NewsOrbit

Category : బిగ్ స్టోరీ

బిగ్ స్టోరీ

థియేటర్ల శకం ముగియనుందా?

siddhu
కరోనా వల్ల దేశంలో ఎన్నో  రంగాలకు విపరీతమైన నష్టం వాటిల్లగా వాటిలో ప్రప్రధమంగా చిత్ర పరిశ్రమ గురించి మనం చెప్పుకోవాలి. ఒక్క టాలీవుడ్ కే ఈ లాక్ డౌన్ కారణంగా ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో లక్షలమంది చిత్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. పదుల సంఖ్యలో సినిమాల షూటింగ్ ఆగిపోయింది. చాలా సినిమాలు ఇక ఈ సమస్యలను భరించలేక విడుదల ను రద్దు చేసుకుని ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే థియేటర్ ను ఆందోళన పరిచే రీతిలో ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ అనగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ వంటి యాప్స్ లో చిత్రం విడుదలైన నెలరోజుల్లోనే ప్రేక్షకులు వాటిని తిలకిస్తున్నారు. పెద్ద హీరోల చిత్రాలు అంటే కచ్చితంగా అందరికన్నా ముందే చూడాలి అని ఉత్సాహంతో థియేటర్ల ముందు వాలిపోతున్నారు కానీ మీడియం బడ్జెట్ సినిమాలు మరియు చిన్న సినిమాలను ఒక నెల అయితే మన ల్యాప్ టాప్ లేదా టీవీ లో ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ మరియు యాప్స్ ద్వారా చూసుకోవచ్చని జనాలు థియేటర్లకు వెళ్లడం మానేశారు. ఇక ఈ డ్రామా వెబ్ సిరీస్ లు వచ్చిన తర్వాత సినిమాల పై ఇంట్రెస్ట్ కూడా కొద్దిగా తగ్గుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.  ఎంతో మంది ప్రొడ్యూసర్లు దేశవ్యాప్తంగా థియేటర్లో సినిమాలు విడుదల చేయకుండా ఈ లాక్ డౌన్ నేపథ్యంలో నేరుగా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లోకి తమ చిత్రాలను మంచి రేట్లకు అమ్మివేసిన విషయం తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో సినిమా ఆడుతుందో లేదో గ్యారెంటీ లేని పక్షంలో తమ నిర్మాణానికి అయ్యే బడ్జెట్ ను తగ్గించుకొని మంచి రేటుకి ఈ ఓటిటి యాప్ లకు  తమ సినిమాను ఆమ్మే దిశగా కూడా వారి అడుగులు పడుతున్నాయి అని సమాచారం. ఇక థియేటర్ల విషయానికి వస్తే కరోనా తర్వాత ఎవరూ ధైర్యం చేసి మునుపటిలా సినిమా హాళ్ళకు…. మల్టీప్లెక్స్ లకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. అదీ కాకుండా ఇంట్లోనే హాయిగా కూర్చుని తమకు నచ్చిన సిరీస్ ను లేదా సినిమాను స్మార్ట్ టీవీ లో చూడటానికే ప్రజలు క్రమేపీ మొగ్గుచూపుతున్నారు. ఈ క్ర‌మంలో ఔత్సాహిక ఫిలిం మేక‌ర్ల‌కు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకునేందుకు ఓ చ‌క్క‌ని మార్గం ల‌భిస్తుంది. మూవీల‌ను తీసి ఓటీటీ యాప్‌ల‌లో రిలీజ్ చేయ‌వ‌చ్చు. ఒక‌ వేళ వారు విడుద‌ల చేసే సినిమాలు హిట్ అయితే.. ఇక వారు వెను దిరిగి చూడాల్సిన పని ఉండ‌దు. పుష్క‌లంగా అవ‌కాశాలు ల‌భిస్తాయి. సినిమా చాన్స్‌లు వెతుక్కుంటూ వ‌స్తాయి. దీంతో వారు త‌మ క‌ల‌ల‌ను నిజం చేసుకోవ‌చ్చు. ఈ విధంగా ఓటీటీ యాప్‌లు ఔత్సాహిక ఫిలిం మేక‌ర్ల‌కు చ‌క్క‌ని అవ‌కాశాన్ని అందిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో థియేటర్ల గతి ఎలా ఉండబోతోందో....
బిగ్ స్టోరీ

వలస ఎమ్మెల్యేలకు చెక్ పెట్టే లా బాబు వ్యూహం..! ఇది ‘మహా’ స్కెచ్

siddhu
  రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటేనే నిలబడగలం అన్నది బాబు సూత్రం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టిడిపి పార్టీ ఉన్నంత బలహీనంగా దేశంలో మరే విపక్షం లేదు అన్నది వాస్తవం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో కనీస గుర్తింపుకి నోచుకోకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఉన్నది 23 ఎమ్మెల్యేలు…. మళ్లీ వారిలో సగం మంది వైసీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఐదు పేర్లు ఖరారు అయినట్లు కూడా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇవి బాబు చెవిన కూడా పడ్డాయి. అంతే ఉన్నఫలంగా పరిస్థితులతో సంబంధం లేకుండా వెంటనే ‘మహానాడు’ ని ఈసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బాబు చూస్తున్నారు. ముఖ్యంగా పార్టీ నాయకుల్లో నూతనోత్సాహం తెచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు మహానాడు తలపెట్టాలని చూస్తుండగా ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో భారీ సంఖ్యలో కాకపోయినా అతి కొద్ది మంది ముఖ్య నాయకులతో మరియు ఎవరైతే వైసిపి వైపు చూస్తున్నారో వారందరినీ పిలిచి దీన్ని నిర్వహించాలని బాబు ఆలోచిస్తున్నారు. ఇక ప్రభుత్వం ఎలాగో మహానాడు లాంటి సభకు అనుమతిని ఇవ్వదు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా ‘జూమ్’ యాప్ లో నిర్వహించాలన్న పట్టుదలతో బాబు ఉన్నాడు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మహానాడు జరగలేదు.ఈ ఏడాది కరోనా కారణంగా అది కూడా వాయిదా పడుతుందని అందరూ అంచనా వేయగా, బాబు మాత్రం మహానాడు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇక మరోవైపు వైసీపీ వీలైనంత త్వరగా తన వైపు వచ్చే నాయకులను తమ పదవులకు మరియు పార్టీకి రాజీనామాలు చేయించి టిడిపికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గట్టి దెబ్బ కొట్టాలని పట్టుదలతో ఉందని తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీలో వచ్చేందుకు ఆసక్తి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల లిస్ట్ మొత్తం వైసీపీ రెడీ చేసుకుంది.పార్టీలో చేరేందుకు ఏ క్షణమైనా పిలుపు రావచ్చని, మీరంతా సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే వారికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఇక విషయాన్ని ముందే పసిగట్టిన చంద్రబాబు పార్టీ మారే ఆలోచన ఉన్న నాయకులందరికీ ఫోన్ చేసి బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బాబు కి ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఒక్క మహా నాడే పెద్ద దిక్కులా కనిపిస్తుంది. దాని ద్వారానే వైసిపి దూకుడుకు చెక్ పెట్టాలని బాబు భావిస్తున్నాడు....
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

విజయ వార్షికం…! స్వీయ తప్పిదమే విపక్షం…!

Srinivas Manem
175 లో 151 సీట్లు… ఓ తిరుగులేదు.., జగనుడికి ఎదురే లేదు అనుకోని ఏడాదయ్యింది…! 175 లో 23 స్థానాలు… ఇక ఎదగడం కష్టమే… చంద్రబాబుకి రోజులు లేవు అనుకుని ఏడాదయ్యింది…! ఆ 151...
బిగ్ స్టోరీ

ఒక రోజు విలన్.. పక్క రోజు హీరో…! జగన్ గ్రాఫ్ పైపైకి 

siddhu
  దేశమంతా లాక్ డౌన్ వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురి అవుతుంటే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాత్రం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను ఎలా సమయానికి అమలు చేస్తున్నారో అర్థం కాక అటు విపక్షాల తో పాటు ఇటు రాజకీయ పండితులు సైతం తలలు పట్టుకుంటున్నారు. అంతెందుకు వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రతి సామాన్యుడిని ఒక ప్రశ్న వేధిస్తోంది. ఇలా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు జగన్ కనబరుస్తున్న చిత్తశుద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు సంక్షేమ పథకాలను ఎగ్గొట్టే పాలకులను చూసిన వాళ్ళకు… అనాదికాలంగా వస్తున్నా రాజకీయాలకు విరుద్ధంగా కష్టకాలంలో మేనిఫెస్టో అమలుకు ఏకంగా క్యాలెండర్ ను విడుదల చేసిన ఘనత ఒక్క జగన్ కే చెల్లింది. జగన్ ను ఏ కోరికతో అయితే సీఎం గా అందరూ గెలిపించుకున్నారో…. ఆ జనం.. ఇప్పుడు కష్టకాలంలో జగన్ తను చెప్పిన మాట పై నిలబడి ప్రజల్లో మరింత నమ్మకం మరియు అభిమానం పెంచుకున్నాడు అని అనుకుంటున్నారు. అయితే జగన్ సర్కార్ పై ఒక చిన్న అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయింది. దానిని కూడా జగన్ పరిగణలోకి తీసుకొని వెంటనే పరిష్కారం చేయడం గమనార్హం. అది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు పూర్తి స్థాయిలో అందక పోవడమే. నిజానికి లాక్ డౌన్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం జరిగింది. ఇక మన రాష్ట్రం దానికి ఏమీ మినహాయింపు కాదు. అయితే గత రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగుల్లో 2, 3 డిపార్ట్మెంట్ లకు తప్ప మిగిలిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధించారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి సృష్టించబడ్డ సచివాలయం ఉద్యోగాలు జీవితాల్లో కూడా 10% వేతనాలను కట్ చేయడం గమనార్హం. ప్ర‌తి నెలా వివిధ క‌మిట్‌మెంట్ల‌కు పోనూ వేత‌నాన్ని పొదుపుగా వాడుకుంటున్న ఉద్యోగుల‌కు స‌గం జీతంతో ఇబ్బందులు పడ్డారు. అయితే క‌రోనాతో ఆర్థిక ఇబ్బందుల‌ని స‌రిపెట్టుకుంటున్నా….మ‌రోవైపు సంక్షేమ ప‌థ‌కాల‌ను య‌ధావిధిగా జ‌గ‌న్ స‌ర్కార్ అమ‌లు చేస్తుండ‌టం ఉద్యోగ వ‌ర్గాల్లో ఓ ర‌క‌మైన అసంతృప్తి వచ్చి జగన్ కొద్ది రోజులు వాళ్ళ జీవితాల్లో విలన్ గా మారాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే జగన్ ఆ వేతనాల్లో కోత ను కేవలం రెండు నెలల కే పరిమితం చేయడం నిజంగా అభినందనీయం. వచ్చే నెల నుండి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పూర్తిస్థాయి వేతనాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒకపక్క మద్యం షాపులు తెరుచుకోవడం మరియు మరొక పక్క మిగతా షాపులకు నిర్దేశిత సమయం లో వ్యాపారం జరుపుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగిన మరునాడే ఉద్యోగులందరికీ వచ్చేనెల నుండి పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జగన్ గ్రాఫ్ మరింత పైకి పెరిగిపోయింది. ఇక మిగిలి ఉన్నదల్లా ఇప్పటివరకు కోత విధించిన వేతనాలను మళ్లీ ఎప్పటికీ తిరిగి ఉద్యోగులకు అందజేస్తారు అన్న విషయంపై స్పష్టతే. ఇన్ని చేసినా ముఖ్యమంత్రి అది ఒకటి చేయకుండా పోతాడా ఏమి?...
బిగ్ స్టోరీ

సరికొత్త టీం తో చినబాబు… సరికొత్త ప్లానింగ్… కథ ఎటు?

siddhu
  ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అన్న విషయం ముమ్మాటికీ వాస్తవం. చంద్రబాబు తర్వాత పార్టీని ముందుండి నడిపించేది ఎవరు అన్న ప్రశ్నకు పెద్దలు అంతా...
బిగ్ స్టోరీ

బొత్స ని ‘ఖాతరు ‘ చెయ్యడం లేదహో… !

siddhu
రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉత్తరాంధ్ర కు చెందిన సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ యొక్క ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తరపున వ్యాఖ్యలు చేసే...
బిగ్ స్టోరీ

టైగర్ కి టైమొచ్చింది… ఫుల్ జోష్ లో హైదరబాద్ పోలీసులు

siddhu
గత కొద్దికాలంగా తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భయంకరంగా విస్తరించినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలు చేశారు. ఇక హైదరాబాద్ మహానగరం అయితే పూర్తిగా పోలీసులు కంట్రోల్ లోకి వెళ్లి...
బిగ్ స్టోరీ

రేవంత్ రాజకీయానికి ఊపిర్లు ఊదిన జగన్ – కే‌సి‌ఆర్?

siddhu
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కాకుండా మరొక హాట్ టాపిక్ ఉంది. కరువు ప్రాంతం రాయలసీమకు నీరు అందించేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయమై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయగా తెలంగాణ...
బిగ్ స్టోరీ

హై కోర్టు తలనొప్పి నుంచి తప్పించుకున్న ఏపీ గవర్నమెంట్ ?

siddhu
గత కొద్దికాలంగా జగన్ సర్కారు తీసుకుంటున్న పాలనాపరమైన నిర్ణయాలు మరియు జీవోలపై హైకోర్టు నుండి ప్రతికూల తీర్పులు మరియు కామెంట్స్ రావడం గమనిస్తూనే ఉన్నాం. ప్రతిసారి జగన్ ప్రభుత్వం ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లు వ్యవహరిస్తున్న...
బిగ్ స్టోరీ

బీజేపీ మౌనమేల…?

Srinivas Manem
చప్పట్లు కొట్టడం విజయవంతమయిందని బీజేపీ గెలుపు అన్నారు…! దీపాలు పెట్టడం విజయవంతం అయిందని మోడీ విజయంగా ప్రచారం చేసారు…! మరి ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ వచ్చింది..! కానీ బీజేపీ నాయకుల నోళ్లు పైకి...
బిగ్ స్టోరీ

ప్రాణాల కంటే – ఎకానమీ ముఖ్యం అనేది ఇందుకే 

siddhu
  ది గ్రేట్ బ్రిటన్… దశాబ్దాల క్రితం ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలలో ఒకటి. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా కూడా ఆవిర్భవించింది. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించిన దేశం. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసిన దేశం. అయితే ఇప్పుడు అదంతా చరిత్ర. వర్తమానంలో బ్రిటన్ పరిస్థితి చాలా విచారకరంగా తయారయింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం దేశాలలోని ఒకటైన బ్రిటన్ ఇక పై ఏ మాత్రం అగ్రదేశం కాదు. ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయి కాదు కదా సొంత ఇంటిని సైతం చక్కదిద్దుకోలేని పరిస్థితిలో ఉంది. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటిన వేళనే బ్రిటన్ ఒక్క స్థానం అంతర్జాతీయ యవనికపై ఒక నామమాత్రంగా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు వచ్చిన కరోనా మహమ్మారి అయితే ఈ దేశాన్ని కుదిపేసింది. ఈ నెల 3వ తేదీ నాటికి ఆ దేశంలో దాదాపు రెండు లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం. 30 వేల మంది ఇప్పటికే కన్నుమూశారు. ఏకంగా దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారి నుండి తప్పించుకుని కొద్దిలో బయటపడ్డాడు అంటే అక్కడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సమీప భవిష్యత్తులో పరిస్థితి చక్కబడే అవకాశమే లేదని నిపుణుల అభిప్రాయం. నిజానికి బ్రిటన్ లో పరిస్థితి తేడాగా ఉంది అన్న సమయంలోనే కరోనా ఎంటర్ అయింది. అంతే…. దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేక బ్రిటన్ లాక్ డౌన్ ను తక్షణమే అమలు చేసింది. ఎంత పటిష్టంగా అమలు చేసింది అంటే ఒక్క దెబ్బకు ఆ దేశ స్టాట్ మార్కెట్ అంతా కూలిపోయింది. వారి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. దానివల్ల ఏమన్నా ప్రాణాలు కాపాడగలిగారా అంటే వైరస్ వ్యాధి నియంత్రణలో కూడా ఏ మాత్రం మార్పు లేదు. అటువైపు మిగతా ప్రపంచ దేశాలు మరియు చిన్న చిన్న దేశాలు లాక్ డౌన్ ను సరైన ప్లాన్ తో వైరస్ కంట్రోల్ చేస్తూ అటు ఆర్థిక వ్యవస్థని కూడా కాపాడుకుంటే బ్రిటన్ మాత్రం రెండిట్లో చతికిలపడింది. కరోనా వైరస్ సోకితే దాదాపు 80 శాతం పైన రికవరీ రేటు ఉంటుంది. 70 ఏళ్లకు పైబడిన వారి ప్రాణాలకు మాత్రమే రిస్క్ అయితే ఈ విషయంలో కొద్దిగా అతి జాగ్రత్త పడిన ఇంగ్లాండ్ చివరికి వైఫల్యానికి తగ్గ మూల్యం చెల్లించుకుంది. లాక్ డౌన్ ను పటిష్టంగా మరియు కఠినంగా అమలు చేసి దేశం మొత్తాన్ని ఆర్థిక సంక్షోభం లోకి నెట్టేసింది. ఫలితంగా వ్యాపార, వాణిజ్య అవకాశాలు గతంలో మాదిరిగా లేవు. ప్రజల ఆకలిబాధలు తీర్చేందుకు దేశవ్యాప్తంగా సుమారు 1200 ఆహారబ్యాంకులు పనిచేస్తున్నాయి. వీటిని మున్ముందు పెంచాల్సిన అవసరం కనపడుతోంది. జాతియంగా, అంతర్జాతీయంగా మారుతున్న పరిస్ధితులు, కరోనా బ్రిటన్ పై తీవ్రప్రభావాన్ని చుాపుతున్నాయి. ఒకప్పటి ప్రపంచశక్త నేడు గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్న మాట చేదునిజం. ఓడలు బండ్లు కావడం, బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో....
బిగ్ స్టోరీ

తండ్రి ఆశయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్… అందుకే ‘ఆయన’ నియామకం? 

siddhu
ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్దిగా సమయం తీసుకున్నా జగన్ కూడా తన తండ్రి లాగే సాగునీటి ప్రాజెక్టుల పైన దృష్టి పెడుతున్నారు. తను తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్న జగన్ ప్రస్తుతం కేసీఆర్ కే నీటి ప్రాజెక్టుల విషయంలో ఎదురెళ్ళిన తీరు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం నుండి విడిపోయాక ఏపి పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా అవతరించింది. హైదరాబాద్ వంటి మహానగరాన్ని పోగొట్టుకున్నాక టెక్నాలజీలో, పారిశ్రామికంగా ఏపీ దశ మరియు దిశ మారాలంటే చాలా సమయం పడుతుంది. ఏపీలో ఇప్పటివరకు టైర్3, టైర్ 2 నగరాలు మాత్రమే ఉన్నాయి. పైగా మౌలిక సదుపాయాల కొరత కూడా ఎక్కువే. కాబట్టి జగన్ ముందుచూపుతో ఆలోచించి గత ప్రభుత్వ పాలనలో గాడితప్పిన ఆర్థిక పరిస్థితిని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే వ్యవసాయానికి ఊతమివ్వడమే ఏకైక మార్గమని డిసైడ్ అయ్యారు. దానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం ఎంతైనా ఉంది. గతంలో చూసుకుంటే అతని తండ్రి వైఎస్సార్ కూడా వీటిపైన దృష్టిని కేంద్రీకరించాడు. పోలవరం ప్రాజెక్టు అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైయస్సార్ దాదాపు 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన రాయిని వేసి వదిలిపెట్టిన ప్రాజెక్టును కదిలించాడు. చంద్రబాబు దాన్ని కొంతమేరకు కొనసాగించినా చివరికి దానిని పూర్తి చేయవలసిన బాధ్యత జగన్ పైనే పడింది. తన ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మక అంశం కూడా పోలవరం అని జగన్ బాగా నమ్ముతున్నాడు. అంతటి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో తనకు సలహాలు మరియు సూచనలు ఇవ్వడం కోసం తన తండ్రి కాలంనాడు పనిచేసిన రమాకాంత్ రెడ్డిని ముఖ్య సలహాదారుగా జగన్ పోతున్నట్లు సమాచారం. ఆయన వైయస్ రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అలాగే ఉమ్మడి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిగా కూడా పని చేసిన అనుభవం ఉంది. చాలా కాలం నుండి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్న రమాకాంత్ రెడ్డిని తన సలహాదారుడు గా నియమించడం ద్వారా పోలవరం ప్రాజెక్టుని వీలైనంత త్వరగా పూర్తి చేయవచ్చని జగన్ భావిస్తున్నాడు. ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఘనత అంతా నాటి వైఎస్, నేటి జగన్ కే దక్కుతుంది తప్ప తెలుగుదేశానికి కానే కాదని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా చూస్తే జగన్ సర్కార్ కి ప్రాణవాయువు పోలవరం అని తెలుస్తోంది. అందుకే దాన్ని తమ కుటుంబానికి నమ్మకంగా ఉన్న రమాకాంతరెడ్డికి జగన్ అప్పగించారు. మరి పోలవరం పూర్తి అయి అటు వైసీపీకే కాదు, ఇటు ఏపీకి కూడా వరం అవుతుందేమో చూడాలి....
బిగ్ స్టోరీ

‘సోషల్ బబుల్’ దిశగా ప్రపంచం ?

siddhu
  కంటికి కనిపించని కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోని ప్రజలందరినీ బయట అడుగు పెట్టనీయకుండా భయబ్రాంతులకు గురి చేస్తోంది. మొదట్లో ఈ పరిస్థితి కొద్ది రోజులే అనుకున్నారు కానీ రోజులు కాస్తా వారాలు అయ్యాయి. ఇప్పుడు నెలలు నిండుతున్నాయి. ఈ సమయంలో ఒక్కసారిగా ఇళ్ళలో లాక్ అయిపోయిన చాలామందికి విపరీతంగా బోర్ కొడుతోంది. గతంలో స్కూల్ కి సెలవలు ఇస్తే ఆనందంగా ఇంట్లో గడిపేవారు మరియు ఆఫీస్ లో కొద్దిగా వెసులుబాటు దొరికితే లీవ్ పెట్టుకొని సొంత గ్రామానికి వచ్చే వారు కూడా ఇప్పుడు ఇంటి దగ్గర జీవితాన్ని జైలులా భావిస్తున్నారు. సరే అలా బయటకు వెళ్లి వద్దాం అనుకున్నా కూడా వెళ్లలేని పరిస్థితి దీంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అటువంటి వారి కోసమే న్యూజిలాండ్ ప్రభుత్వం సోషల్ బబుల్ మరియు ట్రావెల్ బబూల్ అంటూ రెండు కొత్త కాన్సెప్ట్లను తీసుకొచ్చింది. ఈ విధానం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలు ఎక్కువ మందిని కలవకుండా నియంత్రించే విధానం. తాము ఎంపిక చేసుకున్న కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను కలిసేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతిని ఇస్తాయి. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పరిమిత సంఖ్యలో మాత్రమే బయట వారితో కాంటాక్ట్ ఉంటుంది. దీని వల్ల మనస్సుకు కొద్దిగా ప్రశాంతత దొరకడమే కాకుండా ఆ గ్రూపులో ఎవరైనా పాజిటివ్ అని తేలితే మిగిలిన వారిని కూడా గుర్తించడం కూడా తేలిక అవుతుంది. లాక్ డౌన్ అనంతరం ఈ విధానాన్ని న్యూజిలాండ్ దేశం అమలు చేస్తే ఇప్పుడు బెల్జియం, జర్మనీ దేశాలు కూడా దీనిని పాటిస్తున్నాయి. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మరియు డెన్మార్క్ లలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొన్నిచోట్ల పది మంది మాత్రమే కలుసుకునేందుకు అనుమతిస్తుండగా కొన్ని చోట్ల కేవలం కుటుంబ సభ్యులు వరకే పర్మిషన్ దొరుకుతుంది. అయితే ఈ కాన్సెప్ట్ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది. జర్మనీలో రెండు కుటుంబాల్ని మాత్రమే కలుసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎలాంటి వారిని ఎంపిక చేసుకోవాలన్న అంశంపై స్వేచ్ఛ ఉంటుంది. కాకుంటే.. అలా బబుల్ గా మారిన వారు మాత్రం తమను తాము క్షేమంగా ఉంచుకోవటంతో పాటు.. సురక్షితంగా ఉంచుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. బెల్జియంలో కూడా రెండు కుటుంబాల్ని కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. సోషల్ బబుల్ ఎలానో.. ట్రావెల్ బబుల్ కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కొద్ది మంది కలిసి ప్రయాణిస్తారు....
బిగ్ స్టోరీ

ఏపీ మంత్రులు – ఏ శాఖకి ఎవరెవరో .. ఎవరు దేనికి స్పందిస్తారో 

siddhu
  సాధారణంగా భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మరియు మంత్రులు. అధిష్టానం ఇచ్చిన మంత్రి పదవులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖను ఖరారు చేసి ఉంటారు. ఆయా శాఖల పై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపించవలసిన బాధ్యత మంత్రులది. దానికి సంబంధించి ఏ శాఖలో అయినా ఎలాంటి సమస్య వచ్చినా సంబంధిత మంత్రి స్పందిస్తాడు మరియు బాధ్యుడు కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరు మాత్రం వేరు. అతను ఏ శాఖకు సంబంధించిన మంత్రి అయినా సరే అన్నింటిపైనా స్పందిస్తారు. తనకు సంబంధం లేని శాఖలపై ప్రెస్ మీట్ పెట్టి విమర్శకులకు ఎడాపెడా సమాధానాలు ఇచ్చేస్తారు. ఇక ఆ శాఖకు సంబంధించిన మంత్రి అయితే కనీసం అడ్రస్ కూడా ఉండరు. మొన్న రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన రచ్చ లేపిన కరెంటు బిల్లుల విషయంలో కూడా ఇదే జరిగింది. విద్యుత్ శాఖ మంత్రి ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి. కరెంట్ బిల్లు విషయంలో అంత పెద్ద రచ్చ జరిగితే ఆయన తాపీగా కేవలం రెండు ముక్కలు మాట్లాడేసి అసలు కరెంటు బిల్లులు అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి అని చెప్పారు. ఇక ఇతర మంత్రులు బుగ్గన, కన్నబాబు, హోంమంత్రి సుచరిత అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇస్తున్నారు. ఈ కరోనా దెబ్బకు తమ శాఖ ఏదో మంత్రులంతా మర్చిపోయినట్లుంది. ఇతరుల మంత్రుల శాఖల లోని అంశాలను వివరిస్తూ అసలు ఇది తమ శాఖే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీడియా ముందుకి వచ్చి కెమెరా ఉంది కదా అని గంటల తరబడి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇక విపత్తు నిర్వహణ శాఖా మంత్రి కరోనా వ్యవహారాన్ని డీల్ చేయాలి కానీ మన వ్యవసాయ మంత్రి కన్నబాబు మాత్రం ఒక సీనియర్ గా బాధ్యతలు తీసుకొని కెమెరా ముందు తన వాదనను వినిపించారు. విపక్షాల నుంచి ఏ ఒక్క మాట వచ్చిన తనే బాధ్యత తీసుకొని వారికి సమాధానం ఇస్తారు. అసలు నా శాఖ వ్యవసాయం కాదు విపత్తు నిర్వహణ అన్నట్లుగా ఇన్వాల్వ్ అయిపోతారు. అసలు మంత్రి మాత్రం ప్రెస్ మీట్ కు వచ్చి రెండు ముక్కలు మాట్లాడేసి హడావిడిగా వెళ్ళిపోతారు. ఇక మొన్న జరిగిన ఘోరమైన ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీక్ విషయంలో మాట్లాడాల్సిన పరిశ్రమ శాఖ మంత్రి బదులు ఒక శాసనసభ్యుడు వచ్చి మాట్లాడాడు. కరెంట్ బిల్లు విషయంలో ఆర్థిక మంత్రి బుగ్గన విపక్షాలకు సవాల్ విసురుతున్నారు. సీనియర్ గా బాధ్యతలు పంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీరంతా స్పందించారు అనుకుందాం కానీ అన్నీ మంత్రిత్వశాఖలలో ఇదే పరిస్థితి కొనసాగితే ఏమని చెప్పాలి? ఆర్థికమంత్రి పంచాయతీరాజ్ చట్టం గురించి అనర్గళంగా ప్రసంగిస్తారు స్థానిక ఎన్నికల గురించి పంచాయతీరాజ్ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పాలి కానీ ఆయన ఆర్థిక అంశాలు, వ్యవసాయ అంశాలపై ప్రకటనలు ఇస్తూ ఉంటారు. రైతుల విషయంలో అయితే బొత్స కలగజేసుకున్నట్లు మరెవరూ కలగచేసుకోరు. పౌరసరఫరాల శాఖ మంత్రి రేషన్ పంపిణీ విషయంలో ఇవ్వాల్సిన వివరణ సమాచార శాఖ మంత్రి పేఱ్ని నాని అని పిలుస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో. ప్రభుత్వానికి కొంత మంది సలహాదారులు ఉన్నారు. వారే అనధికారిక పాలకులు. ఇద్దరు ముగ్గురు సలహాదారులు చాలా యాక్టివ్ గా ఉంటారు. మొత్తం వ్యవహారాలన్నీ వాళ్లే చక్కబెడతారని.. సెక్రటేరియట్‌లో ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇదంతా అదేనంటారా మరి?...
బిగ్ స్టోరీ

660 లక్షల కోట్ల నష్టం లో ప్రపంచం 

siddhu
  కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలో ప్రతీ దేశం ఆర్థికంగా కుదేలు అయిపోయిన సంగతి తెలిసిందే. కంటికి కనిపించని క్రిమి వల్ల వచ్చిన ఈ మాయదారి రోగం తో ప్రపంచమంతా ఎంతలా తల్లడిల్లిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజులు గడిచేకొద్దీ దీని తీవ్రత ఎక్కువ అవుతోందే తప్ప ఏ మాత్రం కంట్రోల్ లో ఉన్నట్లు అనిపించట్లేదు. పైగా కొత్త కేసులు పెరగటమే కాకుండా మరణాలు కూడా భారీగా చోటుచేసుకుంటున్నాయి. విపరీతమైన ప్రాణ నష్టంతో పాటు సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన ఈ వైరస్ వల్ల ఈ భూమిపైన చాలా కష్టంగా మారింది. ఇక ఇదంతా పక్కన పెడితే ప్రత్యేక పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆర్ధిక నష్టం అంచనా వేస్తే అంతా నోరు తెరుస్తారు. ఎందుకంటే ఆ సంఖ్య అంత భారీగా ఉంది కాబట్టి. తాజాగా జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.435- 660 లక్షల కోట్ల వరకు కరోనా వల్ల నష్టం వాటిల్లిందని పరిశోధకులు చెప్పారు. ప్రపంచ జీడీపీలో ఈ విలువ 6.4 శాతం నుండి 9.7 శాతం వరకు ఉంటుందని అంచనా. దానికన్నా షాకింగ్ విషయం ఏమిటంటే ప్రపంచ బ్యాంకు లెక్కకట్టి చెప్పిన నష్టానికి మూడు రెట్లు అధికంగా ఎడిబి నివేదిక ఉండటం. ఇకపోతే మార్చి నెల ఆరవ తేదీ నుండి 6 లక్షల కోట్ల నుండి 26 లక్షల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లితే…. ఏప్రిల్ 3 నాటికి అది కాస్త రూ.150 నుండి 300 లక్షల కోట్లకు పెరిగింది. ఈ నష్టం మే 15 నాటికి రూ.435- 660 లక్షల కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేశారు. ఇప్పుడున్న పరిస్థితులు మరో మూడు నెలల పాటు సాగితే ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థకు సుమారురూ.128లక్షల కోట్ల నష్టం వస్తుందని.. అదే ఆర్నెల్ల పాటు ఆంక్షలు నెలకొని ఉంటే ఈ మొత్తం రూ.185లక్షల కోట్ల మేర ఉంటుందని చెబుతున్నారు. మాయదారి రోగంతో చైనా ఆర్థిక వ్యవస్థకు వాటిల్లే నష్టమే రూ.80 నుంచి రూ.120 కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు....
బిగ్ స్టోరీ

ప్రచారం పక్కనెట్టి .. గట్టి ప్లానింగ్ తో జగన్ విశ్వరూపం !

siddhu
  ముఖ్యమంత్రిగా జగన్ తీరు మిగతా వారితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అంతటి ఘన విజయం సాధించాక అసలు అతను తన పొలిటికల్ మైలేజ్ పట్టించుకోవట్లేదు. పనులు జరుగుతున్నాయా లేదా అన్న విషయం పైనే తన దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలో కరోనా ను సమర్థంగా ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అన్నీ పనుల్లో కూడా తాను వెనక ఉండి ముందు సంబంధిత మంత్రులను పెడుతున్నారు. కరోనా నివారణకు తగిన సలహాలు సూచనలు ఇచ్చి మంత్రులను రంగంలోకి దించుతున్నారే తప్ప ఇటువంటి ప్రచారం కోసం పాకులాడలేదు. అంతెందుకు మొన్న విశాఖలో జరిగిన ఘోరమైన ఎల్ జి పాలిమర్స్ దుర్ఘటనలో జగన్ కోటి రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం నుంచి బాధితుల కుటుంబాలకు ప్రకటించిన తర్వాత దేశం మొత్తం అతనిని ప్రశంసించింది. అయితే తన వంతు బాధ్యతను నిర్వహించిన ఆయన రాజకీయ లాభాల కోసం మరియు తన మైలేజ్ పెంచుకోవడానికి తప్న పడకుండా మంత్రుల చేత చెక్ లు ఇప్పించి మొత్తం ఆపరేషన్ జరిపించారు. ముందు నుండి జగన్లో ఈ లక్షణం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో అవసరం లేకపోయినా హుద్ హుద్ సమయంలో వారానికి పైగా హడావిడి చేశారు. ఇకపోతే తిత్లీ తుఫాను సమయంలో సహాయ కార్యక్రమాల దగ్గరే వారం రోజులు తిష్ట వేసిన చంద్రబాబు పాలన కార్యక్రమాలను చూసుకోకుండా ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ గడిపారు. ఇక బస్సుల మీద అయితే తాను సాయం చేస్తున్న పోస్టర్లు వేయించుకుని నానా హంగామా చేశారు. ఇక అప్పుడు అతను లక్షల్లో సాయం అందిస్తే చంద్రబాబు వచ్చేదాకా ఆ డబ్బులు ఇవ్వకుండా ఆయన చేతుల మీదనే సాయం అందిస్తామని అధికారులు చెప్పి నిలిపి వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు జగన్ మాత్రం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క బాధితునికి కోటి రూపాయలు సహాయం అందించి కూడా ఎటువంటి పొలిటికల్ మైలేజ్ కోరుకోకుండా మంత్రుల చేతి మీద గాని ఆ చెక్కుల పంపిణీ జరగడం గమనార్హం. చంద్రబాబు గతంలో అంతా తానే అన్నట్లు వ్యవహరించారు. ఆయన పైనే ఫోకస్ ఉండాలని పరితపించే వారు. అదీ కాకుండా మంత్రుల పైన నమ్మకం తక్కువ. ఇదే మంత్రి అవంతి మాట్లాడుతూ మా నాయకుడు జగన్ అని చెప్పుకోవడానికి తమకు ఎంతో ఆనందిస్తామని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తమ ప్రభుత్వం చేసిన పనిని పదింతలు గొప్పగా చెప్పుకుంటే రాజకీయ స్వలాభం గా మారుతుంది. చంద్రబాబు చాలాసార్లు అటువంటి ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. అయితే ఇపుడు జగన్ అచ్చమైన పాలన చూపిస్తున్నా జనాలకు ఏదో వెలితిగా ఉంటోంది. జగన్ తెర వెనక ఉండి ఎంత చేస్తున్నా ఏమీ చేయనట్లుగా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. మరీ బాబులా కాకపోయినా జగన్ కూడా అవసరం అయిన సందర్భాల్లో జనంలోకి ఎక్కువగా వస్తే అది పార్టీకి, ఆయనకూ కూడా లాభమేనని వైసీపీలో వినిపిస్తున్న మాట....
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

వర్గం… వరం… మోడీ మంత్రం…!

Srinivas Manem
నిర్మలమ్మది ఎంత నిర్మలమైన మనసో… మోడీది ఎంత ముచ్చటైన మాటో… కేంద్రానిది ఎంత జాలి హృదయమో…! అబబబబ్బబ్బా ఆ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏంటి..? దేశానికి ఉదారంగా ఇచ్చేయడం ఏంటి..? పేదల పట్ల...
బిగ్ స్టోరీ

జగన్ గ్రాఫ్ కిందకా పైకా?

siddhu
  కొద్ది రోజులు కరోనా అటు ఇటుగా ఊగిసలాడిన జగన్ ఇమేజ్ ను చూసి వైసిపి మద్దతుదారులు మరియు కార్యకర్తలంతా కొద్దిగా డీలా పడ్డారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా అధికార పార్టీకి వ్యతిరేకంగా మారగా…. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పోలుస్తూ జగన్ ను తక్కువ చేసి చూపించడం మీడియా వారు బాగా వంట పట్టించుకున్నారు. అయితే జగన్ మాత్రం కరోనా ఈరోజు ఉంటుంది రేపు వెళ్లిపోతుంది కానీ తాను ముఖ్యమంత్రిగా చేయవలసిన అభివృద్ధి పనులు మరియు జరగాల్సిన కార్యక్రమాలే తనను నాయకుడిగా నిలబడతాయని గట్టిగా నమ్మారు. ఆ సంకల్పబలంతోనే జగన్ అనేక సంక్షేమ పథకాలను ఆర్థిక సంక్షోభంలో కూడా నడిపిస్తూ తన లోని మరో కోణాన్ని చూపించారు. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా అభినందనల వర్షం వెల్లువెత్తుతోంది. జగన్ ధైర్యానికి మెచ్చుకుంటూ మొన్నటివరకూ విమర్శలు చేసిన సోషల్ మీడియానే ప్రశంసలు కురిపిస్తోంది. పోతిరెడ్డి ప్రాజెక్టు తెలంగాణలో కేసీఆర్ కు ఎంత వరకు నష్టం కలిగిస్తుందో తెలియదు కానీ జగన్ కు మాత్రం మరొక ఐదేళ్లకు సరిపోయేంత మైలేజీని తెచ్చిపెట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు యొక్క పాలనను పోల్చి చూస్తే గత ఐదేళ్లలో బాబు ఏ ఒక్క పని చేయలేకపోయాడు. పట్టిసీమ తప్పించి ఆయన చేపట్టిన మరో కొత్త ప్రాజెక్టు లేదు. 40 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన నిధులు లేవంటూ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయకపోవడం గమనార్హం. ఓటుకు నోటు కేసు లో జరిగిన రచ్చ గురించి ఎత్తకపోవడం మంచిది. కానీ తన ఏడాది పాలనలో జగన్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆర్థిక సంక్షోభంలో కూడా వేల కోట్లు ఖర్చు చేయవలసిన సంక్షేమ పథకాలపై ఎటువంటి ఆంక్షలు విధించకుండా కెసిఆర్ లాంటి లీడర్ నే ఢీకొనేందుకు సిద్ధపడ్డాడు. రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీట వేసిన జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 40వేల క్యూసెక్కుల నుండి 80 వేల క్యూసెక్కులకు పెంచగలిగితే రాయలసీమలో జగన్ ను కొట్టేవారే లేరంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు జగన్ కేసీఆర్ ను సయితం థిక్కరిస్తుండం ఏపీలో జగన్ కు హీరో వర్షిప్ లభించినట్లేనంటున్నారు. కేసీఆర్ ను ఢీకొనగలిగే సత్తా ఒక్క జగన్ కే ఉందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో పడుతున్నాయి. పోతిరెడ్డి పాడు విషయంలో ఏం జరిగినా ఇప్పటికే జగన్ మైలేజీ పెరిగిందన్నది కాదనలేని వాస్తవం....
బిగ్ స్టోరీ

జగన్ కేసీఆర్ గొడవ గ్రౌండ్ రిపోర్ట్

Srinivas Manem
తెలుగు నాట ఇప్పుడు ప్రత్యేక వార్తగా , ప్రాధాన్య అంశంగా మారింది ఏమైనా ఉంది అంటే అంది ఏపీ సీఎం జగన్ కి, తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఈ మధ్య వచ్చిన నీటి...
టాప్ స్టోరీస్ బిగ్ స్టోరీ

నీలం సాహ్నికి జగన్ వరం…!

Srinivas Manem
ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి సీఎం జగన్ కి పడడం లేదు అని ప్రచారం జరిగింది. ఆమె అసంతృప్తిగా ఉన్నారని, రాజీనామా చేసేస్తారని అనుకున్నారు. కానీ ఆమె విషయంలో ఓ అనూహ్యమైన వార్త బయటకు...
బిగ్ స్టోరీ

తెల్లవారుజామున 3.28 గంటల సమయంలో ఏం జరిగింది… చిన్న కుర్రాడు లేటుగా బయటపెట్టిన ఫోటో నిజాలు 

siddhu
  విశాఖ ఎల్ జి పాలిమర్స్ నుండి వెలువడిన గ్యాస్ లీక్ వల్ల జరిగిన ఘోరం గురించి అందరికీ తెలిసిందే. 12 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఆ కంపెనీ కి సంబంధించిన యజమానులు మరియు స్టాఫ్ ఇప్పటికీ ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం. వందల మంది ఆసుపత్రి పాలవగా వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అసలు ఫ్యాక్టరీని తమ ప్రాంతం నుండి తొలగించమని ఆందోళన చేపట్టిన గ్రామస్తులపై పోలీసులు విరుచుకుపడింది తీరు కూడా ఇప్పుడు ఎవరికీ మింగుడుపడటంలేదు. అయితే ఈ గ్యాస్ లీక్ విషయం పై మరి కొద్దిగా లోతుగా తవ్వగా కొన్ని ఆసక్తికరమైన ఆధారాలు బయటపడ్డాయి. తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ దారుణం లో అత్యంత కీలకమైన విషయం…. బయటకు విడుదలైన స్టైరీన్ గ్యాస్ అంత వేగంగా విస్తరించింది? అసలు గ్యాస్ లీక్ అయ్యేందుకు కారకులు ఎవరు? ఇవి అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఇందులో రసాయనం ఎంత వేగంగా వ్యాప్తి చెందింది అన్న విషయాన్ని తెలియజేసేలా కీలక ఆధారం ఒకటి బయటకు వచ్చింది. తెల్లవారుజామున ఘాటు వాసన తో ఒక యువకుడు నిద్రలేచాడు. కళ్ళముందు ఎల్జి పాలిమర్స్ ప్లాంట్ నుండి ఒక వాయువు విడుదల అవుతుండడం గమనించి దానిని ఫోటోలు తీశాడు. కొద్దిసేపటికే అతనికి అది ప్రమాదకర వాయువు అని అర్థమైంది. ఆ ఫోటోలను చూస్తే క్షణాల వ్యవధిలోనే వాయువు చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంత వేగంగా చుట్టివేసింది అన్న విషయం మనకి అర్థమవుతుంది. అసలు ఎంత మొత్తంలో గ్యాస్ బయటకు వచ్చింది…. ఎంత వేగంగా మిగతా గ్రామాలకు విస్తరించింది అన్న విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఎక్కడైనా గ్యాస్ లీక్ అయినప్పుడు మొదటిగా ఒక ప్రాంతం లో వాసులు దాని బారిన పడితే…. ఈరోజు ఉన్న ఫోన్లు మరియు టెక్నాలజీ కమ్యూనికేషన్ ద్వారా వెంటనే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నీ అప్రమత్తమైపోయి జాగ్రత్త పడతారు. కానీ అది తెల్లవారుజామున సూర్యోదయం ముందే జరిగింది కనుక ఆరుబయట నిద్రపోతున్న వారంతా దీని బారిన పడ్డారు. ఈ సమయంలోనే ఒక అపార్ట్ మెంట్ లోని ఐదో అంతస్తులో ఉండే యువకుడు గ్యాస్ లీక్ అయిన విషయాన్ని గుర్తించి.. వెంటనే తన దగ్గరున్న కెమేరాతో.. ఆ ఫోటోల్ని తన ఫ్లాట్ నుంచి తీశాడు. అతడు ఫోటోలు తీసే సమయానికే గ్యాస్ ప్లాంట్ అంతా వ్యాపించింది. కాసేపటికే ఆర్.ఆర్. వెంకటాపురం గ్రామంలోకి ప్రవేశించింది. క్షణాల్లో గ్యాస్ గ్రామాల్ని చుట్టుముట్టిన వైనం తాజా ఫోటోలతో బయటకు వచ్చింది....
బిగ్ స్టోరీ

అయ్యో…! ఆ స్నేహానికి నీటి దిష్టి తగిలిందేమో…!

Srinivas Manem
ఒకరిపై కోపం ఒకరితో స్నేహానికి దారి తీస్తుంది…! రాజకీయాల్లో ఇది ఎక్కువ. దీనికి సరైన ఉదాహరణ చంద్రబాబుపై కేసీఆర్ కోపం జగన్ తో స్నేహానికి దారితీయడం. వీరిద్దరి మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన...
బిగ్ స్టోరీ

రాజకీయ జీవితం లో అతిపెద్ద డైలమా లో ఉండిపోయిన గంటా!

siddhu
  రాజకీయాల్లో కొంతమంది నాయకులు ఉంటారు. పేరుకి పార్టీలో ఉండి పార్టీ తరఫున నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకారు. కానీ మేము మాత్రం పార్టీ మనుషులమే దానికి ప్రత్యేకంగా ఎలాంటి రుజువులు అవసరం లేదని అంటుంటారు....
బిగ్ స్టోరీ

పాపం…! అంత మంది150 కూడా సంపాదించలేరా..?

Srinivas Manem
లాక్ డౌన్ జూన్ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పనులు లేవు. కొనుగోళ్లు లేవు. వ్యాపారాలు లేవు. మధ్యతరగతి, పేద వర్గాల ఆదాయానికి గండి పడింది. ఇదే కొనసాగితే ఏం జరగనుంది? పేద...
బిగ్ స్టోరీ

‘భవిష్యత్తు’ మీద చంద్రబాబు బెంగ?

siddhu
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరిదీ ఒక బాధ అయితే మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడుది మరొక బాధ. ఇప్పుడు కరోనా కంటే కొడుకు రాజకీయ భవిష్యత్తే చంద్రబాబు ని ఎక్కువగా భయపెడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు…. నారా లోకేష్ రాజకీయంగా ఎదగలేకపోవడం మరియు అతని నాయకత్వం పార్టీ వర్గాల్లో నమ్మకం కలిగించలేకపోవడం వల్ల బాబు గారికి ఎక్కువ దిగులు పట్టుకుంది. చివరికి రాజకీయాలంటే సరిగ్గా తెలియని బండ్ల గణేష్ ఇలాంటి వాళ్లు కూడా లోకేష్ పై సెటైర్లు వేస్తూ ఉంటే బాబు తీవ్రంగా చింతిస్తున్నారు. ప్రస్తుతం 40 రోజులకు పైగా తండ్రి కొడుకులు ఇద్దరూ లాక్ డౌన్ వల్ల హైదరాబాదు లోనే ఉండి పోయారు. ఇకపోతే రాజకీయంగా తన సత్తా చాటేందుకు మంచి అవకాశం ఉన్నప్పుడు నారా లోకేష్ తొలి అడిగే తప్పటడుగు వేశారు. మంగళగిరి నియోజకవర్గం ఎంచుకొని పెద్ద పొరపాటు చేసిన లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీచేసి ఘోరమైన ఓటమిని చవిచూశాడు. దీంతో విమర్శకులు అన్నట్లుగానే లోకేష్ లో నాయకత్వ పటిమ లేదని తేలిపోయింది. రానున్న ఎన్నికల్లో మళ్లీ మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకుంటున్న లోకేష్ నియోజకవర్గం ప్రజల నుంచి 40 రోజులుగా దూరం అయిపోవడం కూడా పెద్ద దెబ్బే ఇకపోతే లోకేష్ కు తన తండ్రి లాగా చాకచక్యంగా వ్యవహరించడం రాదని ఎప్పటి నుంచి విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో అతను సరిగ్గా వ్యవహరించాడని అంటుంటారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలు లోకేష్ గురించి మీడియాకు ఈ విషయాన్ని వివరించడం గమనార్హం. అంతేకాకుండా క్లిష్ట పరిస్థితుల్లో లోకేష్ కనీసం స్పందించిను కూడా లేదని సదరు నేత ఆరోపించారు. జగన్ తొమ్మిదేళ్ళ పాటు పార్టీని ఒంటి చేత్తో ఒక్కడే ముందుగా నడిపించాడు. చివరికి అసాధారణ పోరాటపటిమ కనబర్చిన అధికారంలోకి వచ్చారు. వైసిపి మద్దతుదారులు అందరికీ ఏదో ఒక రోజు జగన్ రాష్ట్రాన్ని ఏలుతాడు అని విశ్వాసం ఉన్నది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లో లోకేష్ పైన ఇటువంటి భావన రవ్వంతైనా లేదు అనే చెప్పాలి. పొరుగున ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తండ్రి నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకున్నారు. కానీ నారా లోకేష్ విషయం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కన్పిస్తుండటం చంద్రబాబును ఆందోళనలోకి నెట్టిందనే చెప్పాలి. మరి రానున్న రోజుల్లో నారా లోకేష్ పార్టీకి గుదిబండగా మారతారా? ఫైర్ అవుతారా? అన్నది కాలమే నిర్ణయించాలి....
బిగ్ స్టోరీ

లాక్ డౌన్ 4.0 ప్రకటించనున్న మోడి ?

siddhu
  ఇప్పుడు దేశ ప్రజల అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే. మరొక వారం రోజుల్లో లాక్ డౌన్ తీస్తారా లేదా సడలింపులు పెంచుతారా? కథ కంచికి చేరనుందా లేకపోతే అంతరాయాలు అడ్డుకట్టలు ఇలాగే కొనసాగుతాయా? ఇక ఈ విషయానికి వస్తే ప్రజలు, యంత్రాంగానికే కాదు కనీసం రాజకీయ పార్టీలకి, కేంద్రానికి కి కూడా పరిస్థితి అర్థం కావట్లేదు. మోడీ చూస్తే ఏమో ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితి అవసరమే అన్నారు. అసలు దేశంలో చూస్తే యాక్టివిటీ పెద్దగా లేదు. పల్లెల్లో పరవాలేదు గాని పట్టణాల్లో ఇప్పటికీ కఠినమైన ఆంక్షలు అమలు అవుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ యొక్క ప్రయోజనం సామాన్యులకు అంతుచిక్కడం లేదు. కేసులు తగ్గినట్లు వాళ్ళకి కనిపిస్తే కదా. ఇకపోతే మద్యం షాపులు తీసిన తర్వాత అదొక పెద్ద గొడవ. గుంపులుగుంపులుగా షాపుల ముందు నిలబడటం…. కనీస సామాజిక దూరం లేకపోవడం మందు తాగేసి రోడ్డులో చిందులు వేయడం. ఇక వారం రోజులు సరుకులు ఒక రోజే కొనడానికి సామూహికంగా గుమికూడటం, తోపులాటలు, సరుకుల కోసం ఎగబడటం అన్నీ రాష్ట్రాల్లో రోజు చూసేదే. వీటన్నింటి మధ్య మోదీ మే 17 తర్వాత దేశంలో నియంత్రణలను కొనసాగించి జూన్ 1వ తేదీ దాకా పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే 70 వేలకు దగ్గరగా దేశంలో ఉన్న పాజిటివ్ కేసులు నమోదు కాగా లాక్ డౌన్ 3.0 ముగిసే సమయానికి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య లక్ష దాటుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా ఊహించనంత గొప్పగా ఏమీ లేదు. అంతా నామమాత్రంగానే సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి పది లక్షల మందికి కనీసం 20 వేల టెస్టులు చేయాలన్నది ఆరోగ్య నిపుణుల సూచన. కానీ మనం ఇంకా 2000 కూడా చేరకోకపోవడం గమనార్హం. ఇంకొక వైపు చూస్తే ఏమో తాజాగా నమోదవుతున్న కేసుల్లో లింకులు దొరకట్లేదు. ఎవరివల్ల కరోనా సోకిందో తెలియట్లేదు…. విదేశీ ప్రయాణం ఉండదు…. విదేశాలకు వెళ్లి వచ్చిన వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు…. కరోనా సోకిన వారితో కాంటాక్ట్ ఉండదు. మరి వైరస్ ఎలా సోకినట్లు? ఈ ప్రశ్నలన్నింటికి నడుమ లాక్ డౌన్ ని పొడిగించడం ఉత్తమమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది అని సమాచారం. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు ఇలాగే కొనసాగేనో…?...
బిగ్ స్టోరీ

వామ్మో: జగదేక వీరుడు అతిలోక సుందరి… సినిమా కాపీనా ? 

siddhu
  అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా’ వచ్చి 30 ఏళ్లు అయిందట. అయితే దాని నిర్మాత తప్పకుండా ఆ సినిమాకు సీక్వెల్ తీస్తానని కరాఖండిగా చెప్పేశారు కూడా. కొద్ది రోజులు చిరంజీవి కొడుకు రామ్ చరణ్, శ్రీదేవి కుమార్తె జాహ్నవి జంటగా ఈ సినిమా తీస్తారని వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరికి ఆ నిర్మాత తన ప్రతిజ్ఞను పునరుద్ధరించాడు. ఇకపోతే ఆ సినిమా యొక్క గొప్పతనం గురించి సోషల్ మీడియాలో తెగ ఊదరగొట్టేస్తున్నారు. ఆల్ టైమ్ క్లాసిక్ అని ఆ సినిమాకి చాలా పెద్ద ముద్ర వేయడమే కాకుండా చిరంజీవి అప్పట్లో 106 డిగ్రీల జ్వరంతో డ్యాన్సులు చేశారు అని కూడా రాస్తున్నారు. ఈ సినిమా బంపర్ హిట్.. అందులో తిరుగు లేదు. కానీ దానికి కల్ట్ క్లాసిక్ అనే ముద్ర వేసినప్పుడే సినిమా ప్రేమికుల మనసులు ఒప్పుకోవడం లేదట. అన్నీ కమర్షియల్ హంగులతో రంగరించిన ఒక సక్సెస్ ఫార్ములాతో ఫ్యాంటసీ సినిమాని తెరకెక్కించే లక్షలాది రూపాయలు ఈ చిత్రం వసూలు చేయగా పెద్ద పెద్ద సినిమా పండితులే ఆశ్చర్యపోయారు. అయితే ఆ సినిమాపై ఇప్పటికే అనేక మందికి కొన్ని తీరని అనుమానాలు ఉన్నాయి. ఆ సినిమా విడుదలైన రెండు రోజులకు ఈనాడు తన ఎడిట్ పేజీలో సినిమాను వెక్కిరిస్తూ వ్యంగ్యంగా ‘మతిలేని వీరుడు గతి లేని సుందరి’ పేరిట ఒక ఆర్టికల్ కూడా వేసింది. ఆ చర్చ వచ్చినప్పుడు ఒక అతను చెప్పిన మాట ఏమిటంటే… సినిమా దర్శకుడు రేలంగి నరసింహారావు ఆ కథను ఒక నిర్మాతతో చెప్పారట. రాజేంద్రప్రసాద్ తో ఆ సినిమాను కూడా ప్రారంభించారు. చివరికి అదే కథను రాఘవేంద్రరావు చిరంజీవితో తీస్తున్నట్లు తెలుసుకుని ఆయనను కలుసుకుని మొరపెట్టుకున్నారు. అయితే తమ సినిమా పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది…. కాబట్టి రేలంగిని త్వరగా తన సినిమాను పూర్తిచేసి విడుదల చేసుకోమని చెప్పినట్లు సమాచారం. ఇకపోతే రెండు సినిమాలు చిరంజీవి, రాజేంద్రప్రసాద్ మార్కెట్లను బట్టి ఆడాయి. ఒకరి దగ్గర కథ విని మరొకరికి చెప్పుకునే కథాచోరులు మన సినీ ఇండస్ట్రీలో మామూలే. అయితే చాలా మందికి ఇది కేవలం ఒక వార్త ఇక రాజేంద్రప్రసాద్ సినిమా కి వస్తే ఆ సినిమా పేరు రంభ-రాంబాబు. అందులో రాజేంద్రప్రసాద్ సరసన పారిజాత అనే ఒక అనామక హీరోయిన్ నటించింది. అందులో చంద్రమోహన్ నారద పాత్రధారి కాగా దాసరి నారాయణరావు యమధర్మరాజు. అందులో కథానాయకి పాత్ర దేవనర్తకి రంభ. నిజానికి ఈ సినిమాకి మరియు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకి మానవుడు-దేవకన్య తప్ప వేరే పోలికలు లేవు. కథ మొత్తం వేరే…. ట్రీట్మెంట్ కూడా వేరే. అయితే రేలంగి ముందు వేరే కథ అనుకొని రాఘవేంద్రరావు లాంటి పెద్ద దర్శకుడు దెబ్బకు కథలో మార్పులు చేశారా అన్న అనుమానం ఇప్పటికీ చాలామందిలో ఉండిపోయింది. అయితే కమర్షియల్ సినిమాకు సంబంధించి రాఘవేంద్రరావు స్టైల్ మనకి తెలిసిందే. ఇక ఆ సినిమాలో ఇళయరాజా ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటికీ అందరి చెవుల్లో మోగుతూనే ఉంటాయి. ఇక ఈ సినిమా కాపీయా కాదా…. అన్నది రెండు సినిమాల దర్శక-నిర్మాతలు నలుగురికే తెలియాలి. ఇక ఎన్నో మధ్య బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రాన్ని క్లాసిక్ కన్నా కూడా ఒక కమర్షియల్ పెద్ద సక్సెస్ అయిన సినిమా గా చెప్పడం మంచిది. అచ్చం మొన్న వచ్చిన మన బాహుబలి లాగా....
బిగ్ స్టోరీ

వైజాగ్ కి అసలు సవాల్ మొదలైంది…

siddhu
  విశాఖలో ఎల్ జి పాలిమర్స్ నుండి గ్యాస్ లీక్ అయి పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆగమేఘాలమీద వైజాగ్ చేరుకొని బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి జగన్ కోటి రూపాయల పరిహారాన్ని కూడా ప్రకటించేశాడు. ఇక మంత్రి కన్నబాబు కి మిగతా బాధ్యతలు అప్పగించేసి వెంట వెంటనే తతంగం ముగించాను అనుకున్నాడేమో కానీ దీని వల్ల దీర్ఘకాల సమస్యలు చాలానే ఉన్నాయి అన్నది ఇప్పుడు అందరి మాట. ఈ గ్యాస్ ప్రభావం ఆ ప్రాంత ప్రజలపై చాలాకాలం ఉండబోతోందని మరియు మరిన్ని ఆందోళనకర అంశాలు ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నాయి. సాధారణంగా స్టైరీన్ గ్యాస్ అంత ప్రమాదకరమైనది ఏమీ కాదు. మామూలు మనం నివసించే టెంపరేచర్ లో చాలా సురక్షితం కూడా. మరి గ్యాస్ వ్యాపించిన ఊళ్ళలో అంతమంది ఆస్పత్రి పాలు ఎందుకు అయ్యారు? చుట్టూ ఉన్న పచ్చదనం మొత్తం ఎందుకు కాలిపోయింది? వీటన్నింటికి చాలామంది దగ్గర సమాధానం లేదు. గ్యాస్ లీక్ అయినా శాస్త్రీయంగా ఒక అర కిలోమీటరు కన్నా ఎక్కువ వ్యాపించదు. దాని సాంద్రత ఎక్కువ కాబట్టి ఇప్పుడు వ్యాపించినంత దూరం అయితే వ్యాపించే అవకాశం లేదు. కానీ స్టైరీన్ ను 200 నుండి 300 డిగ్రీల మధ్య వేడి చేయడం ఏమిటి? ఐదు కిలోమీటర్ల దాకా వ్యాప్తి చెందడం ఏమిటి? శాస్త్రవేత్తల దగ్గరనుండి ఈ ప్రశ్నలన్నీ వస్తుంటే సమాధానం చెప్పలేక అంతా తెల్ల ముఖం వేసుకొని చూస్తున్నారు. అసలు స్టైరీన్ లో ఏవైనా కొత్త రసాయనాలు కలిపితే ఏ అవసరం కోసం కలిపారు అన్నది ఇంకా తేలాల్సి ఉంది. జగన్ వేసిన కమిటీలు అసలు కారణాన్ని బయటకు తీస్తాయో లేదో వేచి చూడాల్సిందే. ఈలోపల జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. గాలి కాలుష్యం అయింది…. కానీ అది మెల్లమెల్లగా కంట్రోల్ లోకి వస్తుంది. ఇక దాని బారిన పడి ఆసుపత్రి పాలైన వారందరిలో చాలాకాలం అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అదీ కాకుండా వారికి పుట్టబోయే బిడ్డలు కూడా అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితికి వస్తే ఐదారు ఊర్లలో ప్రతి ఇంటిలో ఉన్న ఏ కూరగాయలు ఉపయోగపడవు. పారేయాల్సిందే. చివరికి బియ్యం, పప్పులు, ఉప్పులు కూడా అంటే. ఆ ఊర్లలో చెట్లకు కాసిన కాయలు.. పొలాల్లో పండిన పంట ఏది చేతికి రాదు. ఇక ఇంటింటికీ ఒక లక్ష రూపాయలు ఇచ్చాను అన్నీ కొత్తవి కొనుక్కోండి అని జగన్ అంటాడేమో. ఇక భూగర్భ జలాలు కూడా బాగా కలుషితం అయిపోయాయి అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు నీళ్లు ఇచ్చే సమీప రిజర్వాయర్ పరిస్థితి ఏమిటో అయితే ఇంకా స్పష్టత రాలేదు. అది కలుషితం అయి ఉంటే చాలా పెద్ద సమస్య వస్తుంది. ఆ నీరు ఇంకిపోదు ఆవిరి అయిపోదు. అసలు రిజర్వాయర్ కు కొత్త నీళ్లు వచ్చేదాకా వ్చాటిని ఎండబెట్టడం సాధ్యమేనా? రాబోయే రోజులు విశాఖ వాసులకి చాలా క్లిష్టతరం కానున్నాయి అన్నది మాత్రం వాస్తవం....
టాప్ స్టోరీస్ బిగ్ స్టోరీ

మద్యంపై జగన్ మదిలో ఏముంది…?

Srinivas Manem
మద్యపాన నిషేధానికి మూల సూత్రాలు ఏమిటి..? మద్యాన్ని పూర్తిగా నిషేధించడం సాధ్యమవుతుందా..? దుకాణాల తగ్గిస్తూ, ధరలు పెంచుతూ ఉంటేనే సాధ్యమా? అలవాటు ఉన్న వాళ్లు మద్యం మానేస్తారా..? ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యాన్ని...
బిగ్ స్టోరీ

‘నేను ఉండి ఉంటే అసలు ….’ చంద్రబాబు పాండిత్యం మొత్తం బయటకొచ్చింది

siddhu
  నిన్న విశాఖ గ్యాస్ లీక్ ఘటన జరిగిన తర్వాత జగన్ హుటాహుటిన వైజాగ్ కు తరలిపోయారు. అయితే చంద్రబాబునాయుడు గారు మాత్రం విశాఖకు వెళ్లేందుకు ఎన్నో విఫలయత్నాలు చేశారు. అదలా ఉంచితే మొన్నటి నుండి వైరల్ అవుతున్న వ్యాఖ్య ఏమిటంటే ‘మోడీకి ఏపీలో నో ఎంట్రీ అని ఉరిమిన చంద్రబాబే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేందుకు మోడీని అడుక్కుంటున్నాడు’ అని. విశాఖ వెళ్లడానికి చంద్రబాబు ప్రధాని మోదీ సాయాన్ని మరియు అనుమతి కోరిన దాన్ని చూపిస్తూ బయటకు వచ్చినా వ్యాఖ్య ఇది. రాజకీయాల్లో ఇంత అస్థిరమైన శత్రుత్వాలు మరియు చంచలమైన స్నేహ బంధాలు ఒక్క చంద్రబాబు దగ్గర మనం చూస్తూ ఉంటాం. ఇక ఆ విషయం పక్కన పెడితే చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండవలసి రావడం వల్ల తన రాజకీయ లబ్ధి కోసం చేయవలసిన ప్రయత్నాల అవకాశాల్ని కోల్పోవాల్సి వస్తుందని అసహనంతో ఊగిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఫ్రస్టేషన్ లో అతనే మాట్లాడుతున్నాడు అతనికే అర్థం కావట్లేదు. తనకు ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా పోగొట్టుకుంటున్న తీరు ఇప్పుడు తెదేపా వర్గాలకు అంతుచిక్కడం లేదు. నిన్నటి విశాఖ గ్యాస్ లీక్ తర్వాత బాబు అన్న మాటలివి — “ఐఏఎస్ లు ఏం చేస్తారు? ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నా…. స్టైరిన్ అంటే నాకే తెలియదు ఐఏఎస్ లకు ఏం తెలుస్తుంది? జగన్ ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కావడం లేదు. చెబితే వినడు. సబ్జెక్ట్ కమిటీ కదా వేయాల్సింది జగన్ తో సంబంధం లేకుండా మా నాయకులు రామానాయుడు, అచ్చెన్నాయుడు, చినరాజప్ప లతో నేనే ఓ కమిటీ వేస్తున్నాను” జగన్ వేసిన కమిటీ ని కాదని తమ సొంత ఎమ్మెల్యేలతో కమిటీ వేయడం ఏందో చంద్రబాబుకే తెలియాలి. సాంకేతికంగా రసాయన పరిశ్రమల గురించి ఐఏఎస్ అధికారులు, నిపుణులకు కాకపోవచ్చు కానీ ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలను ఏం చేయాలి…. తదుపరి ప్రమాదాలను నివారించాలన్న విషయం పై వారి కన్నా బాగా ఎవరికి తెలుసు? కంపెనీ వైఫల్యం మరియు మొన్న చోటుచేసుకున్న తప్పిదాలను పరిశీలించి ఆయా నిపుణులతో చర్చించి తగిన నిర్ణయాలు నివేదికలను వివరించాల్సిన బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు…. అందులోనూ ముగ్గురు ఇంజనీరింగ్ పట్టభద్రులకు కాకుండా ఇంకా ఎవరికి ఉంటుంది? అటువంటి కమిటీని బాబు తప్పుబట్టడం ఏందో అతనికే తెలియాలి. ఇంతకీ రామానాయుడు, అచ్చెన్నాయుడు, చినరాజప్ప ఏఏ సబ్జెక్టుల్లో పట్టబధ్రులో బాబు గారే సెలవివ్వాలి. ఇదిలా ఉంటే, “కోటి రూపాయలతో మనిషి బ్రతుకి వస్తాడా..? అసలు కోటి రూపాయలు ఎవరు అడిగారు? అవి అయినా సరిపోతాయా?” అంటూ బాధితులకు కోటి రూపాయలు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం బాబు గారు ఎంతవరకు సబబు? ఉదారంగా పరిహారాలు ఇవ్వడం చంద్రబాబు కి ఎప్పుడూ చేతకాలేదు… పైగా మళ్లీ అర్ధరహితమైన వ్యాక్యాలు. పుష్కరాల ప్రమాదం సందర్భంలో బాబు చేసిన నిర్వాకం ఎవరికీ తెలియంది కాదు. రేపు పొద్దున లీగల్ ఫైట్ లో కంపెనీ నుండి ఎక్కువ మొత్తం రాబట్టలేకపోయినా కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇస్తామన్నా కోటి రూపాయలు అయినా పరిహారంగా వస్తాయి అన్న భావంతో జగన్ కోటి రూపాయలు ప్రకటించి ఉండవచ్చు. దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అది వేరే విషయం. ఇకపోతే…. “ఇలాంటి ప్రమాదం ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. నేను ఉండి ఉంటే నేరుగా ఫ్యాక్టరీలో కి వెళ్ళే వాడిని. ప్రభుత్వం హ్యాండిల్ చేసిన తీరు సరిగా లేదు” అని బాబు వ్యాఖ్యానించడం కొసమెరుపు. బాబు ఉంటే ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఏం చేసేవాడు? సేఫ్టీ వాల్వ్స్ స్వయంగా క్లోజ్ చేసేవాడా లేదా అప్పటికప్పుడు ఇంజన్లు రిపేర్ చేసేందుకు బోల్టు లు, నట్లు విడదీసి ఎక్కడ తప్పు జరిగిందో కన్నుక్కొని చివరికి ధ్రవ పదార్థాన్ని వాయువుగా మారకుండా ఉందేందుకు పాలిమరైజేషన్ చేసేవాడా?  ఒక రాజకీయ నాయకుడు ప్రమాదం జరిగేటప్పుడు ఫ్యాక్టరీలకు వెళ్లి చేయగలిగింది ఏముంటుంది? ఏదో వినే వాళ్ళు వెర్రి మాలోకాలు అన్నట్లు పిచ్చి వ్యాఖ్యలు చేయడం కాకపోతే....
బిగ్ స్టోరీ

జగన్ సైలెంట్ ఉన్నా… టీడీపీ నే హైలైట్ చేస్తోంది 

siddhu
  కరోనా ప్రబలిన మొదట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పైన చాలా విమర్శలు వచ్చాయి. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో అతనిని పోచి చాలా దారుణమైన రీతిలో పాలనను కొనసాగిస్తున్నారని…. ప్రజల పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. అయితే జగన్ మాత్రం ఏ మాత్రం తడబాటు లేకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూపోయాడు. ఇకపోతే మొదట్లో జగన్ కరోనా మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది అని మరియు దానితో కలిసి జీవించాల్సిన రోజులు ముందు ఉన్నాయని ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేసుకుంటే అప్పుడు పచ్చ బ్యాచ్ విపరీతమైన గగ్గోలు పెట్టింది. అసలు సహజీవనం అనే మాటను జగన్ ఎలా అంటారు అని ఎగిరెగిరి పడ్డారు. పచ్చ చొక్కా లోపల దాచి పెట్టి పైకి ఎర్ర చొక్కాలు.. కాషాయం చొక్కాలు ధరించిన వాళ్లు కూడా జగన్ మాటలకు రుసరుసలాడారు. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వ‌మూ అదే మాటే చెప్పింది. క‌రోనాతో క‌లిసి జీవించ‌డాన్ని నేర్చుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించింది. మే 17 త‌ర్వాత ప‌రిస్థితి ఏమిటి? అనే ప్ర‌శ్న‌లు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో కేంద్రం ఈ విధంగా స్పందించ‌డం గ‌మ‌నార్హం. క‌రోనాతో లాక్ డౌన్ ను ఇంకా పొడిగిస్తూ పోవ‌డం జ‌రిగే పని కాద‌నే విష‌యం కేంద్రానికి పూర్తిగా అర్థం అవుతున్న‌ట్టుగా ఉంది. మ‌రి ఇప్పుడేమంటారు?  వీళ్లంద‌రి క‌న్నా ముందు జ‌గ‌న్ ఇదే మాటే చెబితే, వెర్రిమాట‌లు మాట్లాడిన‌ట్టుగా ఇప్పుడూ మాట్లాడ‌తారా! మాట్లాడ‌గ‌ల‌రా? ఇక ఆ విషయం పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రంలో రోజూ నమోదు అవుతున్న కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ముందునుండి ఈ విషయమై ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. ఇక ముందు నుండి ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ డేంజర్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రోజుకి 10 అంతకన్నా తక్కువ కేసులు నమోదు అవుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో కనీసం 50 కేసులు నమోదు కావడం తో అంతా జగన్ పై ఫైర్ అయ్యారు. అయితే లోపల అసలు నిజం ఏంటో ప్రజలకు తెలుసు. సోషల్ మీడియా ద్వారా నిజం వారి కళ్ళముందు కనపడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకి 3 వేల నుండి 5 వేల మధ్య కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం రోజుకి 150 నుండి 200 మధ్యలో మాత్రమే నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని పలువురు పాత్రికేయులు మరియు ప్రజలు నిలదీసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రోజుకి ఎన్ని టెస్టులు జరుగుతున్నాయో చూపించడం కూడా మానేసింది. సాధ్యమైనన్ని ఎక్కువ పరీక్షలు చేస్తూ ఎంతోమంది కరోనా బాధితులను బయటకు తీసుకు వచ్చి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నందుకు ప్రశంసించడం పోయి అసలు పారదర్శకత లేని ప్రభుత్వం తో పోల్చి విమర్శించడం ఏమిటనే భావనలో ప్రజలు ఉన్నారు. అలాగే విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు ఏపీ ప్రభుత్వం కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించిన తర్వాత కూడా చంద్రబాబు కోటి రూపాయలు సరిపోవని అంతకు రెండు రెట్లు మూడు రెట్లు ఇవ్వాలని అడగడం తెలుగుదేశం పార్టీ వారి దయనీయమైన పరిస్థితి తెలియజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవ్వనంత మొత్తాన్ని జగన్ ప్రకటించినప్పటికీ చింతిస్తూ ఉంటే వారు ఇలా మాట్లాడడం చివరికి జగన్ హైలెట్ చేసినట్లే అవుతోంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ వ‌ర్గాల తీరు వ‌ల్ల జ‌గ‌న్ లోని దార్శానిక‌త మ‌రింత‌గా బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్టుగా ఉంది!...
బిగ్ స్టోరీ

కోరి వచ్చిన వారితో కయ్యాలేల…!

Srinivas Manem
కోర్టుల్లో అడుగడుగునా వ్యతిరేక తీర్పు వస్తుంది… ప్రతిపక్షం అర్ధరహిత ఆరోపణలు చేస్తుంది… కేంద్రం అరకొరగానే చూస్తుంది… ఒక వర్గం మీడియా అక్షర దాడి చేస్తోంది…! దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలని సుదీర్ఘ లక్ష్యం పెట్టుకున్న జగన్...
బిగ్ స్టోరీ

కరోనా విషయం లో భారీ బ్యాడ్ న్యూస్ చెప్పిన సైంటిస్ట్ లు 

siddhu
  భారతదేశంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా…. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. అయితే ఈ సమయంలో కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్యల్లో ఇప్పటివరకు కీలక పాత్ర పోషించిన ఎయిమ్స్ విశ్వవిద్యాలయ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కరోనా వ్యాప్తిపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా కట్టడి కోసం తీసుకున్న అన్ని ప్రణాళికలు మరియు కంటైన్మెంట్ కోవిడ్ నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన తన వంతు పాత్ర పోషించారు.   ఇకపోతే ఇప్పటిలో ఈ కరోనా వైరస్ మనల్ని వదిలి వెళ్ళదు అని స్పష్టం చేసిన ఆయన వచ్చే శీతాకాలంలో భారతదేశంలో కరోనా వైరస్ రెండవసారి విజృంభించే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. ఇలా మరికొన్ని రోజులు మనం ఈ మహమ్మారి తో కలిసి జీవించాలని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా జనాలు తిరగడం వల్ల కరోనా వ్యాప్తి జరుగుతోందని చెప్పిన ఆయన ఈ పోరాటంలో ప్రైవేటు రంగం కూడా తనవంతు పాత్ర పోషించారని పిలుపునిచ్చారు. అలాగే దేశంలోని హాట్ స్పాట్ లలో ఉన్న కేసులు తగ్గించడం పై ప్రత్యేక దృష్టిసారించాలని కేంద్ర ప్రభుత్వానికి డాక్టర్ గులేరియా సూచించారు. దీనికి సంబంధించిన వ్యూహాలను ప్రత్యేక ప్రాంతాల్లో అమలు పరచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉండగా ఈ ప్రాంతానికి తగ్గట్టు మన ఆలోచనా సరళి కూడా మారాలని. ఒకే ఆలోచనను అన్ని ప్రాంతాలలో అమలు చేయడం కుదరదు అని చెప్పిన ఆయన హాట్ స్పాట్ లపై ప్రత్యేక నిఘా ఉంచి దగ్గరుండి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ముఖ్యంగా దేశంలో రానున్న శీతాకాలం భారతదేశ భవిష్యత్తును నిర్దేశించనుందని చెప్పిన ఆయన లాక్ డౌన్ ను ఎత్తివేసిన తరువాత కూడా శీతాకాలంలో ఉన్నట్లుండి కేసుల భారీగా పెరిగే అవకాశం ఉందని అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బెడ్స్ పారామెడికల్ సిబ్బంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ వెంటిలేటర్స్ లాంటి వసతులు సిద్ధం చేయాలన్నారు. ఇకపోతే ఇప్పటివరకు భారతదేశంలో ఇప్పటికే 46605 కేసులు నమోదు కాగా 12948 మంది కోలుకున్నారు. 1573 మంది మరణించారు. 32080 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు...
బిగ్ స్టోరీ

ఓపెన్ చేసి తీరాల్సిందే – కే‌సి‌ఆర్ పీక మీద కూర్చున్నారు వారంతా!

siddhu
ఆర్థికంగా సంపన్నమైన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే లాక్ డౌన్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన ఇష్టం వచ్చినన్ని రోజులు పొడిగించుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఎలాగోలాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు కానీ ముందు ప్రజల ప్రాణాలు ముఖ్యం అని ఆయన చాలా గట్టిగానే ఉన్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం మరొక రెండు వారాలు లాక్ పొడిగిస్తున్నట్లు చెప్పిన తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన సడలింపుల కింద మద్యపానాన్ని విక్రయించడం మొదలుపెట్టొచ్చు అని తెలియజేసిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక్క షాపు కూడా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదు. కానీ కొన్ని పత్రికలు మాత్రం పాలకుడి అభిప్రాయానికి భిన్నంగా మద్యం షాపులు తెరవాలి అన్నది ప్రజల అభిప్రాయం అన్న ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సదరు పత్రిక వాదన ఏమిటంటే మద్యం షాపులు తెరిచేందుకు ఏపీ, మహారాష్ట్ర మరియు కర్నాటక ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చారని అయితే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆంక్షల వల్ల మద్యం ఇక్కడ పొంగిపొర్లే అవకాశం ఉందట. అదే కనుక జరిగితే రాష్ట్రంలో జనం జేబులు గుల్ల అయిపోవడం ఖాయమని…. అధిక రేట్లకు ఇక్కడ విక్రయిస్తారు అని వారు భవిష్యత్తును చెప్పేశారు. అదే కాకుండా దీని వల్ల కల్తీ మద్యం ప్రవేశించి ప్రజల ప్రాణాలకు ముప్పు తేవచ్చు అని మరియు గుడుంబా బట్టీలు కూడా అప్పుడే మొదలైపోయాయని కళ్ళకు కట్టినట్లుగా వార్తల్లో ప్రచురించారు. ఇటువంటి వార్తలతో ప్రజల్లో కొద్దిగా అసహనాన్ని రగిల్చి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారి అజెండా ఏమో. అంతేకాకుండా ఆమధ్య లిక్కర్ షాపులపై ఒక ప్రశ్న అడిగిన పాపానికి ఒక జర్నలిస్ట్ పై కేసీఆర్ విరుచుకుపడిన తీరు మనకి తెలిసిందే. ఇక పక్క రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ తమ రాష్ట్రంలోని పత్రికలే ప్రభుత్వ మద్యం పై తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నట్టు వార్తలు రాస్తూ ఉంటే సీఎం గారు మాత్రం ఏం చేస్తారు. ఈరోజు సాయంత్రం ఒక అత్యవసర మీటింగ్ కు ఆదేశించి గ్రీన్, ఆరెంజ్ మరియు రెడ్ జోన్ లలో మద్యం విక్రయాల విషయంపై నిర్ణయం తీసుకోబోతున్నారు. చివరికి అతి త్వరలోనే తెలంగాణలో కూడా మద్యం విక్రయాలు మొదలైపోతాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంత మంది గొంతు మీద కత్తి పెట్టినట్లు వ్యవహరిస్తే ఎంత సీఎం అయినా ఏం చేస్తాడు లే…!...
బిగ్ స్టోరీ

దేశ ప్రజల ‘లవ్’ ని  గెలుచుకున్న అగర్వాల్…

siddhu
ఈ కరోనా క్లిష్ట కాలంలో దేశం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ రోజు సమాచారం ఆ రోజున అందిస్తున్న అధికారి ఒకతను మనందరికీ బాగా సుపరిచితుడు. రోజూ వార్తల్లో కనిపించి అతని మొఖం ఇప్పుడు దేశ ప్రజల్లో చాలామందికి ధైర్యం. అఖిల భారత సర్వీసు అధికారులు అయితే అతను అత్యంత కీలక వ్యక్తి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారాల నోట్లో కూడా ఆ పేరు ఎప్పుడూ నానుతూ ఉంటుంది. అతనే మన లవ్ అగర్వాల్. కరోనా నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి హోదాలో నిత్యం వార్తల్లో వ్యక్తిగా మారిపోయిన ఆయన పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోం.ది అంతర్జాతీయంగా కూడా వెలుగులోకి వచ్చిన అతను కరోనా సమాచారం పాత్రికేయులకు వివరిస్తూ టీవీ ఛానళ్లలో కనిపిస్తూ ఉంటారు. ప్రజలంతా విపరీతమైన ఆందోళన మరియు అసహనంతో ఉన్నప్పటికీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఎంతో ధైర్యంగా కనపడుతూ ఉంటారు. ఎంతటి ఆందోళనకర సమాచారాన్ని అయినా చాలా ప్రశాంతంగా వెల్లడించే ఆయన విలేకరుల సమావేశంలో ఓపికగా సమాధానాలు ఇస్తూ అతని మాటలతో, చేతలతో, హావభావాలతో ఈ గడ్డు పరిస్థితిని దేశం అధిగమించగలదు అని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ప్రజల్లో ధైర్యం నూరిపోస్తూ ఉంటారు. ఇక కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను జన్నాలో ధైర్యం నింపేలా సమృద్ధిగా వివరిస్తూ ఉంటారు. అలాగే పర్సనల్ గా అంతర్జాతీయ దేశాల విధానాలను విశ్లేషిస్తూ ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి హోదాలో కేంద్రానికి విలువైన సూచనలు, సలహాలు అందజేస్తూ ఉంటారు. అంతిమంగా తన బాధ్యతల నిర్వహణలో సంపూర్ణ చిత్తశుద్ధి కనపరుస్తూ అటు ప్రభుత్వంతో పాటు ఇటు దేశ ప్రజల ప్రశంసలు కూడా పొందుతున్నారు. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తలలో నాలుకలా వ్యవహరిస్తున్న లవ్ అగర్వాల్ రాత్రి 12 గంటల వరకు తన శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో తలమునకలవుతున్నారు. స్వయంగా వైద్యుడైన డాక్టర్ హర్షవర్ధన్ ఆరోగ్య శాఖకు సంబంధించి లవ్ అగర్వాల్ పరిజ్ఞానం చూసి ఆశ్చర్యపోతున్నారు అంటే ఇతని మేధాసంపత్తి ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఎంతోమంది యువతికి ఇతను ఆదర్శం. సమస్య పరిష్కారం అయ్యేవరకూ విశ్రాంతి లేదని అగర్వాల్ స్వయంగా వ్యాఖ్యానించడం అతని నిబద్ధతకు నిదర్శనం అని చెప్పాలి. ఇక లవ్ అగర్వాల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులకు మరియు యంత్రాంగానికి ఎంతో పరిచయస్తుడు. ఉత్తరప్రదేశ్ లో పుట్టిన అగర్వాల్ ఢిల్లీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. తర్వాత సివిల్స్ పై దృష్టి సారించిన ఈయన ఒక ఇంజనీర్ గా కన్నా ప్రభుత్వ ఉన్నతాధికారిగా ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చని భావించడం చాలా గొప్ప విషయం.1996లో ఐఏఎస్ అధికారి ఎంపికైన అతనిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు కేటాయించారు. కృష్ణా జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన లవ్.. భద్రాచలం అసిస్టెంట్ కలెక్టర్ గా… మెదక్, విశాఖపట్నం మరియు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సేవలందించారు. 2014 లో రాష్ట్ర విభజన అనంతరం ఆయనను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. 2016 లో కేంద్రాల కి డిప్యూటేషన్ పై వెళ్లారు. ప్రతి ఐఏఎస్ అధికారి ఏ రాష్ట్ర క్యాడర్ అయినప్పటికి విధిగా కొంతకాలం కేంద్రంలో పనిచేయాలి. దీనినే డిప్యుటేషన్ అని వ్యవహరిస్తారు. ఇందులో భాగంగానే 2016 లో లవ్ అగర్వాల్ కేంద్రానికి వెళ్ళారు. 2021 వరకు కేంద్రంలో ఉండి తిరిగి ఏపీకి వస్తారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర మంత్రిత్వశాఖ కార్యదర్శిగా లవ్ అగర్వాల్ సేవలు ప్రశంసనీయమని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తిలేదు...
బిగ్ స్టోరీ

కంట్రోల్ తప్పిపోయిన కరోనా… ఇలా అయితే ఎప్పటికీ బయటకి రాలేము!  

siddhu
మొన్నటి వరకు ప్రతిరోజు భారతదేశంలో అటు ఇటుగా ఒక 1500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యేవి. కానీ ఇప్పుడు అనూహ్యంగా రోజుకి 2000 దాకా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం కేంద్ర ప్రభుత్వానికిమింగుడుపడడం లేదు. వరుసబెట్టి ఎంతో రిస్క్ తీసుకొని లాక్ డౌన్ లు అమలు చేస్తున్నా కూడా మెల్లగా రోజుకి నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2500 దిశగా దూసుకెళుతోంది. ఏ ఒక్క రోజు కూడా కేసులు తగ్గుతున్న దాఖలాలైతేకనిపించడం లేదు. రోజురోజుకి కొత్త రికార్డు నమోదు అవుతూ ప్రజలను భయాందోళనల్లోకి నెడుతోంది ఇకపోతే ఆదివారం ఒక్కరోజే 2487 కొత్త కేసులు నమోదు కాగా ఒకే రోజులో ఇన్ని కేసులు ఇప్పటివరకు ఎప్పుడూ నమోదు కాలేదు. ఇక పాజిటివ్ కేసులు సంఖ్య 40,000 దాటి మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. రికార్డుస్థాయిలో ఆదివారం ఒక్కరోజే 83 మంది కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు. అయితే 40 రోజుల తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుంది అనుకున్న వారికి నిరాశే మిగిలింది. కరోనా వైరస్ వ్యాప్తి కాలం 14 రోజులు.. మహా అంటే 28 రోజులు లాక్ డౌన్ కారణంగా దాని వ్యాప్తిని నిరోధించేసినట్లే అని అంతా చంకలు గుద్దుకుంటుంటే చివరికి 40 రోజుల గడిచినా ఆ వ్యాప్తి ఏమాత్రం తగ్గకపోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రమాద ఘంటికలు విపరీతంగా మోగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ లాంటి రాష్ట్రాలలో పరిస్థితి నిలకడగా ఉండగా మరికొన్ని రాష్ట్రాలలో ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదని కేంద్రం కొన్ని గణాంకాలను చూపిస్తోంది. ఇక దేశంలో పాజిటివ్ కేసులు పది వేల నుండి 20 వేలకు చేరేందుకు తొమ్మిదిరోజులు పట్టగా 20 వేల నుండి 40 వేలకి చేరేందుకు కేవలం 14 రోజులు పట్టింది. దీన్ని విశ్లేషిస్తే 11 రోజుల్లో 20 వేల కేసులు నమోదయ్యాయని అర్థం చేసుకోవచ్చు. ఇక వీటన్నిటితో పోలిస్తే దేశంలో కరోనా ను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రం కేరళ. మొదట్లో అత్యధిక పాజిటివ్ కేసుల వరసలో అగ్రస్థానంలో ఉన్న ఈ రాష్ట్రం తర్వాత ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కరోనా వ్యాప్తిని పూర్తిగానిరోధించింది. ఇప్పటికి 500 మందికి మాత్రమే పాజిటివ్ రాగా వారిలో 400 మందికి వైరస్ నయం అయిపోవడం గమనార్హం. కేవలం నాలుగు మరణాలు సంభవించగా ఆదివారం రోజున ఒక్క కేసు కూడా కేరళలో నమోదు కాలేదు...
బిగ్ స్టోరీ

35 పైసల ట్యాబ్లెట్ కరోనా కి అద్భుతంగా పని చేస్తోంది? 

siddhu
మానవుడు నాగరికత పేరుతో ధనం వెనుక అభివృద్ధి అనే ఇంధనం వేసుకొని పరుగులు పెడుతున్న తీరు ఇప్పుడు అనేక రోగాలకు కారణం అవుతోంది. ఇక ప్రపంచంలో చాలామందికి గ్యాస్ ప్రాబ్లం చాలా సర్వసాధారణమైన విషయం....
బిగ్ స్టోరీ

రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికంటే ‘ వింత ‘ రాజకీయం – రాపాక దే !

siddhu
రాపాక వరప్రసాద్ తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే. అయితే ఇతని పేరు తెలియని వారు రాష్ట్రంలో ఉండరు అంటే అతిశయోక్తి కాదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫునుండి...
బిగ్ స్టోరీ

పరీక్షలకే… పేద్ద పరీక్ష…!

Srinivas Manem
లాక్ డౌన్ ఉన్నా… సడలింపులు ఇచ్చేసారు… స్వీయ నిర్బంధం అవసరం లేదు అనుకుంటున్నారేమో…! గతంలా విచ్చలవిడిగా… ఇష్టానుసారంగా తిరిగేయొచ్చు అనుకుంటున్నారేమో… లేదు. జీవితం ఇక కొద్దీ రోజుల పాటు(అంటే పూర్తిస్థాయి వాక్సిన్ వచ్చే వరకు)...
బిగ్ స్టోరీ

‘లింకు’ కేసులకి టెస్ట్ లు చేయకపోతే… 14 రోజుల్లో ప్రళయం 

siddhu
అసలు భారతదేశంలో కి కరోనా వైరస్ ఎలా ప్రవేశించింది? విదేశీయులను మనదేశంలోకి సరైన స్క్రీనింగ్ మరియు చెకింగ్ చేయకుండా వదలడం వల్ల (లేదా) విదేశాల నుండి తిరిగి వచ్చిన భారతీయులు కేంద్ర ప్రభుత్వ అధికారుల కళ్లుగప్పి లోనికి రావడం వల్ల. అది ఇంత విస్తృతంగా వ్యాప్తి చెందడానికి కారణం నిజాముద్దీన్ మర్కజ్ మత ప్రార్థనలు. దాదాపు భారతదేశం లో నమోదైన కేసులన్నీ పైన ఉన్న మూడు కారణాల లో ఏదో ఒక దానికి లింక్ అయి ఉంటాయి. అయితే అన్నీ చోట్ల పరిస్థితి ఒకేలా ఉండదు కదా. తెలంగాణలో నమోదవుతున్న కొన్ని కేసుల్లో ఒక్క కేసు కూడా పైన ఉన్న మూడిటిలో ఏ ఒక్క కారణానికి సంబంధం లేకుండా ఉండడం ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. పరిస్థితి అదుపులో ఉంది.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం నుంచి భరోసా మాటలు వినిపిస్తున్నా…. కరోనా వేళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సరైన రీతిలో విశ్లేషణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వ అధికారులపై ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కేసుల తీవ్రత తగ్గిందని.. డబుల్ డిజిట్ లో నుండి పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్ లోకి మారడం చాలా గొప్ప విషయం అని అంటున్నా వాస్తవాలను దగ్గర్నుంచి చూస్తే మాత్రం టెన్షన్ తీరడం లేదు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు వెలుగు చూసిన పాజిటివ్ కేసులు 22 కేసులకు సంబంధించిన మూలం ఏమిటో ఇప్పటికీ తెలియట్లేదు. ఆ ఇరవై రెండు కేసులలో ఏ ఒక్కరు కూడా విదేశాల నుండి వచ్చిన పాజిటివ్ కేసులకి తెలిసిన వారు కాకపోవడం…. అలాంటి వారితో కాంటక్ట్ లేకపోవడం మరియు వారితో కాంటాక్ట్ కారణంగా నమోదైన కేసులు లేదా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన కేసులు లో కూడా లేకపోవడం ఇప్పుడు అసలు వీరికి వైరస్ ఎలా సోకింది అన్న విషయంపై అంతుచిక్కని ప్రశ్నలను సంధిస్తోంది. ఏదేమైనా ఇలా లింకులు దొరకని కేసులు అత్యంత ప్రమాదకరమైనవి అని మర్చిపోకూడదు. అసలు వీరు కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులతో ఎటువంటి కాంటాక్ట్ పెట్టుకోకపోతే వీరికి కరుణ ఎలా సోకినట్లు? వారి విషయంలో అధికారులు కింద మీద పడుతున్నా ఫలితం రాకపోవడం ప్రస్తుత దుస్థితిని తెలియజేస్తోంది. దీని వల్ల రానున్న రోజుల్లో ఎలాంటి విపత్కర పరిణామాలు చోటుచేసుకున్నాయి అన్న ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. ఇలా ఈ కేసులకు లింక్ దొరకకపోవడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం నుంచి మరొకటి లేదన్న విమర్శ కూడా వినిపిస్తోంది. ఇక ఈ టెన్షన్ మనకు ఎప్పుటికి తగ్గేనో?...
బిగ్ స్టోరీ

వలస కార్మికులకు తీపి కబురు…స్వగ్రామాలకు రావచ్చు కానీ…..!

sharma somaraju
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను రెండు వారాలు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.. పలు ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ఏపి ప్రభుత్వం వివిధ ప్రాంతాలలో లాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న వలస కార్మికులకు తీపి కబురు...
బిగ్ స్టోరీ

కరోనాలో ప్రచార యావ!!

sharma somaraju
  కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా… ఎక్కడ విన్నా కరోనా బాధలే. కరోనా లాక్ డౌన్ తో జనజీవనం స్తంభించిపోయింది. రెక్కాడితే డొక్కాడని శ్రమజీవులు మొదలుకొని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల...
బిగ్ స్టోరీ

ఈ ఎమ్మెల్యే “కిక్కు” కోసం మాట్లాడారా…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మద్యం (ఆల్కహాల్) తాగితే గొంతులో కరోనా వైరస్ చచ్చిపోతుందట..! ఈ మాటలు అన్నది ఏ శాస్త్రవేత్తో కాదు, డబ్ల్యూ హెచ్ ఓ ప్రతినిధి అంతకంటే కాదు. ఫక్తు రాజకీయ నాయకుడు,...
బిగ్ స్టోరీ

థాకరే కి దారి దొరికినట్టే…!

sharma somaraju
ఓ పక్క రాష్ట్రాన్ని గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారి, మరో పక్క ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా కొనసాగే విషయంలో తలనొప్పి ఎదుర్కొంటున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఊరట...
బిగ్ స్టోరీ

అదే జరిగితే జగన్ TV5మూర్తి ని హీరో చేసినట్టే … !

siddhu
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కాకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరిలో ఉత్కంఠ రేపుతున్నది టీవీ 5 మూర్తి అరెస్ట్ కాబోతున్నాడు అన్న వార్త. తెలుగుదేశం పార్టీకి పరోక్ష కార్యకర్తగా మూర్తి వ్యవహరిస్తున్నాడని ఎప్పటినుంచో ఉన్న ఆరోపణ....
బిగ్ స్టోరీ

కరోనా… నీ మూలాలెక్కడ…??

Srinivas Manem
మందులకు లొంగట్లేదు… డబ్బుకి లొంగట్లేదు… మానవ మేదస్సులకు తలొగ్గట్లేదు… చికిత్సకు తగ్గడం లేదు… వ్యాప్తి ఆగడం లేదు… ఏంటి కరోనా? లోకంపై పగపట్టిందా? మనుషులపై పగపట్టిందా? జనజీవనంపై పెద్ద ప్రభావం చూపడానికి వచ్చిందా?? ఇవన్నీ...
బిగ్ స్టోరీ

జగనూ తలవంపులేల…!

Srinivas Manem
ఇల్లు కాలుతున్న వేళన చుట్ట వెలిగించుకుంటున్నట్టు…, ఊరు మునిగిపోతుంటే ఈత నేర్చుకున్నట్టుగా… ప్రపంచం, దేశం, పక్క రాష్ట్రం, మనం కూడా కరోనాతో అల్లాడుతున్న వేళన.., మన రాష్ట్రంలో మాత్రం రాజకీయం ఆగడం లేదు. ప్రతిపక్షం...
బిగ్ స్టోరీ

రాజకీయ జ్ఞానులూ…! లాక్ డౌన్ అయ్యేలోగా చెప్పుకోండి చూద్దాం…!

Srinivas Manem
జగన్ తనకి నచ్చని ఎన్నికల కమిషనర్ పదవీకాలం తగ్గించేలా ఆర్డినెస్ తెచ్చేయడం…! దానికి గవర్నర్ ఆమోదం తెలపడం…! జగన్ కొత్త ఎన్నికల కమిషనర్ ని నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం.. దానికి గవర్నర్ ఆమోదం తెలపడం…!...
బిగ్ స్టోరీ

తిండి తగ్గించాలా? మార్చాలా..?

Srinivas Manem
కరోనా వచ్చింది. మనతోనే ఉంది. కొన్ని నెలల్లో వెళ్ళిపోతుంది. ఏదోటి చేసి, మానవ మేధస్సుతో కాస్త ఆలస్యంగా అయినా విరుగుడు మందులు కనిపెట్టి దాన్ని అధిగమిస్తాం. సరే…! మరి అది చేసి పోయిన నష్టాన్నో…?...
బిగ్ స్టోరీ

కాలం మారినా కోటరీ మారదు…!

Srinivas Manem
ప్రతి పుట్టుకకు కారణం ఉంటుంది. ప్రతి ఎదుగుదలకు కారణం ఉంటుంది. ప్రతి తిరోగమనానికి ఒక కారణం ఉంటుంది. తిరోగమన దశ తర్వాత ప్రతి పునః పెరుగుదలకు ఒక కారణం ఉంటుంది. అది అన్వేషించడమే కష్టం....