రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న శవాలు, శవాలు పూడ్చడానికి స్థలాలు లేక అసలు వాళ్ళను పూడ్చడానికి ఎవరు రాక ఇబ్బంది పడుతున్నారు